Type Here to Get Search Results !

EMRS TGT Recruitment 2023 EMRS Wardens Recruitment 2023 for 6329 Vacancies Details Here

EMRS TGT Recruitment 2023 EMRS Wardens Recruitment 2023 for 6329 Vacancies Details Here

NESTS: ఏకలవ్య పాఠశాలలో 4062 ఉద్యోగాలు మరియు 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు కలిపి మొత్తం 10391 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల.

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ఈ ఎంఆర్ఎస్) లో ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్) దరఖాస్తులు ఆహ్వానించింది. 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నెక్స్ట్ తెలిపింది. 

EMRS TGT Recruitment 2023 EMRS Wardens Recruitment 2023 for 6329 Vacancies Details Here

ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ లైబ్రేరియన్. (మేల్), పీఈటీ (ఫిమేల్), సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ లైబ్రేరియన్. (మేల్), పీఈటీ (ఫిమేల్),

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు 

3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

మొత్తం ఖాళీలు: 6,329.

అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఎస్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్కు రూ.29200-92300 .

ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఓఎంఆర్ ఆధారిత పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000,  ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 18/08/2023.

 EMRS: ఈఎంఆర్ఎస్ పాఠశాలలో 4062 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్ఎస్ఈఎస్ఓఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో (ఈఎంఆర్ఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 4062

ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ఎగ్జామ్ (ఈఎన్ఎస్ఈ)-2023

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ప్రిన్సిపల్-303

2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)-2266

3. అకౌంటెంట్ - 361

4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759

5. ల్యాబ్ అటెండెంట్: 373 

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు. 

అర్హత:

ప్రిన్సిపల్: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు. 

అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళు మించకూడదు.

జేఎస్ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 

ల్యాబ్ అటెండెంట్: 10వ/ 12వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు:

ప్రిన్సిపల్: నెలకు రూ. 78800 - రూ.209200 చెల్లిస్తారు.

పీజీటీ: నెలకు రూ.47600-రూ.151100 చెల్లిస్తారు.

అకౌంటెంట్: నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు.

జేఎస్ఏ: నెలకు రూ.19900 - రూ.63200 చెల్లిస్తారు.

ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ.18000- రూ.56900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు:

ప్రిన్సిపల్: రూ.2000.

పీజీటీ: రూ.1500

నాన్ టీచింగ్ స్టాఫ్: రూ. 1000.

దరఖాస్తుకు చివరి తేది: 31.07.2023

Tags