Type Here to Get Search Results !

న్యాయం కోరుతూ డీఎస్సీ-2008 అభ్యర్థుల వినతి

న్యాయం కోరుతూ డీఎస్సీ-2008 అభ్యర్థుల వినతి

డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ ప్రకారం ఎంపికై ఉద్యోగాలు రాని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావును డీఎస్సీ-2008 అభ్యర్థులు కోరారు. ఎ.పి. బీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆదివారం మంత్రి నివాసంలో కలిసి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌లో ధ్రువపత్రాలు పరిశీలన పూర్తి చేసుకున్న కామన్‌ మెరిట్‌ జాబితాను పంపించాలని డీఈవోలను కమిషనర్‌ ఆదేశించారని, ఇందుకు కీలకపాత్ర వహించిన మంత్రి గంటాకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.

హైకోర్టు తుది తీర్పును అనుసరించి, ఎన్‌.సి.టి.ఈ.విధానాలను 2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నందున మాకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ ఉన్నతాధికారులతో చర్చించి, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు పి.వి.జ్యోతి, బి.ఎన్‌.సత్యనారాయణలు తెలిపారు.
Tags