Type Here to Get Search Results !

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు- ఫ్యాప్టో

తేది.10.07.2018 అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు- ఫ్యాప్టో

విద్యారంగ-ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై రేపు (11.07.2018) ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ - మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకోవడానికి జిల్లాలో ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఫ్యాప్టో తీవ్రంగా ఖండిస్తుందని ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ పి.బాబురెడ్డి, జి.హృదయరాజులు పత్రికా విలేఖర్ల సమావేశంలో తెలిపారు.

సమస్యల పరిష్కారానికి జూన్ 28వ తేదీన ఫ్యాప్టో ప్రభుత్వానికి ప్రత్యక్ష చర్య నోటీసు సమర్పించిందని, ప్రజాస్వామ్యయుతంగా ఫ్యాప్టోను ఆహ్వానించి చర్చించాల్సింది పోయి జిల్లాలో వున్న ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులను ఇంటిదగ్గర, పాఠశాలల వద్దకు వెళ్ళి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. యుటియఫ్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేఖర్ల సమావేశంలో ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. వెంటనే అరెస్టులు, గృహ నిర్బంధం చేసిన నాయకులను విడుదల చేయాలన్నారు. రేపటి ర్యాలీ-మహాధర్నా జయప్రదం చేయాలని ఉపాధ్యాయులనుఫ్యాప్టో కోరింది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఫ్యాప్టో కో-చైర్మన్స్ జి.నాగేశ్వరరావు, పి.కృష్ణయ్య, ఏపీజెఏసి సెక్రటరీ జనరల్ సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబులు పాల్గొన్నారు
Tags