తీర్మానాలు:
- మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించిన 506 (ఫేస్-1) 507 (ఫేస్-2 ) బదిలీలు వెంటనే పూర్తి చేయాలని, పదోన్నతులు చేపట్టాలని, పి.యఫ్ మార్గదర్శకాలు తక్షణమే జారీ చేయాలనే డిమాండ్ల సాధన కోసం
- జూలై 4న DMA వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించడమైనది.
- రూ 398/- లతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని,
- సర్వీసు రూల్స్ పై ఉన్న అడ్డంకులను ప్రభుత్వం అధికమించి వెంటనే అన్ని కేడర్లకు పదోన్నతులు చేపట్టాలని, అంతర్ జిల్లా బదిలీలను వెంటనే పూర్తితి చేయాలని ,ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు DDO అధికారాలను కుదించాలనే చర్యను ఉపసంహరించుకోవాలని,
- అన్ని పండిట్ & పిఈటీ పోస్టులను అప్గ్రడేషన్ చేయాలని & upgrade చేసిన పోస్టులను వంద శాతం పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని,
- పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, సైకిళ్ళను వెంటనే పంపిణీ చేయాలని, DSC-18 నోటిఫికేషన్ లో ఖాళీగా ఉన్న 23,000 ల పోస్టులను భర్తీ చేయాలని,
- 22.3.18 న విద్యా శాఖ మంత్రి FAPTO తో చర్చించి తీసుకున్న నిర్ణయాలన్నింటిని అమలు చేయాలనే డిమాండ్ల సాధనకై
- *జూలై 11న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా* ను నిర్వహించాలని తీర్మానించడమైనది.అప్పటికి పరిష్కరించని పక్షంలో జులై 17 నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించడమైనది.
- సిపియస్ రద్దుకై FAPTO ఆధ్వర్యంలో కొనసాగింపు పొరాటకార్యక్రమాలు చేయాలని అందుకోసం Fapto మరోసారి సమావేశమై కార్యాచరణ ను రూపొందించాలని నిర్ణయించడం జరిగింది.