Type Here to Get Search Results !

ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన 485 సీట్లు - 16న వెయిటింగ్ లిస్టు ఎంపిక జాబితా

ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన 485 సీట్లు

నూజివీడు:ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన వారు చేరక పోవడంతో 485 సీట్లు మిగిలిపోయాయి. వీటి ల్లో మొత్తం సీట్లు నాలుగు వేలు కాగా 56 వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలిపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూజివీడులో 90 సీట్లు, ఇడుపులపాయలో 123, శ్రీకాకుళంలో 135, ఒంగోలులో 137 సీట్లు చొప్పున మిగిలిపోయి నట్లు గుర్తించారు. అయితే అధికారులు మాత్రం ప్రతిఏటా ఇది సర్వసాధారణమేనని, గత పదేళ్లు గా ఇలాగే జరుగుతోందని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన 485 సీట్లను భర్తీ చేయడానికి ఈనెల 21 నుంచి 24 వరకు కౌన్సెలింగ్ నిర్వ హించడానికి ఆర్జీయూకేటీ అధికారులు సన్నా హాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థులతో ఎంపిక జాబితాను ఈనెల 16న ప్రకటించనున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్లు నిర్వహిస్తారు.