సిపిఎస్ రద్దుపై అన్ని పార్టీల వైఖరి ప్రకటించాలి- ఫ్యాప్టో
ఫ్యాప్టో పోరాటాలకు స్పందించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేస్తామని జనసేన పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ, రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిపిఎస్ రద్దుపై తమ వైఖరి స్పష్టం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు ఒక ప్రకటనలో అన్నారు.రాష్ట్రంలో 1,86,000మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తమ వైఖరి ప్రకటించడమే కాదు చట్ట సభల్లో చర్చించి తక్షణమే సిపిఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.