నేటి నుంచి రెండో దశ ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఎంసెట్-ఎంపీసీ స్ట్రీమ్(ఇంజనీరింగ్, ఫార్మసీ) రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుంది. జూలై 1-2 తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులందరికీ ఒకటో తేదీన 1 నుంచి 60 వేల ర్యాంక్ వరకు, 2న 60,001 నుంచి ఆఖరు ర్యాంక్ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.2 నుంచి కాలేజీల్లో ‘మధ్యాహ్న భోజనం’
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీల్లో జూలై 2 నుంచి ‘మధ్యాహ్న భోజన’ పథకం అమల్లోకి రానుంది. ఫలితంగా రాష్ట్రంలోని 447 ప్రభుత్వ, 150 ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఊరట కలుగనుంది. ఇంటర్ విద్యా కమిషనర్ బి.ఉదయలక్ష్మి ఈ మేరకు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు. ఆధార్‌తో కూడిన ఈ-హాజరు కోసం ‘విద్యావాన్’ వెబ్‌సైట్‌తో లింక్ అవ్వాలని సూచించారు.✍రూ.2.71 పెరిగిన వంట గ్యాస్✍
🌻 న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికీ సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేదవాడి నడ్డి విరస్తూ సబ్సిడీ గ్యాస్ ధరను పెంచాయి.🌻ప్రభుత్వాలు తమపై వేస్తున్న పెను భారాన్ని మోయలేక బడుగులు, సగటు జీవులు లబోదిబో మంటున్నారు. సబ్సిడిపై ఇచ్చే వంట గ్యాస్ ధర సిలెండరకు రూ.2.71 పెరిగింది. అంతర్జాతీయ ధరలలో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ పడిపోవడం కారణంగా మూల ధరల పన్ను ప్రభావ ఫలితంగా సబ్సిడి గ్యాస్‌పై ధరను పెంచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
విద్యావలంటీర్లతో ఖాళీ పోస్టుల భర్తీ*
*♦ఎస్‌ఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ చంద్రిక**💥తిరువూరు, న్యూస్‌టుడే:*
🌻ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను విద్యావలంటీర్లతో భర్తీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ చంద్రిక తెలిపారు. ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలుగా వర్గోన్నతి కల్పించిన పట్టణ పరిధిలోని ఉర్దూ పాఠశాలలను శనివారం ఆమె సందర్శించారు. వర్గోన్నతి కల్పించిన అనంతరం నెలకున్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
🌻 ఉపాధ్యాయుల భర్తీకి కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున అప్పటి వరకు విద్యాబోధన కుంటుపడకుండా విద్యావలంటీర్లను నియమిస్తున్నట్లు తెలిపారు.
🌻మిగిలిన పాఠశాలలతో పాటు ఉర్దూ పాఠశాలల్లోనూ విద్యార్థుల ప్రవేశ సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తుండటం, పిల్లల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పించటం వల్ల తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగిందన్నారు. ఇంకా పాఠశాలల్లో ఏమైనా సమస్యలుంటే మండల విద్యాశాఖాధికారుల ద్వారా నివేదికలు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంవో సలార్, డీఐ రవిరాజు, ఎంఈవో సీహెచ్ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయని షకీలా తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
*♦జులై 4నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభం**♦నాలుగుచోట్ల వేయి చొప్పున సీట్ల భర్తీ*
*♦విశాఖలో ఫలితాలను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు*
🌻 రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల(ఆర్జీయూకేటీ) ప్రవేశాల ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయల్లో ఒక్కో చోట వెయ్యి చొప్పున నాలుగు వేల సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రవేశాల కోసం ప్రభుత్వ పాఠశాలల నుంచి 27,988, ప్రైవేటు పాఠశాలల నుంచి 22,862 దరఖాస్తులు అందాయని వివరించారు.
🌻ఎంపికకు సంబంధించి సమగ్ర వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్‌ఐటీలను ఏయూ, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలో చేర్చామని తెలిపారు. ఏయూ రీజియన్‌కు 1,958, ఎస్వీయూకు 1,224 సీట్లు కేటాయించామన్నారు.
*♦విద్యార్థులు తీసుకు వెళ్లాల్సిన పత్రాలు*
*పదో తరగతి హాల్‌టిక్కెట్, గ్రేడ్ షీట్
*4-10 తరగతి వరకు స్టడీ ధ్రువీకరణ పత్రాలు
*స్థానికేతర విద్యార్థులు.. నివాస ధ్రువీకరణ పత్రం
*మీసేవ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం
*ఆదాయ, వేతన ధ్రువీకరణ పత్రం
*విద్యార్థి, వారి తల్లిదండ్రులవి పాస్‌పోర్టు ఫొటోలు రెండేసి
*రేషన్ కార్డు
విద్యార్థి ఆధార్ కార్డు
*♦పెరిగిన కటాఫ్ మార్కులు:*
🌻ట్రిపుల్ ఐటీ సీట్లకు పోటీ పెరిగింది. గతేడాదికంటే ఈసారి గణనీయంగా పెరిగిన కటాఫ్ మార్కులే ఇందుకు నిదర్శనం. గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతికవిద్యను అందించడం ఈ విద్యాలయాల స్థాపన లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వచ్చిన జీపీఏకు వెనుకబాటు సూచీ(డిప్రియేషన్) కింద 0.4 జీపీఏను కలిపేలా నిర్ణయించారు.
🌻అంటే ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి 10/10 జీపీఏ సాధించినా ఆ విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో 9.7 జీపీఏ సాధించిన విద్యార్థికే సీటు వస్తుంది. ఎలా అంటే.. 9.7+0.4 కలిపి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి 10.1 జీపీఏ వచ్చినట్లవుతుంది. గతేడాది ఆంధ్రా వర్సిటీ పరిధిలో బీసీ-ఏలో జీపీఏ కటాఫ్ 10.1కాగా శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో పది ఉంది. ఈసారి ఇది 10.2, 10.2గా ఉంది.
*♦పెరిగిన కటాఫ్ మార్కులు:*
🌻ట్రిపుల్ ఐటీ సీట్లకు పోటీ పెరిగింది. గతేడాదికంటే ఈసారి గణనీయంగా పెరిగిన కటాఫ్ మార్కులే ఇందుకు నిదర్శనం. గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతికవిద్యను అందించడం ఈ విద్యాలయాల స్థాపన లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వచ్చిన జీపీఏకు వెనుకబాటు సూచీ(డిప్రియేషన్) కింద 0.4 జీపీఏను కలిపేలా నిర్ణయించారు.
🌻అంటే ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి 10/10 జీపీఏ సాధించినా ఆ విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో 9.7 జీపీఏ సాధించిన విద్యార్థికే సీటు వస్తుంది. ఎలా అంటే.. 9.7+0.4 కలిపి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి 10.1 జీపీఏ వచ్చినట్లవుతుంది. గతేడాది ఆంధ్రా వర్సిటీ పరిధిలో బీసీ-ఏలో జీపీఏ కటాఫ్ 10.1కాగా శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో పది ఉంది. ఈసారి ఇది 10.2, 10.2గా ఉంది.