Type Here to Get Search Results !

నేడు టెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల జనవరిలో ‘టెట్‌’!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) షెడ్యూల్‌ను నోటిఫికేషన్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించనున్నారు. జనవరిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించే తేదీ, ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకోవాల్సిన గడువులకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. షెడ్యూల్‌ అనంతరం నోటిఫికేషన్‌, సిలబస్‌ను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారి టెట్‌ ప్రత్యేకంగా నిర్వహించడం, అందులోనూ ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనుండడంతో అభ్యర్థుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. టెట్‌ అర్హత ఉంటేనే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులు. దీంతో దీనికి ప్రత్యేకంగా చదవాల్సి వస్తోందని కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. పాఠశాల విద్యాశాఖ మాత్రం ప్రైవేటు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏలు నిర్వహించే ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ అవసరమని, అందుకని ప్రత్యేకంగా నిర్వహించడమే మేలని పేర్కొంటోంది