ఉపాధ్యాయ సమస్యలపై ఫ్యాప్టోతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు 10 రోజులలో సమస్యలపై ఉత్తర్వులు
- ఆందోళన తాత్కాలిక వాయిదా: ఫ్యాప్టో ఉపాధ్యాయుల సమస్యలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాఠశాల విద్యా సంచాలకులు కె. సంధ్యారాణి ఫ్యాప్టో నాయకత్వంతో సచివాలయంలో చర్చలు జరిపారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, పండిట్, పిఇటిల అప్గ్రేడేషన్ సమస్యలపై పది రోజులలో ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. సర్వీసురూల్సుకు సంబంధించి ట్రిబ్యునల్ అనుమతి వచ్చిన వెంటనే పదోన్నతులకు అనుమతినిస్తామన్నారు. డి.ఎస్.సికి సంబంధించి 23 వేల పోస్టులు భర్తీ చేయవలసినదిగా కోరారు. దానిపై ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించుటకు ప్రయత్నిస్తామన్నారు.అంతర జిల్లా బదిలీల ఉత్తర్వులను వారంలోగా విడుదల చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించే విషయాలలో కలెక్టర్ల జోక్యం లేకుండా ఆదేశాలు జారీ చేస్తామని, 'యాప్'ల సంఖ్యను 4కు తగ్గిస్తామని, ఎయిడెడ్ పాఠశాలలో ప్రమోషన్లుకు వెంటనే ఆదేశాలిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు.
10 రోజులలో ఉత్తర్వులు వెలువరించాలని ఫ్యాప్టో నాయకత్వం కోరింది. అప్పటివరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తామని ఉత్తర్వులు రాకపోతే తదుపరి ఉద్యమానికి పిలుపునిస్తామని ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు, కో-చైర్మన్లు జి.నాగేశ్వరరావు, పాండురంగవరప్రసాద్, పి.కృష్ణయ్య, జి.నారాయణరెడ్డి, కోశాధికారి శౌరీరాయలు, డిప్యూటీ జనరల్స్ రవిచంద్రకుమార్, బి.కరీముల్లారావు, ఆదినారాయణ, కార్యదర్శులు కె.ప్రకాష్ రావు, ఎ.పి.జె.ఎ.సి సెక్రటరీ జనరల్ సిహెచ్.జోసఫ్ సుధీర్ బాబు, కార్యవర్గ సభ్యులు షేక్ షాబ్ది, ఎన్.రఘురామిరెడ్డి, వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణయ్య, ఎం.శంకరరావు, టి.గిరిరాజు, వై.శీనయ్య, పి.వెంకటరావులు ఒక ప్రకటనలో తెలియజేశారు