Type Here to Get Search Results !

సెప్టెంబరు 1న జిల్లా కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్‌లను జయప్రదం చేయండి

సి.పి.ఎస్‌ రద్దుకై సెప్టెంబరు 1న జిల్లా కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్‌లను జయప్రదం చేయండి - ఫ్యాప్టో పిలుపు

రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతరం వృద్దాప్యంలో సామాజిక భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ వర్తింపుతో జీవించే స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయని, తక్షణమే సి.పి.ఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని సెప్టెంబరు 1న అని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ‘‘పికెటింగ్‌''లు నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్టో చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ పి.బాబురెడ్డి, జి.హృదయరాజు తెలిపారు.
రాష్ట్ర ఫ్యాప్టో సెక్రటేరియేట్‌ సమావేశంలో చైర్మన్‌ పి.బాబురెడ్డి అధ్యక్షతన శుక్రవారం (17.08.2018) ఎస్‌టియు రాష్ట్ర కార్యాలయం విజయవాడనందు నిర్వహించబడిరది. సభ్య సంఘాలు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ‘‘క్విట్‌ సి.పి.ఎస్‌’’ పోరాట రెండవదశలో భాగంగా రాష్ట్రంలో సి.పి.ఎస్‌ అమలులోకి వచ్చిన సెప్టెంబరు 1వ తేదీన ‘‘మాస్‌ క్యాజువల్‌ సెలవు’’ పెట్టి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌ ఎదుట ‘‘పికెటింగ్‌’లు నిర్వహిస్తున్నామని రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు మద్దతునిచ్చి ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలునిచ్చారు.
ప్రభుత్వం జూలై 20న ఫ్యాప్టోతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలు రూ.398/`తో పనిచేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు, అన్ని కేడర్ల పదోన్నతులు, అంతర్‌ జిల్లా బదిలీలు చేయడంపై నిర్లక్ష్యం, విద్యార్థులకు యూనిఫామ్స్‌, సైకిళ్ళు అందజేయకపోవడం, డిఎస్‌సి - 2018 నోటిఫికేషన్‌ ప్రకటించకపోవడం, పండిట్‌, పిఇటి పోస్టులు 2వ దశ అప్‌గ్రేడేషన్‌ ఫైల్‌ను తిరస్కరించడాన్ని ఫ్యాప్టో తీవ్రంగా పరిగణిస్తుంది.
అదే విధంగా మున్సిపల్‌ శాఖ మంత్రి, అధికారులు అంతర్‌ మున్సిపాలిటి, కార్పోరేషన్‌ మరియు సాధారణ బదిలీలు చేపడతామని, పి.ఎఫ్‌ సౌకర్యం కల్పిస్తామని కాలాయాపన చేస్తున్నారని తక్షణమే మున్సిపల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఫ్యాప్టో సమావేశంలో కో-చైర్మన్లు జి.నాగేశ్వరరావు, పి.పాండురంగవరప్రసాద్‌, ఏపి జెఏసి సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ యం.రవిచంద్రకుమార్‌, సిహెచ్‌.శరత్‌చంద్ర, కార్యవర్గ సభ్యులు ఎన్‌.వి.రమణయ్యు పాల్గొన్నారు.