Type Here to Get Search Results !

చర్చల్లో ప్రతిష్టంభన ఉంటే 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు FAPTO

చర్చల్లో ప్రతిష్టంభన ఉంటే 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు FAPTO

*ధర్నా శిబిరానికి సీఎం పేషీ ఎడ్యుకేషన్ ఇంచార్జ్ గిరిజాశంకర్ ప్రతినిధిగా కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ బాబు రావు, గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్ & డైరెక్టర్ గారి తరఫున సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె రవీంద్రనాథ్ రెడ్డి హాజరై ఫ్యాప్టో నాయకత్వంతో చర్చలు జరిపి ఇప్పుడు మూడున్నర గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ మరియు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ లతో సెక్రటేరియట్లో చర్చలకు ఆహ్వానించారు.* *రెండు రోజుల్లో ఎడ్యుకేషన్ ఇంచార్జ్ గారితో సమావేశం ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చారు.*
*ఉపాధ్యాయుల అరెస్టుపై విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డీజీపీకి లేఖ రాసి కేసులన్నీ ఎత్తడానికి ఉపాధ్యాయులందరినీ వెంటనే విడుదల చేయడానికి కృషి చేయడానికి హామీ ఇచ్చారు.*
చర్చల్లో ప్రతిష్టంభన ఉంటే 17వ తేదీ నుండి రెండవ దశ ఆందోళనలో భాగంగా నిరవధిక నిరాహార దీక్షలకు సిద్ధంగా ఉండాలని నాయకత్వం ప్రకటించింది