Type Here to Get Search Results !

10/7/18 ముఖ్య విద్యా విషయక సమాచారం

అగ్రి వర్సిటీ సీట్లు స్పాట్‌ కౌన్సెలింగ్‌తో భర్తీ

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌, బీటెక్‌ (వ్యవసాయ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులకు సోమవారం స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కమ్యూనిటీ సైన్స్‌లో 83సీట్లకు ఇంటర్‌ బైపీసీ మార్కుల ఆధారంగా 351మంది అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలవగా, 135మంది హాజరయ్యారు. ఎంపీసీ స్ర్టీమ్‌ కోర్సులైన బీటెక్‌ (వ్యవసాయ ఇంజనీరింగ్‌), ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులకు రైతుకోటా కింద 40ు సీట్లకు ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు

రాష్ట్రంలో 4 సంవత్సరాల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు నిర్వహించుకునేందుకు 6 ప్రైవేట్‌ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో విశాఖపట్నంలో 2, విజయనగరంలో 4 కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. 2018-19 విద్యా సంవత్సరంలో ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ నాలుగేళ్ల సమీకృత ప్రోగ్రామ్‌లో డిగ్రీ, బీఈడీ కోర్సులు రెండూ కలిసి ఉంటాయి.

ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌, డి ఫార్మసీ కళాశాలల్లో భారీగా ఫీజుల పెంపు

ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌, డి ఫార్మసీ కళాశాలల్లో ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఒకేసారి 48 శాతం వరకు ఫీజులను పెంచుతూ ప్రభుత్వం సోమవారం జీవో నెంబరు 138 విడుదల చేసింది. ప్రైవేట్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌, డిఫార్మసీ కళాశాలల్లో ప్రస్తుతం రూ.3,800గా ఫీజును రూ.4,700లకు పెంచింది. ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల్లో రూ.15,500లున్న ఫీజును రూ.25వేలకు పెంచింది. ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌, డి ఫార్మసీ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న రూ.17వేలుగా ఉన్న ఫీజును రూ.25 వేలకు పెంచింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచిన ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌ దాస్‌ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల కుటుంబాలకు 'కారుణ్యం' చిక్కు

- మూడేళ్లుగా నిరీక్షణ
- పాత ఉత్తర్వులు తెరపైకి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తుకు బాటలేసిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్యం చిక్కు ఏర్పడింది. ఉద్యోగులు, ఉపాధ్యా యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్న విషయం విధితమే. ఈ మేరకు 1974లోనే ప్రభుత్వం 1005 జీవోను విడుదల చేసి నియామకాలు చేపడుతోంది. ఏ శాఖలో ఖాళీలు అందుబాటులో ఉన్నా సీనియారిటీ మేరకు ఉద్యోగం ఇచ్చేవారు. ఇది అన్నీ శాఖల్లోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అమలవుతోంది. అయితే 2013లో సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులను విడుదల చేసింది. ఇందులో భాగంగా మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, పంచాయతీరాజ్‌ యాజమాన్యం పరిధిలో ఉందని చెబుతోంది. వీటిల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చనిపోతే వారి వారసులకు అదే యాజమాన్యంలో ఉద్యోగాలివ్వాలని, ఇతర ప్రభుత్వ శాఖల్లో వీరి నియామకాలు చెల్లబోవని పేర్కొంది. అయితే విద్యాశాఖాధికారి ఈ పోస్టులన్నీ తమ పరిధిలో లేవని జిల్లాపరిషత్‌కు పంపారు. సిఇఓ ఈ పోస్టులను తాము భర్తీ చేయలేమని చెబుతూ తిరిగీ డిఇఓకు వెనక్కుపంపేశారు. ఈ గందరగోళ పరిస్థితులు ఉపాధ్యాయ కుటుంబాలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద లేకపోవడంతో ఆయా కుటుంబాలు నేడు నడివీధిలో నిలబడ్డాయి. ప్రభుత్వంలో ఉన్న కొందరు అధికారులు పెట్టిన మెలిక వల్ల వీరు పెద్ద దిక్కును కోల్పోయి, మూడేళ్లుగా ఎన్నో మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. వీరి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మూడేళ్లుగా ఉపాధి లేక అల్లాడుతున్నారు. వీరికి కారుణ్యనియామకాలివ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యికిపైగా కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఇలాంటి కుటుంబాలు చిత్తూరు జిల్లాలోనే 50కి పైగా ఉన్నాయి. కార్యాలయాల చుట్టూ అర్జీలు పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇతర శాఖల్లో కారుణ్య నియామకాల్లో వీరికన్నా వెనుక దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల పెట్టిన చిక్కువల్ల వీరి కుటుంబాలు ఉపాధి లేక అల్లాడుతున్నాయి.

రెండేళ్లుగా తిరుగుతున్నా
నా భర్త చనిపోయి రెండేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. వీరి చదువులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్నాను. అధికారులు తిప్పుతున్నారు.
లత, బాధితురాలు

విలువలతో కూడిన విద్యా విధానం

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
గ్రామ స్థాయి నుంచే విద్యార్థులను ఉన్నత మార్గంలో నడిపించే నూతన విద్యా విధానం దేశమంతా అమలు కావాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని వెలివెల సీతారామయ్య సెయింట్‌ జాన్స్‌ మాథ్యమికోన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సంస్కృతి, దేశభక్తి, సామాజిక స్పృహ, క్రమశిక్షణ ప్రతి విద్యార్థికి అందించడం ద్వారా ఆదర్శవంతమైన పౌరులగా రూపొందించాలని అన్నారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపేది విలువలతో కూడిన విద్య అని, అది పేద పిల్లలకు సైతం అందాలన్నారు. పరభాష మోజులో మాతృభాషను మరవకూడదని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో తెలుగును అమలు పరిచే విధంగా ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. అమ్మలాంటి భాషను మాతృభాష అని, వీటిని కళ్లుగా అభివర్ణించవచ్చని, పరభాష అనేది కళ్లజోడు లాంటిదని అన్నారు. సెయింట్‌ జాన్స్‌ యాభై ఏళ్ల సుధీర్ఘ చరిత్రలో వేలాది మందికి విలువలతో కూడిన విద్యను అందించడం వల్ల స్కూలు ప్రతిష్ట దేశ, విదేశాల్లో మార్మోగుతోందన్నారు. పూర్వ విద్యార్ధులు ఈ వేడుకల్లో పాల్గొని పండుగలా జరుపుకోవడం విశేషమన్నారు. 1969లో స్కూలు యాజమాన్యం కోరిక మేరకు పెద్దలు వెలివెల సీతారామయ్య భూములను దానం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపిలు కొనకళ్ల నారాయణరావు, మాగంటి బాబు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ బ్రదర్‌ బాలసౌరి పాల్గొన్నారు.

అవే వెతలు.

*♦గురువు చెప్పిందే పాఠం*
*♦పిల్లల చేతుల్లో పుస్తకాలేవీ?*
*♦కళ్ల ముందు ఫార్మెటివ్‌ పరీక్షలు*
*♦ఇలాగైతే సన్నద్ధమయ్యేది ఎలా?*
🌻వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే పిల్లల చేతుల్లో పాఠ్యపుస్తకాలు పెడతామని విద్యాశాఖ గొప్పలకు పోయింది.
🌻అవన్నీ ఒట్టిమాటలేనని తేలిపోయింది. గుంటూరు జిల్లా విద్యాశాఖ అయితే ఓ అడుగు ముందుకేసి పుస్తకాలన్నీ విజయవాడ, గుంటూరులోనే ముద్రితమవుతున్నాయని వచ్చినవి వచ్చినట్లు అందజేస్తామని చెప్పింది. చిత్తశుద్ధి లేనప్పుడు ఏవీ అమలు కావనడానికి ఇదో ఉదాహరణ.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. 35 శాతం పుస్తకాలు రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బడులు తెరిచి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఒక పుస్తకం ఉంటే మరొకటి లేదు. ఇలా అరకొర పుస్తకాలతోనే నెట్టుకొస్తున్నారు.
🌻ఒక్క మాటలో చెప్పాలంటే గురువు బోధించేది పాఠంగా ఉంటోంది. సొంతంగా పిల్లలు పుస్తకం చూసి పాఠ్యాంశం వినే పరిస్థితి లేదు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికార యంత్రాంగం మొత్తం ఉన్న రాజధాని జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఉందంటే ఇతర చోట్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
🌻6 నుంచి 9వ తరగతి చదివే పిల్లలకు అటు తెలుగు, ఇటు ఆంగ్ల మాధ్యమంలో ఏ ఒక్క సెట్‌ పూర్తిగా రాలేదు. మరోవైపు విద్యార్థులకు ఫార్మెటివ్‌ పరీక్షలు(ఎఫ్‌ఏ-1) కళ్లముందే కనిపిస్తున్నాయి. ఆగస్టు 2 నుంచి 4వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభుత్వం, గుర్తింపు పొందిన పైవ్రేటు పాఠశాలలకు సమాచారం వెళ్లింది. ఒకవైపు పుస్తకాలు లేకుండా సిలబస్‌ పూర్తిచేసినా ఆ పరీక్షలను ఎలా రాయగలమని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

*♦ప్రైవేటులో పూర్తిస్థాయిలో..*
పిల్లల చేతుల్లో పుస్తకాలు లేకుండా ఏం పాఠ్యాంశాలు బోధిస్తామని ఉపాధ్యాయులు మిన్నకుండిపోతున్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన మొక్కుబడిగా మారింది. మరోవైపు ప్రైవేటు మార్కెట్లో మాత్రం అధిక ధరలకు ఈ పుస్తకాలు లభ్యం కావటం గమనార్హం. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ప్రచురణకర్తలే వాటిని ముద్రిస్తారు. కొందరు ముద్రణకర్తలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన ఇండెంట్‌ మేరకు పుస్తకాలు ముద్రించకుండా తొలుత ప్రైవేటు మార్కెట్లో పుస్తక వ్యాపారులకు సరఫరా చేస్తున్నారని, దీనివల్లే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు అందటం లేదని తెలుస్తోంది.
🌻గుంటూరు జిల్లాలో 3250, కృష్ణాజిల్లాలో 2850 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి దాకా ఈ రెండు జిల్లాలకు ఇండెంట్‌లో 65 శాతం పుస్తకాలు మాత్రమే చేరాయి. ఇంకా 35 శాతం పుస్తకాలు ముద్రణదశలోనే ఉన్నాయి. ఈ ఏడాది పుస్తకాల ముద్రణకు టెండర్లు పిలవటమే చాలా జాప్యమైందని అందువల్లే పుస్తకాలు సకాలంలో ముద్రితం కాలేదని విద్యాశాఖ అధికారి ఒకరు వివరించారు. మరోవైపు పుస్తకాలు లేకుండా చదువులు చెబితే బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముద్రణకర్తలు సకాలంలో వాటిని ముద్రించి ఇవ్వకపోతే తామేం చేయగలమని ఉపాధ్యాయులు అంటున్నారు.

*👉ఇవిగో పుస్తకాల కొరత ఇలా..*
* 6వ తరగతి తెలుగు, ఆంగ్లమాధ్యమం విద్యార్థులకు హిందీ, ఇంగ్లిష్‌ పుస్తకాలు లేవు. ఆంగ్లమాధ్యమం విద్యార్థులకు 6వ తరగతి సైన్సు పుస్తకం ముద్రితమవ్వలేదు.

* 7వ తరగతి తెలుగుమీడియం విద్యార్థులకు హిందీ, సాంఘికశాస్త్రం, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు సాంఘికశాస్త్రం రాలేదు.
* 8వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఆంగ్ల మాధ్యమం చదివే విద్యార్థులకు బయలాజికల్‌ సైన్సు రాలేదు.
* 9వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఫిజిక్స్‌, బయలాజికల్‌ సైన్సు పుస్తకాలు ఇప్పటిదాకా పాఠశాలలకు చేరలేదు.

✍ఆన్‌లైన్‌ భారం విద్యార్థులపై

*♦ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల్లో ప్రైవేటు సంస్థకు వెసులుబాటు*
*♦ఉన్నత విద్యామండలి నిర్ణయంతో నష్టపోతున్న విద్యార్థులు*
*♦కోట్లు ఆర్జిస్తున్న సంస్థ*

🌻ఆన్‌లైన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, నియామక దరఖాస్తుల స్వీకరణలో ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

🌻సాధారణంగా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, నిర్వహణకు కొంతమొత్తం నిర్ణయించి, చెల్లించడం పరిపాటి. ఉన్నత విద్యామండలి మాత్రం విద్యార్థుల నుంచి సాఫ్ట్‌వేర్‌ సంస్థే వసూలు చేసుకునే విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో విద్యార్థులు నష్టపోతుండగా ప్రైవేటు కంపెనీ రూ.కోట్ల ఆదాయం సముపార్జిస్తోంది. ఈ చెల్లింపులు అధికంగా ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి తగ్గించాలని అనుకుంటున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులే పేర్కొనడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌ ఇలా అన్ని రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కలిపి ఏటా దాదాపు ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేవరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కొంతమొత్తం నిర్ణయించలేదు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 వసూలు చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు వెసులుబాటు కల్పించింది.
🌻ఈ క్రమంలో ఎంసెట్‌కు 2,67,670మంది దరఖాసు చేశారు. అంటే ఈ లెక్కన ఒక్క ఎంసెట్‌కే దాదాపు రూ.1.34కోట్లు ఆ సంస్థ ఆర్జించింది. ఇలా అన్ని సెట్లకు కలిపి లెక్కిస్తే రూ.2.50 కోట్లు ఒక్క ఉమ్మడి ప్రవేశ పరీక్షలకే విద్యార్థులు చెల్లించారు. పేమెంట్‌ గేట్‌వే ఉన్నందున ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.15 ఖర్చు వచ్చినా మొత్తం రూ.75లక్షలు బ్యాంకులకు చెల్లించినా రూ.1.75కోట్లకు పైగా ఆర్జించింది.
* ఇటీవల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఇదే విధానాన్ని అమలు చేశారు. సుమారు 25వేల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. ఒక్కో విద్యార్థి మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేయగా పోస్టుల ప్రకారం రూ.150-200 వసూలు చేశారు. ఈ విధంగా రూ.43.44లక్షలు విద్యార్థుల నుంచే వసూలు చేశారు.
* తాజాగా పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇదే విధానాన్ని అమలు చేసేందుకు ఆమోదించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 వసూలు చేసుకునేందుకు అనుమతించారు. దీనికి దాదాపు 40వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మరో రూ.20 లక్షలు వసూలు కానున్నాయి.
* ఉన్నత విద్యామండలి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అంతా కొంచెం అటుఇటుగా ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేసిన తర్వాత, చిన్నచిన్న మార్పులతోనే వినియోగించుకోవచ్చు. కానీ, అధికారులు మాత్రం ప్రతి పరీక్షకు వారికి రూ.50 వసూలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు.

భాషోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

🌻అపరిష్కృతంగా ఉన్న భాషోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఉపాధ్యాయులు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్‌కొండయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న భాషోపాధ్యాయుల సమస్యలను ఆలకించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులకు ఇతర సబ్జెక్టుల మాదిరిగా సమాన హోదా ఇవ్వాలని పలు దఫాలుగా కోరామన్నారు.

🌻ప్రస్తుతం 1450 మందిని స్కూల్‌ అసిస్టెంట్‌లుగా కల్పించిన పదోన్నతుల్లో 70శాతం మాత్రమే అప్‌గ్రేడ్‌ చేశారని, అలాకాకుండా వందశాతం పదోన్నతులతోనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

🌻భాషా పండితుల వ్యవస్థను రద్దు చేసి స్కూల్‌ అసిస్టెంట్లుగా నియమించాలని, హిందీలో 35 పాసుమార్కులు, ఆరు పీరియడ్ల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పల్లా భాస్కర్‌, రాష్ట్ర నాయకులు బోగా గంగాధర్‌, సాయికుమార్‌, మధు, శేఖర్‌, జిల్లా ప్రతినిధులు ఖాదర్‌బాషా, రమణమూర్తి, సురేస్‌, విజయకుమార్‌, బాలసుందరం పాల్గొన్నారు.

ఎస్జీటీ వర్సెస్‌ బీఈడీ✍

*♦-ఎన్‌సీఆర్టీపై ఆగ్రహం*
*♦-ఉద్యమిస్తున్న డీఎడ్‌లు*
*♦-సర్కారు నిర్లక్ష్యంపై నిరసనలు*
*♦-డీఎస్సీ జాప్యంపై అసంతృప్తి*
🌻రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులకూ అనుమతులిస్తూ జాతీయ విద్యా, పరిశోధనా విద్యామండలి (ఎన్‌సీఈఆర్టీ) ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై డీఎడ్‌ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు రెండు రోజుల ముందు వచ్చిన ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రెండు విడతలుగా టెట్‌ పరీక్షలు రాసి, అర్హత సాధించిన వారంతా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోయే..10,351 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు సగం ఉన్నాయి.
🌻 ఈ విడత ఎస్జీటీ పోస్టులకూ పోటీగా బీఈడీలూ దిగడంతో డీఎడ్‌ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా నిరసనలకు దిగుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరిజిల్లా కాకినాడ కలెక్టరేట్‌ కేంద్రంగా పెద్దఎత్తున టెట్‌లో అర్హత సాధించిన డీఎడ్‌ అభ్యర్థులు ఉద్యమించారు. ఎస్జీటీలకు ఎసరు పెట్టొద్దనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ భవితతో చెలగాటమాడుతున్నాయని వాపోతున్నారు.
🌻కాకినాడ కేంద్రంగా ప్రారంభమైన ఎస్జీటీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్యలతో విద్యాశాఖా ఉన్నతాధికారులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఈ నెల 6వ తేదీన విడుదలవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆర్థికశాఖ నుంచి అనుమతులు రాలేదని, ఎన్సీఆర్టీ నిబంధనలతో పలు సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశముందని తెలుపుతూ..మంత్రి గంటా వాయిదా వేశారు.
🌻ప్రభుత్వ వైఖర్ని చూస్తుంటే..ఇప్పట్లో ఈ నోటిఫికేషన్‌ ఇచ్చే పరిస్థితులు కన్పించట్లేదు. దీంతో టెట్‌లో అర్హత సాధించి, డీఎస్సీ కోచింగ్‌లో ఉన్న అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు.

మూడో టెట్‌ పెడతారా?
బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులు రాసుకునేందుకుగాను మళ్లీ మూడో టెట్‌ పెడతారా? లేదా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఎస్జీటీ పోస్టులను బీఈడీలు రాయాలంటే తప్పనిసరిగా టెట్‌ పేపర్‌-1లో అర్హత సాధించాలి. వారి కోసం మళ్లీ మూడో విడత టెట్‌ పెడితే.. డీఎస్సీ నోటిఫికేషన్‌కు మరింత జాప్యం ఏర్పడుతుంది.
🌻ఏడాది డిసెంబరు నుంచి డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదాలు పడుతోంది. అర్హులైన అభ్యర్థులంతా వేలాది రూపాయలు వెచ్చించి..టెట్‌, డీఎస్సీల కోసం శిక్షణ పొందుతున్నారు. అనుకున్న సమయానికి నోటిఫికేషన్‌ ఇవ్వనందున వారంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. తాజాగా ఎస్జీటీ పోస్టులకు బీఈడీలనూ అనుమతివ్వడంతో ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్జీటీ పోస్టుల వ్యవహారంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకుగాను ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.

6 విద్యా సంస్థలకు కిరీటం✍

🌻న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, బిట్స్‌ పిలానీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను కేంద్రం ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది.
🌻ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది.

*♦టాప్‌ 100లో ఒక్క వర్సిటీ లేదు
‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్‌ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ట్వీట్‌ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 27 టాప్‌ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థలు ఉన్నాయి.

*♦ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా?*
రిలయన్స్‌ సంస్థకు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్‌స్టిట్యూట్‌ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్‌స్టిట్యూట్‌కు క్యాంపస్‌ లేదు. వెబ్‌సైట్‌ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌ లేదా ప్రైవేట్‌ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్‌లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది.

లక్ష్యానికిఅడుగులు

*♦పదిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి*
*♦గ్రేడ్‌లపై ప్రత్యేక దృష్టి*
*♦నిపుణులతో ప్రత్యేక మెటీరియల్‌*
*♦ప్రైవేటుకు దీటుగా పురపాలక పాఠశాలలు*
🌻పేదరికం అంతం కావాలంటే ప్రతి కుటుంబంలో పిల్లలు బాగా చదువుకోవాలి. ఈ లక్ష్యంతో పురపాలక సంఘం పరిధిలోని పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
🌻ఒక లక్ష్యం నిర్దేశించుకుని అడుగులు వేయాలని ప్రధానోపాధ్యాయులకు పురపాలక శాఖ డీఎంఏ ఆదేశాలు జారీ చేశారు. తొలిదశ ప్రయత్నంగా ఉన్నత పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపునకు ప్రత్యేక కార్యాచరణ తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. దీనికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పురపాలక సంఘ ప్రధానోపాధ్యాయులు, కమిషనర్లకు ఈ బాధ్యతలను అప్పగించారు.
🌻రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో 10గ్రేడ్‌ (జీపీఏ) సాధించే విద్యార్థుల సంఖ్య పెరగాలన్నదే ప్రభుత్వ నిర్ణయం. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై లక్ష్య సాధనకు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆదేశాలు వచ్చాయి.

*♦ఈ ఏడాది 1500 మందికి 10 జీపీఏ సాధనే లక్ష్యం*
రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో 2017 సంవత్సరం మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 59 మంది మాత్రమే 10 గ్రేడ్‌ తెచ్చుకోగా...ఈ ఏడాది 303 మంది ఉన్నారు. 2018-2019 విద్యాసంవత్సరంలో 1500 మందికి తగ్గకుండా 10 గ్రేడ్‌ రావాలని లక్ష్యం నిర్ధేశించి విద్యాబోధన చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి 10శాతం మందికి 10 గ్రేడ్‌ రావాలని సూంచింది.

*♦నేటి నుంచి అదనపు తరగతులు*
ముందస్తు తరగతులు, అదనపు తరగతుల నిర్వహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రయత్నంలో భాగంగా గత ఏడాది నవంబరు 26 నుంచి అదనపు తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది జులై 10నుంచి అదనపు తరగతులు నిర్వహించాలని నిర్థేశించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పాఠశాల తరగతులు ముగిశాక రెండు గంటల పాటు అదనపు తరగతులు నిర్వహిస్తారు. పాఠ్యాంశాల వారీగా ప్రతి ఉపాధ్యాయుడికి రోజుకు రూ.250 అదనపు పారితోషికాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఏడాది 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ మే 1 నుంచి 31వరకు 'జ్ఞానధార' పేరుతో ముందస్తు తరగతులు నిర్వహించారు. ఈ విధానం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

*♦నిపుణులకు గౌరవ వేతనం*
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పాఠ్యపుస్తకాలతో పాటుగా పురపాలకశాఖ డీఎంఏ కార్యాలయం పాఠ్యాంశాల వారీగా ప్రత్యేకమైన మెటీరియల్‌ అందజేస్తోంది దాన్ని తయారు చేయటానికి ప్రతి జిల్లా నుంచి 6-7గురు నిపుణులను ఎంపిక చేశారు. వీరికి ప్రతి నెల రూ.10వేలు గౌరవ వేతనం (జీతం కాకుండా) ప్రభుత్వం చెల్లిస్తోంది. తరగతిలో కొంచెం వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఈ మెటీరియల్‌ చాలా వరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

*♦మైక్రో షెడ్యూల్‌ అమలు*
మెరుగైన బోధనతో పాటుగా విద్యార్థులకు నిరంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి షెడ్యూల్‌ను తయారు చేశారు. సైకిల్‌ ఎగ్జామ్స్‌ పేరుతో నాలుగు సైకిల్స్‌ ఉంటాయి. ఈనెల 16 నుంచి మైక్రోషెడ్యూల్‌ పేరుతో వీటిని అమలు చేయనున్నారు. విద్యార్థులకు రోజూ ఒక పరీక్షను ఎంపిక చేసిన పాఠ్యాంశంలో నిర్వహిస్తారు. ఈ విధానం పైవేటు పాఠశాలల్లోనే అమలులో ఉంది.

✍చలానా అప్‌డేట్‌కు మూడు రోజులా?

*♦సీఎఫ్‌ఎంఎస్‌లో లోపాలు... జనానికి ఇక్కట్లు*
♦ఒకే చలానాను మళ్లీ మళ్లీ దుర్వినియోగం చేసే చాన్స్‌*
🌻అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఒకాయన రిజిస్ర్టేషన్‌ చేసుకోవడానికి చలానా కట్టారు. ఆర్థిక శాఖ కొత్తగా తెచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం(సీఎఫ్‌ఎంఎస్‌)ద్వారానే చలానాలు కట్టాల్సి ఉండడంతో అదే పని చేశారు. బ్యాంకుకెళ్లి చలానా చెల్లించారు. రిజిస్ర్టేషన్‌ చేయించుకోవడానికి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లాడు. కానీ అతను బ్యాంకులో చలానా కట్టిన విషయం సబ్‌రిజిస్ర్టారు కంప్యూటర్‌కు చేరలేదు. చలానా కట్టానని సదరు వ్యక్తి... మా దగ్గర చూపించడం లేదని సబ్‌ రిజిస్ట్రారు చెప్పడంతో వచ్చిన వాళ్లంతా నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
🌻ఒక్క రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల్లోనే కాదు...ప్రజలు ప్రతిరోజు లావాదేవీలు జరిపే వాణిజ్య పన్నులు, రవాణా శాఖల్లోను ఇదే పరిస్థితి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో ఆన్‌లైన్‌లో డబ్బులు కడితే ఫర్వాలేదు. ఆఫ్‌లైన్‌లో అంటే బ్యాంకులకు వెళ్లి, ఏటీఎంల ద్వారా కడితే ఇక అంతే సంగతులు.
🌻ఆ సమాచారం సంబంధిత అధికారికి చేరడానికి 72 గంటలు పడుతోంది. అంటే ఏదైనా పని జరిగారలంటే మూడు, నాలుగు రోజుల ముందు చలానా కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మరో సమస్య కూడా ఈ విధానంలో ఎదురవుతోంది. ఆలస్యంగానైనా చలానా కట్టారా? లేదా? అన్నది వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఒకసారి కట్టిన చలానానే పలుమార్లు ఉపయోగిస్తే దానిని గుర్తించే ఏర్పాటు లేదు.
🌻మరోవైపు చలానాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్నది తెలిపే రీకన్సిలియేషన్‌ రిపోర్టు ఇచ్చే వ్యవస్థ సీఎఫ్‌ఎంస్‌లో లేదు. ఉదాహరణకు పటమట సబ్‌రిజిస్ట్రారు పేరుతో ఒక నెలలో 100చలానాలు తీస్తే.. ఆ నెల చివరిలో ఆ వంద చలానాల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్న విషయంపై ఒక నివేదిక ఉండాలి. అలా నివేదిక లేకపోవడం వల్ల ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖర్చయిందన్నది తెలియడం లేదు. ఆన్‌లైన్‌లోనే చలానాలు కట్టాలని అందరినీ కోరుతున్నామని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ గుంటూరు రేంజ్‌ డీఐజీ పుష్పలత పేర్కొన్నారు.

 విద్యా సంస్థలకు 'ఎమినెస్' హోదా*

🌻న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో మొత్తం ఆరు విద్యా సంస్థలకు 'ఎమినెస్' (గొప్ప లేదా ఘనత వహించిన) హోదాను ఇచ్చినట్టు జాతీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలకేగాక, ప్రైవేటు రంగానికి కూడా దీనిని వర్తింప చేస్తారు. వచ్చే ఐదేళ్ల కాలానికి మూడు యూనివర్శిటీలకు హెచ్‌ఆర్‌డీ 1,000 కోట్ల రూపాయలను కేటయించింది.
🌻 ఎమినెస్ హోదాను పొందిన పబ్లిక్ రంగ విద్యా సంస్థలు మాత్రమే ప్రభుత్వ గ్రాంట్‌ను ఇస్తారు. ప్రైవేటు రంగంలోని సంస్థలకు ఈ హోదా దక్కినప్పటికీ, గ్రాంట్ లభించదు. కాగా, వచ్చీ ఐదేళ్ల కాలానికిగాను పబ్లిక్ సెక్టార్‌లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ (ఐఐఎస్‌సి) సంస్థలకు ఎమినెస్ హోదా లభించింది.
🌻ప్రైవేటు రంగంలో ఈ హోదాకు మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఎమినెస్ హోదా దక్కింది. ఎమినెస్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందడంతో, ఈ విద్యా సంస్థలకు అటామస్ హోదా లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో చెరి పది చొప్పున మొత్తం 20 విద్యా సంస్థలకు ఎమినెస్ హోదాను ఇవ్వాలని, తద్వారా ఆయా సంస్థలు స్వతంత్రంగా పని చేసే వీలు కల్పించాలని హెచ్‌ఆర్‌డీ భావిస్తున్నది. జాతీయ ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ గోపలస్వామి నేత్వంలోని నిపుణుల కమిటీ (ఈఈసీ) తొలి విడతగా ఆరు విద్యా సంస్థలను ఎంపిక చేసింది.
🌻ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
Tags