Day-2 Class 3-5 We Love Reading Summer Activities 2023 2nd May 2023. This post contains the Telugu, English, Maths, and Drawing Activities for Day 2 for Classes 3-5
Never Miss any Update: Join Our Free Alerts:- Join Whatsapp Community for Free Daily Alerts Click Here
- Join Telegram Channel for Free Daily Alerts Click Here
Day-2 Class 3-5 We Love Reading Summer Activities 2023 2nd May 2023
Telugu Activities - Reading - Writing
దర్జీవాడు - ఏనుగు
ఒకఊళ్ళో రహీమ్ అనే దర్జీవాడు ఉండేవాడు. అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు. అందుచేత అతని దుకాణమెప్పుడూ జనంతో రద్దీగా ఉండేది. ఆ ఊళ్ళో పెద్దదేవాలయమొకటి ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది. దానిపై దేముళ్ళను బెట్టి పండుగ, దినాలలో ఊరేగించేవారు.ఆ ఏనుగు ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి రహీమ్ దుకాణం ముందునుండే వెళ్తుండేది. రహీమ్కు ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది.
ప్రతీరోజూ దానికి ఏదో పండుగాని, చెఱకు ముక్కగాని పెడ్తూండేవాడు. అది అలవాటుగా మారి వేళతప్పకుండా ప్రతీసారీ వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది. ఏదో ఒకటి అతను యిచ్చిన తర్వాతనే అక్కడినుండి వెళ్ళేది.
ఒకరోజున రహీమ్ తనఖాతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు. ఆ రోజు అతని మనస్సు ఏమీ బాగోలేదు. పాపం! దానికి ఆ విషయాలేవీ తెలియవుకదా! ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది. ఎంతసేపైనా రహీమ్ దానికేదీ పెట్టలేదు. తనను చూడలేదేమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ఘీంకరించింది. దాని అరుపుకు చికాకుపడి రహీమ్ తన చేతిలోని సూదితో దాని చెవిమీద గుచ్చేడు. దానికి చాలా బాధ అన్పించింది. ఆ బాధతో అది వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది.
నదిలో స్నానంచేస్తూ రహీము బుద్ధిచెప్పడానికి ఒక ఆలోచనచేసింది. తన తొండం నిండా మురికి నీళ్ళను పీల్చుకొని రహీం షాపువద్దకు వచ్చింది. వెంటనే ఆ బురదనీటిని అక్కడ ఉన్న కొత్తబట్టలపైనా, రహీంపైనా కూడా కుమ్మరించి వెళ్ళిపోయింది.
తానుచేసిన పనికి దానికి కోపమొచ్చిందని గ్రహించాడు రహీం. ఆ రోజు తర్వాతనుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నోవిధాలుగా ప్రయత్నాలు చేశాడు. అరటిపళ్ళు, చెఱకుముక్కలూ మొదలైనవి ఎన్నిపెట్టినా అదిమాత్రం అతని స్నేహాన్ని యిష్టపడలేదు.
"చక్కటి స్నేహాన్ని చేతులారా పాడుచేసుకొన్నాను" అని రహీం తరచూ బాధపడేవాడు.
నీతి :- అమాయకులపై ప్రతాపం చూపరాదు.
English Story: THE WIND AND THE SUN
Once the Wind and the Sun had an argument. “I am stronger than you,” said the Wind.“No, you are not,” said the Sun. Just at that moment they saw a traveller walking across the road. He was wrapped in a shawl.
The Sun and the Wind agreed that whoever could separate the traveller from his shawl was stronger.
The Wind took the first turn. He blew with all his might to tear the traveller’s shawl from his
shoulders.
The Wind took the first turn. He blew with all his might to tear the traveller’s shawl from his
shoulders.
But the harder he blew, the tighter the traveller gripped the shawl to his body. The struggle went on till the Wind’s turn was over.
Now it was the Sun’s turn. The Sun smiled warmly. The traveller felt the warmth of the smiling Sun. Soon he let the shawl fall open.
The Sun’s smile grew warmer and warmer...hotter and hotter. Now the traveller no longer needed his shawl. He took it off and dropped it on the ground.
The Sun was declared stronger than the Wind.
Moral: Brute force can’t achieve what a gentle smile can.
3-5 Classes Maths Work Sheet Day 2 Summer 2023 Activity
Post your Answers in your School Whatsapp Groups
Day Wise 3-5 Classes We Love Reading Links
Never Miss any Update: Join Our Free Alerts:- Join Whatsapp Community for Free Daily Alerts Click Here
- Join Telegram Channel for Free Daily Alerts Click Here