ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) || క్విట్ సిపిఎస్ - ఫ్యాప్టో జాతాలు
ఆగస్టు 11వ తేదీ విజయవాడలో ర్యాలీ - బహిరంగ సభ
ఫ్యాప్టో జాతాలు - జులై 30 నుండి ఆగస్టు 10 వరకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మన రాష్ట్రంలో 1,86,000మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్ వల్ల రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ భద్రత కోల్పోయారు.
సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. కాని ప్రభుత్వాల నుండి కనీస స్పందన లేదు. | గత నవంబర్లో ఫ్యాప్టో చేపట్టిన నియోజకవర్గా స్థాయి ధర్నాల అనంతరం రాజకీయ పార్టీలు స్పందించాయి.
సిపిఎస్ అమలుకు పిఎఫ్ఆర్డీఏ చట్టంచేసిన పాలక పార్టీలన్నీ తమకు బాధ్యత లేనట్లు వ్యవహరిస్తున్నాయి. సిపిఎస్ రద్దు బాధ్యత మాదికాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. నూతన పెన్షన్ విధానం అమలుకు తెచ్చిన పిఎఫ్ఆర్డిఏ బిల్లును ఆమోదించి చట్టంగా మార్చింది ఈ పాలకులు కాదా? పిఎఫ్ఆర్డీఏ కమిటీతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వమే కదా? సిపిఎస్ ఎవరు తెచ్చారు?
2003 డిసెంబర్లోనే బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా 2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది.
2004లో ఏర్పడిన కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ-1 ప్రభుత్వం పిఎఫ్ఆర్డీఏ బిల్లు పార్లమెంట్లో పెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్ని ఆంధ్రప్రదేశ్తో సహా (ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి) సిపిఎస్ అమలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆలస్యంగా పోస్టింగ్లు పొందిన 2003 డిఎససి ఉపాధ్యాయుల సిపిఎస్ పథకంలో బలైనారు.
యుపిఏ ప్రభుత్వ కాలంలో వామపక్షాలు పార్లమెంట్లో అడ్డుకోవడం, పార్లమెంట్ వెలుపల ఉద్యోగ, | ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా 10 సంIIల బిల్లు ఆగింది. 2013 సెప్టెంబర్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్షంలోని బిజెపి కలిసి పిఎఫ్ఆర్డీఏ చట్టం తెచ్చి దేశంలోని కోట్లాదిమంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశారు.
ఎవరు రద్దు చేయాలి?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాజకీయ నిర్ణయంతో మన పెన్షన్ రద్దుచేసి నూతన పెన్షన్ విధానం అమలు చేస్తామంటూ | పిఎఫ్ఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. అధికారంలో ఎవరు ఉన్నా ఉద్యోగుల సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వానిది కాదా!ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 653, 654,656 జిఓలు రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తూ తీర్మానం చేయాలి. పిఎఫ్ఆర్డీఏతో ఒప్పందం రద్దు |చేసుకోవాలి.
రాబోయేది ఎన్నికల కాలం కొన్ని పార్టీలు సిపిఎస్ రద్దుకు హామీలు ఇస్తున్నారు. అది ఆచరణాత్మక హామీ అయితే అసెంబ్లీలో, పార్లమెంట్ లో నూతన పెన్షన్ విధానం రద్దుకు బిల్లు ప్రతిపాదించాలి. మిత్రులారా! .
రాజకీయ నిర్ణయంతో తెచ్చిన నూతన పెన్షన్ పథకం రాజకీయ నిర్ణయంతోనే రద్దు కావాలి. పెన్షన్ హక్కు రద్దుచేసినప్పుడు, సమ్మెహక్కు రద్దుచేసినప్పుడు వామపక్షాలు తప్ప అన్ని పార్టీలు ఏకమైనాయి. పాత పెన్షన్ సాధనకు మనవంతా ఏకంకావాలి.
విచిత్రమేమిటంటే ఎవరైతే పాత పెన్షన్ రద్దుకు పిఎఫ్ఆర్డీఏ చట్టం తెచ్చారో వారే ఇప్పుడు సిపిఎస్ ఉద్యమానికి మీమే నాయకులమంటూ పోరాటం చేస్తామంటున్నారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న బిజెపి పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందిపోయి తాజాగా త్రిపురలో పాత పెన్షన్ విధానం రద్దుచేసి సిపిఎస్ అమలు చేయబోతున్నారు.
ఉద్యోగుల, కార్మికుల హక్కులు కాలరాయడంలో పాలకవర్గాలన్నీ ఒక్కటే.
అందుకే సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాస్తవాన్ని గ్రహించాలి. సిపిఎస్ రద్దు కోసం ఉద్యమించాలి. నాయకత్వం సమస్య కాదు. సిపిఎస్ రద్దు లక్ష్యంగా ఉద్యమించాలి. సమరశీల ఉద్యమాల ఫలితంగా ఇప్పటివరకు అన్ని హక్కులు సాధించుకున్నాం. పాతపెన్షన్ విధానం కూడా సాధించుకుందాం.ఉద్యమంలో భాగంగా ఫ్యాప్టో జులై 30 నుండి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుండి రాష్ట్రవ్యాపితంగా 'క్విట్ సిపిఎస్' నినాదంతో జాతాలు ప్రారంభించింది.
ఉద్యోగుల జీవితాల్లో చీకటిరోజు అయిన సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలో అందురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ క్యాజువల్ సెలవుపెట్టి "కలెక్టరేట్ల ముట్టడి”లో పాల్గొనాలని ఫ్యాప్టో విజ్ఞప్తి చేస్తోంది. సిపిఎస్ రద్దు కోసం పోరాడే వారు అందరూ ముట్టడిలో పాల్గొనాలని ఆహ్వానిస్తోంది.
FEDERATION OF ANDHRA PRADESH TEACHERS' ORGANISATIONS