ఎస్సీ, ఎస్టీ యువతకు వ్యాపార నైపుణ్య శిక్షణ
ఔత్సాహిక యువతకు వ్యాపార నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ సన్నద్ధమైంది. పదో తరగతి పాసై, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారికి అవకాశం ఉంటుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను, కమిటీలను వేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కామర్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీ నైౖపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎ్‌సఎ్‌సడీసీ), నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది.