1091 బడుల లో ఉపాధ్యాయుల కొరత✍📚*
🌻జూన్ 29(ఆంధ్రజ్యోతి): బడులు తెరిచా రు. బడి బాట పేరుతో పెద్ద ఎత్తున ఉత్సవాలనూ ప్రభుత్వం నిర్వహించింది. అయితే పిల్లలకు చదువు చెప్పే పంతుళ్ల కొరత ఉందన్న విషయాన్ని ముందుగానే గుర్తించటం మరచింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1091 పాఠశాలల్లో ఈ కొరత ఉంది.🌻స్వయంగా పాఠశాల విద్యాశాఖ పరిశీలనే ఈ అంశాన్ని ధృవీకరించింది. దీనిని వెంటనే సర్దుబాటు చేయటానికి కమిషనర్ ‘పని సర్దుబాటు’ ఉత్తర్వును జారీ చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటు తరువాత డీఈఓ పుల్‌లో మిగిలి ఉన్న ఉపాధ్యాయులును, ప్రాథమికోన్నత పాఠశాలలో మిగులున్నవారిని, సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ)లలో సబ్జెక్టు టీచర్‌కు ఉండాల్సిన అర్హతలు కలిగిన వారిని కొరత ఉన్న చోటుకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
🌻అయితే ఉత్తర్వులు ఇచ్చినంత తేలికగా సర్దుబాటు కుదరకపోవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇంకా, పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు చేరారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయం తేలకుండా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ధారించటం అసాధ్యం.
టెట్ ఫలితాలు 2కి వాయిదా✍
🌻ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ నెల 10 నుంచి 19 వరకు జరిగిన టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,97,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,70,576 హాజరయ్యారు. శనివారం విడుదల కావాల్సిన ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేయనున్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమం ఉండటం వల్ల టెట్ ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం చెబుతోంది.🌻టెట్ ప్రాథమిక 'కీ'పై 7,227 అభ్యంతరాలు రాగా 846 మాత్రమే ఆధారాలతో సహా అందాయి. కీ పై వచ్చిన అభ్యంతరాలపై కూడా సోమవారం వివరణ ఇవ్వనున్నారు.
పాఠశాలల్లో ఇక పక్కాగా పరీక్షలు✍📚*
*♦ఫార్మెటివ్ పరీక్షలన్నింటికీ డీసీఈబీ నుంచి ప్రశ్నాపత్రం**♦ఉపాధ్యాయ సంఘాల సిఫార్సుతో కీలక నిర్ణయం*
*♦విద్యలో నాణ్యత పెంచే దిశగా కార్యాచరణ*
🌻వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది పెద్ద మొత్తంలో వెచ్చించి నిర్వహించిన ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు అక్కరకు రాకుండా పోయాయి.
🌻వాటి నిర్వహణకు భారీగా వ్యయం చేసినా పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల దాకా ఏదీ సవ్యంగా జరగలేదు. పరీక్షల ఫలితాలు అయితే పాఠశాలలు మరో 10 రోజుల్లో ముగుస్తాయనగా విడుదల చేశారు. అంత జాప్యం చేసి ఫలితాలు విడుదల చేసినా వాటికి అర్థంపర్థం లేకుండా పోయింది. పరీక్షలు బాగా రాసిన విద్యార్థులకు సున్నా మార్కులు వేసి ఉపాధ్యాయులు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. అడ్డదిడ్డంగా మూల్యాంకనం చేసిన ఫలితంగా ఈ ఏడాది వేసవిలో మరో రూ.5 కోట్లు వెచ్చించి 'జ్ఞానధార' పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు వెనకబడిన విద్యార్థులకు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
🌻 అంత వెచ్చించినా ఆ శిక్షణా అరకొరగానే సాగింది. పిల్లల లేమితో వెలవెలబోయింది. మొత్తానికి పాఠశాల విద్యాశాఖ తీరుపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏడాదంతా పిల్లలను పాఠశాలలకు పంపితే కనీసం వారికి పరీక్షలుపెట్టి ఫలితాలు ఇవ్వకపోతే వారిలో నెలకొన్న లోటుపాట్లు ఎలా తెలుస్తాయి? వారు చదువుతున్నారా లేక వెకనబడ్డారా అనేది తమకు తెలియకపోతే ఎలా అని చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులకు ముందే పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులతో వాదనకు దిగటంతో ఈఏడాది జిల్లా విద్యాశాఖ ముందుగానే అప్రమత్తమైంది.
🌻ఉపాధ్యాయ సంఘాలు సైతం ఒక్కతాటిపైకి వచ్చి జిల్లా సాధారణ పరీక్ష మండలి(డిస్ట్రిక్టు కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) ద్వారానే పాఠశాలల్లో ఫార్మెటివ్ 1,2,3,4 పరీక్షలు నిర్వహించాలని ఈమేరకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చాయి. రెండు రోజుల కిందట జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) అధ్యక్షతన జరిగిన కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షలకు అవసరమైన ప్రశ్నాపత్రాన్ని ముద్రించి సరఫరా చేయాలని నిర్ణయించారు.
🌻దీనికి జిల్లా పరీక్ష మండలి అంగీకరించింది. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నీకలిపి 675 ఉన్నత పాఠశాలలు మరో 2400 వరకు యూపీ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నింటికి ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకేసారి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
*♦విద్యలో నాణ్యత పెంచేదిశగా..:*
గత అనుభవాల నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల్లో ఫార్మెటివ్-1 పరీక్షల నిర్వహణకు వీలుగా పూర్తి చేయాల్సిన సిలబస్‌పై సమాచారమిచ్చారు. ఏదైనా పాఠశాల పరీక్షలు పెట్టకున్నా, ఫలితాలు విడుదల చేయకున్నా వెంటనే గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ- గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు మొత్తానికి ఒకేసారి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వటం ద్వారా పోటీవాతావరణం పెరుగుందని అంటున్నారు.
📚✍ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు 1872 మంది ఎంపిక*
*♦4, 5 తేదీల్లో 'ఇడుపులపాయ', 6, 7ల్లో 'ఒంగోలు' ప్రవేశాలు**♦జులై మూడో వారంలో రెండో జాబితాకు అవకాశం*
🌻 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2018 - 19 విద్యా సంవత్సరానికిగాను 1872 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర మానవ వనరుశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాలను విడుదల చేశారు. ఈ రెండు ట్రిపుల్ ఐటీలలో 2 వేల సీట్లకుగాను 1872 మంది విద్యార్థులను మెరిట్, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఎంపిక చేశారు.
🌻క్రీడలు, ఎన్‌సీసీ, వికలాంగులు, సైనికోద్యోగుల క్రీడా కోటా కింద 128 మంది విద్యార్థుల ఎంపికకు దరఖాస్తులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. కాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు 597 మంది బాలికలు, 339 మంది బాలురు ఎంపికయ్యారు. ఒంగోలుకు సంబంధించి 616 మంది బాలికలు, 320 మంది బాలురు ఎంపికయ్యారు. కాగా జులై 4, 5 తేదీల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు జులై 6, 7 తేదీల్లో ఇడుపులపాయ ప్రాంగణంలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించనున్నట్టు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు.
*♦విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు*
ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు జులైలో జరిగే ప్రవేశాల కోసం తాము సూచించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ తెలిపారు. పదో తరగతి హాల్‌టిక్కెట్, మార్కుల జాబితా, బదిలీ ధ్రువపత్రం, మీసేవ ద్వారా జారీ అయిన కులధ్రువీకరణపత్రం, 4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఉద్యోగస్థుల పిల్లలైతే వారి తల్లిదండ్రుల జీతపు ధ్రుపవత్రాలు, నివాస ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డు, తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు, విద్యార్థి తల్లిదండ్రులకు సంబంధించిన ఆరు పాస్‌పోర్టు ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతి తీసుకురావాల్సి ఉంటుంది.
*♦జులై మూడో వారంలో రెండో జాబితా!*
ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి రెండో జాబితా జులై 3వ వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు మొదటి జాబితాలో 1872 మందిని ఎంపిక చేశారు. ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం, సీట్లు వచ్చినా కొందరు చేరకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల కొన్ని సీట్లు ఖాళీ పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ గుర్తించిన తర్వాత జులై 3వ వారంలో తదుపరి మెరిట్‌లో ఉన్న విద్యార్థులను ఎంపికచేసి రెండో జాబితాను విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ ప్రవేశాల విభాగం కన్వీనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాల్‌రాజు తెలిపారు.
*♦ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఎంపిక ప్రవేశాల కటాఫ్ మార్కులు ఇవే :*
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2018 - 19 విద్యా సంవత్సరంలో తొలి విడత ప్రవేశాలు పొందిన విద్యార్థుల కటాఫ్ మార్కులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పరిధిలో బీసీ-ఎ-10.2, బీసీ-బీ-10.2, బీసీ-సీ-10, బీసీ-డి, బీసీ-ఇ, ఓసీ-10.2, ఎస్సీ - 10.1, ఎస్టీ - 10 జీపీఏ కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు.
*ఆర్‌సెట్‌లో నెగిటివ్ మార్కులొద్దు
*♦- విద్యార్థి సంఘాల జెఎసి వినతి*🌻ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపి ఆర్‌సెట్)లో నెగిటివ్ మార్కులు తొలగించాలని విద్యార్థి సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ పి నరసంహారావును జెఎసి నాయకులు ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
🌻జనరల్ కేటగిరీ ఫీజు వెయ్యి మించకుండా ఉండాలని, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించాలని కోరారు. అపరాధ రుసుం తగ్గించాలని, ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ ప్రాతిపదిగా కౌన్సెలింగ్ జరపాలని తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో రూ.15వేలు రాష్ట్రప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.
🌻ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు ఎ రవిచంద్ర, పిడిఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి బాజిసైదా, బిసిఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం మహేష్, జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, వైఎస్‌ఆర్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, పిడిఎస్‌యు నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
✍రేపటి నుంచి ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్
🌻ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. జులై 5వరకు ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈనెల 26న ఇందుకు నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. కౌన్సెలింగ్‌కు రాష్ర ్టవ్యాప్తంగా మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో కౌన్సెలింగ్‌కు హాజరు కానీ అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్ హాజరు కావొచ్చు.🌻తొలి విడతలో ఫీీజు చెల్లించని అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. 1 నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్ల నమోదు ఉంటుంది. జులై 6 తరువాత ఆప్షన్లలో ఏలాంటి మార్పులూ చేసుకునేందుకు అవకాశం ఉండదు. 7వ తేదీన సీట్ల కేటాయంపు ఉంటుంది.
బాలల సంరక్షణ చట్టాల అమలుకు కమిటీ
🌻అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బాలల సంరక్షణకు సంబంధించి చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు సూచనలు, సలహాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమిస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ ఆదేశాలిచ్చింది.🌻ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యను నియమించింది. మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి కె.సునీత మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. కాగా.. ఈ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న షెల్టర్‌హోంలను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.