టెన్త్‌లో ఏపీ నంబర్ 2
*♦అభ్యసన విధానాలు భేష్.. నేషనల్ అచీవ్ మెంట్ సర్వేలో వెల్లడి**♦గణితం, సామాన్య శాస్త్రాల్లో తొలిస్థానం*
*♦సాంఘిక శాస్త్రం, ఇంగ్లీషులో ఐదో స్థానం*
*♦తూర్పుగోదావరికి మొదటి, కృష్ణా జిల్లాకు రెండో స్థానం*
పదో తరగతి విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో నవ్యాంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించింది. విద్యా లక్ష్యాలు, అభ్యసన ఫలితాలు ఏ మేరకు సాధిస్తున్నామో తెలుసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి ఆధ్వరంలో జరిగిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(నా్‌స)లో ఈ విషయం స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న దేశ వ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 610 జిల్లాలకు సంబంధించి 15 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.
🌻 ఇందులో ఏపీ నుంచి 1029 పాఠశాలలకు చెందిన 36,109 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా ఆయా అంశాల్లో తమ అభ్యసనా స్థాయిలను ప్రదర్శించారు. గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాషలపై ఈ సర్వే నిర్వహించారు.
🌻ఫలితాల్లో న్యూఢిల్లీ తొలిస్థానం(45.6%) సాధించగా, ఏపీ రెండో స్థానం(44.6%)లో నిలిచింది. గోవా మూడోస్థానం(44.1%), కర్నాటక నాలుగో స్థానం(43.7%) సాధించాయి.
గణితం, సామాన్యశాస్త్రాల్లో ఏపీ దేశంలోనే తొలిస్థానం సాధించగా, సాంఘిక శాస్త్రం, ఆంగ్లంలో ఐదో స్థానంలో నిలిచింది.
గణితం, సామాన్యశాస్త్రాల్లో దేశ సగటు 32.9%, 34.1%లతో పోలిస్తే ఏపీ 40.9%, 41.2%లతో అగ్రస్థానంలో నిలిచింది.
సాంఘిక శాస్త్రం, ఆంగ్లంలో దేశ సగటు 39.3%, 37.8% ఉండగా రాష్ట్ర సగటు 43.1%, 43.3%తో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచాయి.
🌻ఆధునిక భారతీయ భాష(తెలుగు)లో తెలంగాణ 51.6% సగటు సాధించగా, ఏపీ 54.5% సగటుతో ముందుండటం గమనార్హం.
*👉రాష్ట్రంలో..*
తూర్పుగోదావరి జిల్లా 51.5% సగటుతో తొలిస్థానం, కృష్ణా జిల్లా 46.6% సగటుతో రెండో స్థానం, ప్రకాశం జిల్లా 46.3% సగటుతో మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్ర సగటు కన్నా ఏడు జిల్లాలు అధికంగాను, ఆరు జిల్లాలు తక్కువగాను ఉన్నాయి.
🌻సంంస్థలు....
పదో తరగతి విద్యాభ్యసనంలో ఏపీ దేశంలోనే రెండో స్థానం సాధించడం పట్ల పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సంస్కరణలు, వినూత్న కార్యక్రమాల నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
కేజీ నుంచి పీజీ..
*ఆన్‌లైన్ వర్సిటీ: గంటా✍📚*🌻ఒక గ్రామంలో కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా చదువుకునేలా ఆన్‌లైన్ వర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
🌻ఈ వినూత్న పథకానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించిన తర్వాత దీనిపై సీఎంతో చర్చిస్తామన్నారు.
మైనారిటీ విద్యార్థులకు ఉపకారం✍
*♦70 లక్షల మందికి రూ 5వేల కోట్ల మేర స్కాలర్‌షిప్పులు*మైనారిటీ విద్యార్థులకిస్తున్న ఉపకార వేతనాల్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ-ఆధారిత ఉపకార వేతనాలను 2020 దాకా ఇవ్వాలని నిశ్చయించి దీనికి రూ 5338.32 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ బుధవారం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది.
🌻 దీని వల్ల సుమారు 70లక్షలకు పైగా మైనారిటీ విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఈ ఉపకార వేతనాలు పాతవే అయినా.. ఎన్నికల సంవత్సరంలో వీటిని నిరాటంకంగా కొనసాగించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. కాగా, ఇళ్లు కొనుక్కునే వారిని హామీతో కూడిన రుణదాతలుగా గుర్తించే బిల్లును కూడా ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.
పాసైతేనే పైతరగతికి...
‘నో డిటెన్షన్’ విధానానికి తెర**♦అమలు రాష్ట్రాల ఇష్టం: జావడేకర్*
🌻న్యూఢిల్లీ, జూలై 18: ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసేందుకు వీలుగా విద్యా హక్కు చట్ట సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ విధానాన్ని రద్దు చేయలా లేక కొనసాగించాలా అనే అంశాన్ని రాష్ట్రాల విచక్షణకే విడిచిపెడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. విద్యా హక్కు చట్టం కింద 8వ తరగతి వరకు విద్యార్థులను డిటైన్ చేయడానికి వీల్లేదు.
🌻ఉత్తీర్ణత సాధించకపోయినా పైతరగతికి ప్రమోట్ చేయాల్సిందే. తాజా సవరణతో డిటెన్షన్ విధానం తిరిగి అమలులోకి రానుంది. 5, 8 తరగతుల విద్యార్థులు ఫెయిల్ అయితే మరో అవకాశం ఇస్తారు.
సెంట్రల్ వర్సిటీ కేంద్ర కేబినెట్ ఆమోదం
🌻ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు సెంట్రల్ యూనివర్సిటీస్(సవరణ) బిల్లు-2018ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.🌻బిల్లు ఆమోదానికిముందే సొసైటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీని ప్రారంభించామని కేంద్ర మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు.
వర్సిటీల్లో సీఎం క్లిక్...
*♦పురుషులు, మహిళల విభాగాల్లో క్రీడలు**♦శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి వెల్లడి*
🌻రాష్ట్ర స్పోర్ట్స్ కేలెండర్‌లో అత్యంత ఆదరణ పొందిన సీఎం కప్ (చీఫ్ మినిస్టర్స్ కప్) క్రీడాభిమానులను మళ్లీ అలరించనుంది. ఈ ఏడాది నుంచి సీఎం కప్‌ను నిర్వహించనున్నామని శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించినట్టు చెప్పారు. శాప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
🌻 సమావేశంలో శాప్ ఆధ్వర్యంలో ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో సీఎం కప్ నిర్వహణపై వారు చర్చించారు. ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో జరిగే ఈ సీఎం కప్‌లో పురుషుల విభాగంలో 9, మహిళల విభాగంలో 7 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.
🌻మహిళల విభాగంలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బాల్ బాడ్మింటన్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పురుషులకు వీటితోపాటు క్రికెట్, ఫుట్‌బాల్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశం సందర్భంగా అనేక ప్రతిపాదనలు శాప్ ముందుకొచ్చాయి. విశ్వవిద్యాలయాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి, 2018-19 విద్యా సంవత్సరంలో ఆలిండియా సౌత్‌జోన్ యూనివర్సిటీ పోటీల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.
🌻 అన్ని వర్సిటీల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి శాప్ ఇంజనీర్ల సాంకేతిక సహాయం తీసుకుని పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని శాప్ ఎండీ బంగర్రాజు సూచించారు.
నెలల్లో నిరుద్యోగ సమాచారం✍
🌻న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో నిరుద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని రెండు నెలల్లో విడుదల చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతో్‌షకుమార్ గాంగ్వార్ రాజ్యసభలో తెలిపారు.🌻2016 నుంచి ఇప్పటివరకు ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేస్తామన్నారు.
వర్చువల్ ఐడీని ఆమోదించాల్సిందే: యూఐడీఏఐ*
🌻న్యూఢిల్లీ, జూలై 18: ‘‘వర్చువల్ ఐడీ, యూఐడీ టోకెన్... ఆధార్ నంబరుకు వేర్వేరు రూపాలు. వీటిని 12 అంకెల బయోమెట్రిక్ సంఖ్యగానే పరిగణించి, గుర్తింపు ధ్రువీకరణగా ఆమోదించాలి’’ అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత అంశం దృష్ట్యా రెండు అంచెల భద్రత ఉన్న వర్చువల్ ఐడీ (వీఐడీ), యూఐడీ టోకెన్‌ను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది.🌻 జూలై 1 నుంచి వర్చువల్ ఐడీ అమలులోకి వచ్చింది. దీన్ని ఆధార్ కార్డుదారుడు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. వీఐడీ తాత్కాలికంగా కేటాయించే 16 అంకెల సంఖ్య. మరోవైపు యూఐడీ టోకెన్ వివిధ సంస్థలు తమ వినియోగదారులను ప్రత్యేక అంశాల ద్వారా గుర్తించేందుకు వీలు కల్పించే విధానం.
🌻 ఇందులో ఆయా సంస్థల డేటాబే్‌సలో వినియోగదారుడి ఆధార్ సంఖ్య లేకపోయినా ఫర్వాలేదు. వీఐడీ, యూఐడీలను అంగీకరించేందుకు వీలుగా సంబంధిత సంస్థలు తమ సిస్టమ్‌లలో మార్పులు చేసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది.
🌻కనీస డేటా మాత్రమే సేకరించాలి
మొబైల్ యాప్‌ల వినియోగదారుల నుంచి కనీస సమాచారాన్ని మాత్రమే సేకరించాలని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ అన్నారు. ఆధార్ సంఖ్య ఇవ్వడానికి యూఐడీఏఐ ఏ విధంగా కనీస డేటా మాత్రమే సేకరిస్తోందో యాప్‌లు కూడా అదే మార్గం అనుసరించాలన్నారు. కొన్ని యాప్‌లు వింతగా అవసరమైనదాని కంటే ఎక్కువ సమాచారం దోచేస్తున్నాయని చెప్పారు.