Adhaar : ఆధార్ కార్డు కాపీల వినియోగంపై ప్రభుత్వ హెచ్చరిక - ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త
ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్)ని ప్రూఫ్‌గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా ఆరా తీయడం లేదు. పని అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహనా చాలా మందిలో ఉండడం లేదు. దీంతో ఆధార్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్, సిమ్.. ఇలా ప్రతిదానికీ మనం ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు.
ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్ నెంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని సూచించింది. అవసరం లేని దగ్గర మాస్క్‌డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది. ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరింది. ‘‘మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజలు తమ ఆధార్ కార్డు కాపీని ఇచ్చే ముందు సంబంధిత సంస్థకు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని తెలిపింది. ఇంటర్నెట్ కేఫ్‌ల వంటి వాటిలోని కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఆ ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది.
ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్ నెంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని సూచించింది. అవసరం లేని దగ్గర మాస్క్‌డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది. ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరింది. ‘‘మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మాస్క్‌డ్ ఆధార్ కాపీలను ఎలా పొందాలి?
- - Official UIDAI website నుంచి మాస్క్‌డ్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- - మీ 12 అంకెల ఆధార్ కార్డు సంఖ్యను ఈ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.
- - 'Do you want a masked Aadhaar' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- > ఆ తర్వాత ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో జత చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి.
- > ఆ తర్వాత మీకు పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్ ద్వారా వస్తాయి.
- - మాస్క్‌డ్ ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది
మాస్క్‌డ్ ఆధార్‌పై ప్రభుత్వ సలహా ఉపసంహరణ
న్యూఢిల్లీ : అధికారిక అనుమతి లేని ప్రైవేటు సంస్థకు వ్యక్తులు తమ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీని ఇచ్చేటపుడు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌డ్ ఆధార్ కార్డును వినియోగించాలని సలహా ఇచ్చిన కాసేపటికే ఈ సలహాను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ సలహాను UIDAI ప్రాంతీయ కార్యాలయం అధికారి జారీ చేశారని, దీనిని ఉపసంహరిస్తున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.UIDAI పత్రికా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల దానిని ఉపసంహరిస్తున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను ఆదివారం విడుదల చేసింది. ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ సంఖ్యలను ఉపయోగించేటపుడు, ఇతరులతో పంచుకునేటపుడు సాధారణ వివేకాన్ని వినియోగించాలని మాత్రమే యూఐడీఏఐ తెలిపిందని వివరించింది.
అంతకుముందు విడుదల చేసిన ప్రకటనలో, ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్‌డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది.
‘‘మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Download MASKED AADHAR