Type Here to Get Search Results !

విశాఖ జిల్లా 15.9.2018 నుండి మధ్యాహ్న భోజన పధకం ప్రైవేటు పరం

రేఖా సంఖ్య. 404/ఎం.డి.ఎం./2017, తే. 17.05.2018ది గా గల ఉత్తర్వులలో పారిశాల విద్యా సంచాలకులు, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారు విశాఖపట్నం జిల్లాలో ని మైదాన ప్రాంతములోని మధ్యాహ్న భోజన పధకం అమలు కాబడుతున్న 31 మండలములలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుచున్న బాల, బాలికలకు 2018-19 సంవత్సరం నుండి 9 కేంద్రీకృత వంటశాలల ద్వారా “నవ ప్రయాస్" నాన్ గవర్నమెంట్ సంస్థ ద్వారా సరఫరా చేయుటకుగాను నిర్ణయించి పనీ అప్పగింత ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు.

సదరు పని అప్పగింత ఉత్తర్వుల ప్రాప్తికి "నవ ప్రయాస్" నాన్ గవర్నమెంట్ సంస్థ అనే సెకండ్ పార్టీతో మొదటి పార్టీ అయిన జిల్లా విద్యాశాఖాధికారి వారు మేమో రాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ చేసుకొనుటకు గాను జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొంది, తేది. 15.09.2018ది నుండి “నవ ప్రయాస్" వారి ద్వారా మధ్యాహ్న భోజన పెదెకం మైదాన ప్రాంతములోని 31 మండలములలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుచున్న విద్యార్ధులకు 9 కేంద్రీకృత వంటశాలల ద్వారా సరఫరా చేయుటకు గాను తేది. 02.07.2018ది న ఎం.ఓ.యు. ఇరుపార్టీలు చేసియున్నారు. కావున తేది. 16.09.2018ది నుండి ప్రస్తుతము పై పాఠశాలలోని విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పెట్టుచున్న కుకింగ్ ఏజెన్సీ వ్యవస్థను నిలుపుదల చేసి "నవ ప్రయాస్" నాన్ గవర్నమెంట్ సంస్థ వారినీ తేది. 16.09.2018ది నుండి మధ్యాహ్న భోజన పధకం ద్వారా భోజనం సరఫరా చేయుటకు అనుమతించ వలసియున్నది. కావున,
పాఠశాలలో విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం సరఫరా చేయుచున్న శ్రీ/శ్రీమతి./కుమారి.
వారిని కుకింగ్ ఏజెన్సీ గా తేది. 16.09.2018ది నుండి నిలుపుదల చేయనున్నట్లుగా నోటీసు జారీ చేయడమైనది. తదుపరి మీ వద్ద నున్న బియ్యం నిల్వలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తగులెక్కలతో అప్పగించవలసినది గా కోరడమైనది. తదుపరి ప్రధానోపాధ్యాయులు,
పాఠశాల వారిని కోరినదేమనగా తేది. 15.09.2018ది ఆఖరు నాటికి ఉన్న బియ్యం నిల్వలను మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా “నవ ప్రయాస్" నాన్ గవర్నమెంట్ సంస్థ వారికి తగు రశీదులతో అప్పగించవలసినదిగా కోరడమైనది.