పది రోజుల్లో డీఎస్సీ
అమరావతి, జూలై 6: మరో పదిరోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల ఆరున విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వివరించారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్ 11నుంచి 25 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించామని, 29,30 తేదీల్లో స్పాట్ వాల్యుయేషన్ జరిగిందని గుర్తుచేశారు.🌻పరీక్షలకు మొత్తం 35వేల 147 మంది అభ్యర్థులు హాజరుకాగా, 18వేల 424 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత 18.95 శాతం తగ్గిందన్నారు. బాలురు 18440 మంది హాజరుకాగా 9679 మంది, బాలికలలో 16వేల 707కు గాను 8745 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు.
🌻బాలురు 52.49శాతం, బాలికలు 52.34 శాతం ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఫలితాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఈఏపి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో పొందుపరిచనట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 85.43 శాతంతో ప్రథమ స్థానంలో నిలిస్తే పశ్చిమగోదావరి జిల్లా 16.53శాతంతో చివరి స్థానంలో ఉందని గత సాధారణ పరీక్షలలో కూడా ప్రకాశం ముందంజలో ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. కాగా మిగిలిన జిల్లాల్లో తూర్పుగోదావరి 83.39, అనంతపురం 82.65, కడప 81.85, గుంటూరు 80.84, చిత్తూరు 75.49, విజయనగరం 65.27, కృష్ణా 59.6, విశాఖపట్నం 57.64, కర్నూలు 58.71, శ్రీకాకుళం 53.92, నెల్లూరు 41.03 శాతం ఉత్తీర్ణత సాధించాయని వివరించారు.
🌻ఫలితాలు ప్రకటించిన వారం రోజుల్లోపు సబ్జెక్టుకు రూ 500 చెల్లించి రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయించుకోవచ్చని తెలిపారు.
🌻రీ వెరిఫికేషన్‌తో పాటు మార్కులువేసిన జవాబుపత్రాలు కావాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా సర్ట్ఫికెట్లు మరో 15 రోజుల్లో అందజేస్తామన్నారు. డీఎస్సీకి సంబంధించి ఆర్థికశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను ఆశాఖ సూచించిన విధంగా పరిష్కరిస్తామన్నారు.
🌻 ఎన్‌సీటీఈ మార్గదర్శక సూత్రాల్లో కూడా కొన్ని మార్పుచేసిన నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి పదిరోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.
🌻ఉపాధ్యాయ పోస్టులు పెరగవని, గతంలో ప్రకటించినట్లుగానే 10వేల 351 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖలలో పోస్టులు భర్తీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ వంటి వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన టెండర్లు అధిక ధరలకు కోట్‌చేసినందున జాప్యం జరిగిందన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం విద్యారంగంలో 17 నుంచి 3వ స్థానంలోకి వచ్చిందని చెప్పారు.
🌻గణితంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
వేతనంతో కూడిన 60 రోజులు ప్రసూతి సెలవులు
SSA పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 60 రోజులు ప్రసూతి సెలవులు అమలు చేయాలని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉత్తర్వులు విడుదల చేశారు..హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపుపై హర్షం
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతం, సిటీ కాంపన్సేటరీ అలవెన్సు మరో ఏడాది పొడిగించినందుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారితోపాటు ఏపీ ఉద్యోగుల జేఏసీ(అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబుకు వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు.ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం
విశాఖ ఆర్మీ శాఖ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాలతో పాటు యానాం నుంచి 56 వేల మంది నమోదు చేసుకోగా, తొలిరోజు 3 వేల మందికి అవకాశం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్హత పత్రాలను పరిశీలించారు. 4 గంటల నుంచి అభ్యర్థులకు పరుగుపందెం, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి భారీ వర్షం రావడంతో మైదానం అంతా బురదమయం అయింది. బురదలోనే పరుగు పందెం నిర్వహించగా కొందరు పడిపోయి గాయాలపాలయ్యారు.అమెరికాలో టీచర్ల సమ్మె
🌻అమెరికా స్వాతంత్య్రదినోత్సవ రోజు అయిన జులై4న మెరుగైన వేతనాల కోసం అమెరికన్ టీచర్లు దేశవ్యాపితంగా సమ్మె చేశారు. వేలాది మంది ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఉద్యమించారు.🌻 మితవాద ట్రంప్ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పిడికిలెత్తి నినదించారు.
కలాం ట్రిపుల్ ఐటీ 208 ఎకరాలు
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు 40 ఎకరాలు🌻అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీ కోసం ప్రకాశం జిల్లా పామూరు మండలం.. దూబగుంట, బుక్కాపురం గ్రామాల్లోని 208 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు విశాఖ జిల్లా మధురవాడలో 40 ఎకరాలు స్వాధీన పరుస్తూ ఆమోదం తెలిపారు.
🌻టీటీడీ విశాఖ జిల్లా పణిరంగినిలో శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మించేందుకు 10 ఎకరాలు.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం చిత్తూరు జిల్లా వెంకటాపురంలో 98.37 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు.
పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి కడప జిల్లా వేంపల్లిలో 58.67 ఎకరాల భూమి కేటాయింపు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు కృష్ణా జిల్లా కొండపావులూరులో 10 ఎకరాల భూమి కేటాయింపు.
🌻స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో 10 ఎకరాలు కేటాయింపు.
సీఆర్‌డీఏ పరిధిలోని 13 వేర్వేరు కార్యాలయాలు, సంస్థలకు 54.33 ఎకరాలు కేటాయింపు.
🌻రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి విజయవాడ బృందావనం కాలనీలో 1052.86 చ.గజాల స్థలం ప్రభుత్వ ధరకు విక్రయం.
3న విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్🌻మోడల్ స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొని ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈనెల 13న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫేడరేషన్ ప్రకటించింది.
🌻 జూన్ 27న అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందనా లేదని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు ఎస్ మురళీమోహన్, ఎన్ బోసుబాఋ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వీస్ రూల్స్ విడుదల చేయాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పిఆర్‌సి, డిఏ బకాయిలు చెల్లించాలని, పెన్షన్ అమలు చేయాలని, రెండో ఫేజ్‌లో చేరిన ఉపాధ్యాయుల పిఆర్‌సి ఫిట్ మెంట్‌లో తేడాను సరిచేయాలని, హిందీ పిజిటి పోస్టులను కేటాయిం చాలని, హాస్టల్స్ చుట్టూ ప్రహరీలు నిర్మించాలని, ప్రమోషన్ల లిస్టు ప్రకటించాలని, పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పెంచాలని కోరారు.
ఎస్‌ఎస్‌ఎ ఆధ్వర్యంలో సృజనాత్మక రచనలపై వర్క్‌షాప్
🌻సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రచురిస్తున్న బాలికల ద్వైమాస పత్రిక 'కస్తూరి' ఆధ్వర్యంలో సృజనాత్మక రచనలపై శనివారం నుంచి సోమవారం వరకు బాలికలకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ఎ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ఈ వర్క్‌షాప్ ప్రారంభమవుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.🌻 దీంట్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. సాహిత్య, సృజన రంగాల్లో ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కథ, కవిత, వ్యాసం, నాటకం, చిత్రలేఖనం అంశాలపై తరగతులు చెబుతారని వివరించారు.
🌻ప్రముఖ రచయితలు మహమ్మద్ ఖదీర్ బాబు, పి. సత్యవతి, రాష్ట్ర భాషా సాంస్క తిక శాఖ సంచాలకులు డి. విజరు భాస్కర్, కవి కోడూరు విజరు కుమార్, ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ స్టేషన్ డైరెక్టర్ ఎం కృష్ణకుమారి, ఆర్టిస్టు చిదంబరం తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.