హామీపత్రాల’ సమస్య పరిష్కారం
28-06-2018 02:41:15
3వేల మంది టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న హామీ పత్ర ఉపాధ్యాయుల సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. డీఎస్సీ-2008 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన సుమారు 3వేల మంది టీచర్లకు ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది. వారి వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సవరించింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎస్సీ-2008 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం టీచర్ల నియామకాలు చేపట్టింది. అయితే సెలెక్షన్ వచ్చినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి ఖాళీలు లేకపోవడంతో అప్పట్లో కొంతమందికి భవిష్యత్‌లో నియమించేలా హా మీపత్రాలు ఇచ్చారు. అయితే 2011 జూలై 1నుంచి 2012వరకు హామీపత్రాలద్వారా నియామక ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులకు, తదుపరి 2012 నుం చి నియమితులైన వారికి మధ్య వేతనాల్లో వ్యత్యాసం వచ్చింది. ఎట్టకేలకు వారి సమస్య పరిష్కారమైంది.
🔲పీఆర్సీకి వెల్లువలా దరఖాస్తులు
వచ్చే నెల 5 వరకు స్వీకరణ గడువు పెంపు
హైదరాబాద్, జూన్ 27
(ఆంధ్రజ్యోతి) : పదకొండో పీఆర్సీకి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 20 వేల దరఖాస్తులు అందగా.. ప్రస్తుతం వాటిని క్రోడీకరిస్తున్నారు. వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణకు బుధవారంతో గడువు ముగిసింది. అయితే, ఉద్యోగుల నుంచి ఇంకా దరఖాస్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తుండడంతో గడువును వచ్చే నెల 5వ తేదీ వరకూ పొడిగించాలని పీఆర్సీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన పీఆర్సీ.. ప్రధాన ఉద్యోగ సంఘాలతో మరోమారు భేటీ కావాలని భావిస్తోంది.
ఉద్యోగ విరమణ రోజే పెన్షన్
28-06-2018 02:38:43
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన రో జునే పెన్షన్ ప్రయోజనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఇందుకు వీలుగా ప్రభుత్వం ఆటోమేషన్ పెన్షన్ జీవోను బుధవారం విడుదల చేసింది. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల సర్వీసు రికార్డులన్నీ పరిశీలించి, వారికందే ప్రయోజనాలు మదించే సరికి నెలల సమయం పట్టేది. సంవత్సరం వరకు ఆలస్యమైతే 4.5 శాతం వడ్డీతో, సంవత్సరం దాటితే 5 శాతం వడ్డీతో ప్రభుత్వం చెల్లించేది. ఆటోమేషన్ విధానం వల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న వడ్డీభారం కూడా తగ్గుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని జేఈఈ సీట్లన్నీ భర్తీ
28-06-2018 02:42:19అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): జేఈఈ-2018 మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియను బుధవారం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లోని సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఐఐటీల్లో సీట్లు కేటాయించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, చేరేందుకు అంగీకారాల ప్రక్రియ గురువారం నుంచి జూలై 2 వరకు చేపట్టనున్నారు. 3న భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. అదేరోజు సాయంత్రం రెండో రౌండ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. మొత్తం ఏడు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తారు. జేఈఈలో అర్హత సాధించిన అభ్యర్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా) అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది. దేశంలోని 23 ఐఐటీ, 23 ట్రిపుల్ ఐటీ, 31 ఎన్‌ఐటీ, 23 ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.
*📚✍ఉద్యోగ వివరణ రోజే పెన్షన్✍📚*
*28-06-2018 02:38:43*
🌻అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన రో జునే పెన్షన్ ప్రయోజనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఇందుకు వీలుగా ప్రభుత్వం ఆటోమేషన్ పెన్షన్ జీవోను బుధవారం విడుదల చేసింది.
🌻ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల సర్వీసు రికార్డులన్నీ పరిశీలించి, వారికందే ప్రయోజనాలు మదించే సరికి నెలల సమయం పట్టేది. సంవత్సరం వరకు ఆలస్యమైతే 4.5 శాతం వడ్డీతో, సంవత్సరం దాటితే 5 శాతం వడ్డీతో ప్రభుత్వం చెల్లించేది.
🌻 ఆటోమేషన్ విధానం వల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న వడ్డీభారం కూడా తగ్గుతుంది.
🔲ఎస్‌ఎస్‌ఎ పొరుగు సేవలు నిలిపివేత
Posted On: Thursday,June 28,2018
- ప్రజాశక్తి కథనానికి స్పందన
సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ)లో పొరుగు సేవలను నిలిపివేస్తూ ఎస్‌ఎస్‌ఎ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ''ఏజెన్సీల నియామకాల్లో లాబీయింగ్'' శీర్షికన ఈనెల 5న ప్రజాశక్తి మెయిన్ పేజీలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కెజిబివిల్లో బోధన, భోదనేతర సిబ్బంది ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో ఏజెన్సీల నిబంధనల ఉల్లంఘనలపై ఆ కథనంలో ప్రజాశక్తి పేర్కొంది. దీనిపై స్పందించిన ఎస్‌పిడి బుధవారం అన్ని జిల్లాల ఎస్‌ఎస్‌ఎ పిఒలకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏజెన్సీల సేవలను నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రద్దు
*28-06-2018 02:49:10*
*♦కొత్తగా భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు*
*♦ముసాయిదా రూపొందించిన హెచ్‌ఆర్‌డీ*
🌻న్యూఢిల్లీ, జూన్ 27: ఉన్నత విద్యను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసి.. దాని స్థానంలో.. భారత ఉన్నత విద్యా కమిషన్ (హెచ్‌ఈసీఐ) ఏర్పాటుకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఈ ముసాయిదా ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే హెచ్‌ఈసీఐ కేవలం విద్యా సంబంధ విషయాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. నిధుల వ్యవహారమంతా హెచ్‌ఆర్‌డీ శాఖే చూసుకుంటుంది. విద్యా ప్రమాణాల్లో కచ్చితంగా నాణ్యతను పాటించేలా చూసేందుకు తొలిసారిగా కమిషన్‌కు పూర్తిస్థాయి అధికారాలు కల్పించారు. ప్రమాణాల్లేని, బోగస్ విద్యా సంస్థలను మూసివేసే అధికారమిచ్చారు.
🌻 నిబంధనలు పాటించని సంస్థలకు జరిమానాలు విధించడంతో పాటు.. యాజమాన్యాలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించేలా మార్పులు చేసినట్లు ముసాయిదాలో తెలిపారు.
🌻ప్రస్తుతం యూజీసీ బోగస్ విద్యాసంస్థల పేర్లను మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టింది తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కొత్తగా రూపొందించిన భారత ఉన్నత విద్యా కమిషన్ చట్టం-2018 ముసాయిదా బిల్లును హెచ్‌ఆర్‌డీ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై విద్యావేత్తలు, భాగస్వామ్య పక్షాలు, ప్రజలు తమ సూచనలు, సలహాలను జూలై 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ కోరారు. కొత్త చట్టాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం యూజీసీ ఉన్నత విద్యా సంస్థలకు నిధులు మంజూరు చేస్తుండడంతో ఇతర కీలక అంశాలపై దృష్టి సారించలేకపోతోందని హెచ్‌ఆర్‌డీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిషన్.. ఉన్నత విద్యా కోర్సుల్లో నేర్చుకునే సామర్థ్యాలు, బోధనలో నిర్దేశిత ప్రమాణాలు, అంచనా, పరిశోధనలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు.
🌻ఉన్నత విద్యా సంస్థల వార్షిక పనితీరును మదిస్తుందని, విద్యా ప్రమాణాలను అందుకోలేని విద్యాసంస్థలకు దిశానిర్దేశం చేస్తుందని వివరించారు. బోధనా సిబ్బందికి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలివ్వడానికి, ప్రవేశాలు, ఫీజుల విషయంలోనూ నియమావళిని రూపొందిస్తుంది. ఉన్నత విద్య ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కేంద్రం తదుపరి లక్ష్యం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమహ్మణ్యం అభిప్రాయపడ్డారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ)ని కూడా సంస్కరించే అవకాశం ఉందన్నారు.
📚✍హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్*_
*28-06-2018 02:45:03*
*♦కొలీజియం సిఫారసుకు ఓకే..*
*♦రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయి సీజే*
🌻న్యూఢిల్లీ, జూన్ 27: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు.
🌻 తాజా నియామకంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు రెగ్యులర్ చీఫ్ జస్టిస్ నియామకం జరిగినట్లయింది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠీకి పదోన్నతి కల్పించి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
🌻ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం ఈ ఏడాది మొదట్లో చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
🌻 కేరళకు చెందిన రాధాకృష్ణన్.. కొల్లమ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1983 డిసెంబరులో న్యాయవాదిగా నమోదు చేయించుకుని తిరువనంతపురంలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తర్వాత ఎర్నాకుళంలోని హైకోర్టుకు మారారు. 2004 అక్టోబరు 14న ఆయన కేరళ హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.
📚✍30న TET ఫలితాలు
🌻ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్)-2018 పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వరకూ పరీక్షలను నిర్వహించారు. ప్రాథమిక ‘కీ’లో 7,227 మంది అభ్యంతరాలను తెలపగా, వారిలో 846 మంది ఆధారాలతో సహా వెబ్‌సైట్‌లో వివరాల్ని పొందుపరిచారు. ఈ నెల 26వ తేదీన ఈ పరీక్షల తుది ‘కీ’ను కన్వీనర్ సుబ్బారెడ్డి ప్రకటించారు.
🌻పీఈటీ అభ్యర్థులు ఇన్సెంటివ్ మార్కులకోసం ప్రశ్నాపత్రాల్ని అప్‌లోడ్ చేసేందుకు టెట్ వెబ్‌సైట్లో 28వరకూ అవకాశం కల్పించారు. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ఆధారంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల రాతపరీక్ష రాయాలంటే..టెట్‌ను తప్పనిసరి చేశారు.
🌻ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి టెట్‌ను ప్రారంభించారు. విభజన అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో టెట్-2017, 2018 పరీక్షలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 10,350 ఉపాధ్యాయ ఖాళీలకు జూలై 6న డీఎస్సీ(టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
🌻 ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారంతా డీఎస్సీ శిక్షణలో నిమగమయ్యారు.
*ఉద్యోగాలకు ఎసరు✍📚*
🌻న్యూఢిల్లీ : మెటర్నిటీ కొత్త చట్టం అమలులోకి రావడంతో మహిళలకు కొంతమేరకు మేలు జరిగింది. అయినా దీనివల్ల వారి ఉద్యోగ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడింది. మెటర్నిటీ చట్టం అమలు కారణంగా 2019 ఆర్థిక సంవత్సరంలో 1.8 మిలియన్ల (18 లక్షల) మంది మహిళల ఉద్యోగాలకు విఘాతం ఏర్పడనుందని ఓ సర్వే తెలిపింది. మెటర్నిటీ సెలవులు ఎక్కువ ఉండటం వల్ల మహిళలను ఉద్యోగంలో చేర్చు కోవడానికి పలు సంస్థలు ఆసక్తి చూపడం లేదని టీమ్ లీడ్ సర్వీస్ లిమిటెడ్ సర్వేలో వెల్లడైంది.
🌻 ఈ సర్వే ఫలితాల ప్రకారం..కెనడా, నార్వే దేశాల తర్వాత భారత్ మాత్రమే మహిళలకు మెటర్నిటీ సెలవుల విషయంలో అంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఈ మెటర్నిటీ చట్టం అమలు కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లడం, స్టార్టప్‌లలో మహిళా నియామకాలు తగ్గిపోవడం వంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. 2019 మార్చి ఆర్థిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న 10 రంగాలకు చెందిన సుమారు 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళల ఉద్యోగాలపై ప్రభావం చూపించనుందని సర్వే తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో లెక్కిస్తే సుమారు 10-12 మిలియన్ల మంది మహిళా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి.
🌻 ఇప్పటికే దేశంలోని అన్ని రంగాల్లో మహిళా ఉద్యోగుల శాతం 34శాతం నుంచి 2016 ఆర్థిక సంవత్సరంలో 24 శాతానికి పడిపోయింది. దేశంలోని విమాన యానం, ఐటీ, రియల్ ఎస్టేట్, విద్య, ఈ-కామర్స్, తయారీ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, టూరిజం వంటి రంగాలకు చెందిన 300 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. సమాజంలో ఆధునిక పోకడలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్నప్పటికీ మహిళల ఉద్యోగం విషయంలో ఇప్పటికీ ఎంతో కొంత వెనుకబాటు తనమే ఉందని సర్వే తెలిపింది. ధనవంతుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు చేయడానికి తగిన ప్రోత్సాహం లేదు.
🌻వారు ఉన్నత విద్యావంతులైనప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం కరవై ఉద్యోగాలకు దూరమవు తున్నారు. భర్త వేతనం సరిపోని మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఇంట్లో పెద్దవారి బాగోగులు చూసుకోవడానికి చాలామంది మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారు. దీనిపై ఈఎంఏ పార్టనర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి సుదర్శన్ స్పందిస్తూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సాధారణంగా తక్కువ మంది సిబ్బం దితో నడుస్తుంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఐదుగురి సిబ్బందిలో ఇద్దరు మహిళా సిబ్బంది ఉన్నట్లయి తే అలాంటి కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు.
🌻 ఈ మెటర్నిటీ సెలవుల కారణంగా కొన్నిసార్లు కంపెనీలు మూతపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు