7శాతానికి పెరిగిన డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం (డీఏ), కరువు సాయం (డీఆర్)ను 2 శాతం పెంచుతూ మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 5 శాతం ఉన్న డీఏ, డీఆర్‌లను 7 శాతానికి పెంచి ఈ ఏడాది జనవరి నుంచే ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో 1.1 కోట్లమంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి కలగనుంది.‘ధరల పెరుగుదలను తట్టుకునేందుకు డీఏ, డీఆర్‌లను మూలవేతనం/పింఛనుపై 7 శాతానికి పెంచాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది’ అని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల అధిక భారం పడనుంది.