సహాయ ప్రొఫెసర్ల స్ర్కీనింగ్ ఫలితాలు 13న
🌻అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్ర్కీనింగ్ టెస్ట్ ఫలితాలను ఈ నెల 13న విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.తెలుగుకు జై
ప్రచురణలు, కోర్టు తీర్పులు, సంస్థల పేర్లన్నీ తెలుగులోనే♦భాషోద్ధరణలో ముందడుగు*
*♦ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు*
*♦భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తి లక్ష్యంగా కార్యాచరణ*
*♦ఉన్నతాధికారులకు తెలుగులో శిక్షణ*
*♦‘పలుకు’బడిపై ఉద్యోగులకు పరీక్షలు*
🌻తేనెలొలుకు తెలుగు మరింత తీయదనాన్ని అద్దుకోనుంది. ప్రాచీనతకు ప్రాకారంగా నిలిచిన మాతృభాషలోనే ఇకముందు పరిపాలన జరగనుంది. ప్రభుత్వ ప్రచురణలు మొదలు ఉన్నతాధికారులకు శిక్షణ దాకా తెలుగులోనే సాగనున్నాయి. నవ్యాంధ్రలో తొలినుంచీ తెలుగుకు పట్టం కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘‘ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డుని ఏర్పాటుచేసింది. తాజాగా ఈ బోర్డు పరిధిలోనే ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి సంస్థ’కు ప్రభుత్వం జీవం పోసింది. ఈ మేరకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
🌻ఈ సంస్థ విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి.. తెలుగు భాషను ఎలా అభివృద్ధి చేస్తారు..ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో తెలుగు భాష పరిధిని ఏ స్థాయిలో పెంచుతారనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగు భాషకు పునరుత్తేజం, విశ్వవ్యాప్తే ధ్యేయంగా ఏర్పాటు అయిన ఈ సంస్థ చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సాధారణ పరిపాలన, న్యాయ, కార్మిక, పర్యాటక, విద్యాశాఖ కార్యదర్శులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాల్లో నిపుణులైన నలుగురిని సభ్యులుగా నియమిస్తారు. సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఈ సంస్థ పాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తారు. ఈ సంస్థ కింద ఐదు కమిటీలు పని చేస్తుంటాయి. భాషకు పునరుత్తేజం కలిగించేందుకు కృషి చేస్తాయి. తెలుగు అమలు కమిటీ, ‘ఈ - తెలుగు’ కమిటీ, అభివృద్ధి, ప్రచురణలు కమిటీ, అనువాదం కమిటీ, అంతర్జాతీయ భాషాభివృద్ధి కమిటీల పేరిట వీటిని ఏర్పాటు చేస్తారు.
*♦పూర్తి ‘అధికార’ ముద్ర కోసం..*
అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడం కోసం ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, రికార్డును తెలుగులో అందుబాటులో ఉంచటంపై దృష్టి సారిస్తుంది. న్యాయ స్థానాలు వెలువరించే తీర్పులు కూడా తెలుగులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వం అభిలాష. అయితే, న్యాయవ్యవస్థలో వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు పని చేస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, వారికి తెలుగు భాషపై మరింత పట్టు సాధించేలా శిక్షణ, సదస్సులు, ప్రదర్శనలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. పాలనా విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. సుదీర్ఘకాలంగా ఏపీలో పని చేస్తున్నందు వల్ల, వారిలో కొంతమంది తెలుగు మాట్లాడగలుగుతారు. అయితే, వారి భాషా పరిజ్ఞానం తెలుగులో విధులు నిర్వహించేందుకు ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకమే. దీంతో ఆ అధికారులకు తెలుగుపై ఉన్న పట్టు ఎంత అన్నదానిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను కూడా తెలుగు భాషాభివృద్ధి సంస్థకు అప్పగించింది. అలాగే, రాష్ట్రంలో ఉన్న కేంద్ర సంస్థల్లో కూడా తెలుగు అమలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
*♦సంస్థలకు, కార్యాలయాలకు తెలుగు పేర్లు*
విమానాశ్రయాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇలా అన్నింటా తెలుగు కనిపించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక కృషికి గ్రామ సచివాలయం నుంచి శ్రీకారం చుట్టి, తాలూకా, జిల్లా స్థాయికి విస్తరిస్తారు. శాసనసభ వ్యవహరాలకు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులోనే ఉండేలా ప్రత్యేక కార్యాచరణ అమలుకానుంది.
*♦డిజిటల్‌లో మన పలుకు*
డిజిటల్ యుగంలో తెలుగును అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేయాలంటే, అదే విధానంలో భాషను ముందుకు తీసుకువెళ్లవలసి ఉంది. ఈ క్రమంలోనే ’ఈ - తెలుగు’ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటయింది. సైకాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు, చరిత్ర, వైద్యం వంటి రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిజిటల్ పదకోశంలో అందుబాటులో ఉంచుతారు. ఇంటర్నెట్‌లో తెలుగు వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక.. అన్‌లైన్‌లో తెలుగు బోధన చేపడతారు. ప్రాధికార సంస్థ వెబ్‌సైట్‌లో తెలుగు సంగీతం, పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలను డిజటలీకరించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ పరమైన వ్యవహారాలన్నింటికి యూనికోట్ అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారాన్ని అదే రూపంలో భద్రపరచటం వంటి పనులు చేయనున్నారు. విదేశీ భాషల్లో ఉన్న అత్యున్నత సమాచారంతో పాటు సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలను అనువాదం చేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగించాలని నిబంధన ఏర్పాటు చేశారు.
*♦పొరుగు రాష్ట్రాలతో సమన్వయం..
తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాల్లో విద్యాభోధన తెలుగులో సాగేలా అక్కడి పాలకులతో సమన్వయం చేసుకొంటారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా మూడో భాషగా తెలుగు ఉండేలా ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజల కోసం భాషపరమైన ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
*♦కొసమెరుపు*
తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘‘తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ’’ను ఏర్పాటు చేసింది. కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం ఆంగ్లంలో విడుదల చేయడం కొసమెరుపు.
*♦మాట తప్పితే వేటే..
‘‘తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాధికార సంస్థకు జీవం పోశారు. పరిపాలనలో తెలుగు అమలు, వినియోగంపై కాలపరిమితితో కూడిన నిబంధనావళి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తెలుగు భాషాభివృద్ధి నిధి పేరిట రూ.25 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50 వేల వరకు జరిమానా వసూలుచేస్తాం. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలి. లేకుంటే రూ.10 వేలు జరిమానా తప్పదు. నిబంధనల మేరకు తెలుగుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ.5 వేలు అపరాధరుసుం విధిస్తాం. విద్యాసంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50 వేలు జరిమానా, ఆరునెలల జైలు శిక్ష తప్పదు.
*- ముఖేశ్ కుమార్ మీనా,* *ముఖ్య కార్యదర్శి,*
*పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ*
22న సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు
🌻న్యూఢిల్లీ, జూలై 10: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు ఈనెల 22న వెలువడనున్నాయి.🌻 యూపీఎస్సీ అధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. జూన్ 3న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 3 లక్షలమంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనిలో ఉత్తీర్ణులైన వారు వచ్చే అక్టోబరు 1న మెయిన్స్ పరీక్షలు రాస్తారు.
ఉపాధ్యాయులపై ఉక్కుపాదం
- రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే అక్రమ అరెస్టులు, బెదిరింపులు- పాఠశాలల్లో పాఠాలు చెప్తున్న వారిని సైతం పోలీస్ స్టేషన్లకు తరలింపు
- నేటి ఫ్యాప్టో ధర్నాపై ముందస్తు నిర్బంధం
- ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రభుత్వ చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో ఈ నెల 11న తల పెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలోనూ ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను ముందస్తు అక్రమ అరెస్టులు చేసింది. పోలీసులు పాఠశాలలు, ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టులకు పూనుకున్నారు. ఎక్కడికక్కడే నిఘా పెట్టి కనిపించిన ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహాధర్నాకు హాజరు కాబోమని కొంతమంది ఉపాధ్యాయులతో పత్రాలపై సంతకాలు పెట్టించుకొని ప్రజాస్వామ్య హక్కులను నేలరాశారు. ఫ్యాప్టోలో ప్రధాన భూమిక పోషిస్తోన్న యుటిఎఫ్ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ఎమర్జెన్సీని తలపించేలా టిడిపి ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావును పోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా గుంటూరు .
🍎శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, కంచిలి, రాజాం, వీరఘట్టం, కొత్తూరు తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఉపాధ్యాయులను పోలీసులు నిర్బంధించారు. పలు పాఠశాలల్లోకి పోలీసులు ప్రవేశించి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను సైతం అరెస్టు చేశారు
🍎 విజయవాడలో నిర్వహించే మహాధర్నాకు హాజరు కాబోమని కొంతమంది ఉపాధ్యాయులతో పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయ నేతలను కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడే పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పాఠశాలలు తదితర చోట్ల పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ధర్నాకు బయలు దేరి వెళ్తున్న ఫ్యాప్టో, యుటిఎఫ్, ఎస్‌టియు నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఫ్యాప్టో నాయకులను పోలీసులు ఫోన్లు చేసి బెదిరించారు.
అరెస్టులు అక్రమం : ఫ్యాప్టో
ఉపాధ్యాయ ముందస్తు అరెస్టులను ఫ్యాప్టో తీవ్రంగా ఖండించింది.🍎సమస్యల పరిష్కారానికి జూన్ 28న ప్రభుత్వానికి ప్రత్యక్ష చర్య నోటీసు అందించామని ఫ్యాప్టో చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా చర్చలకు ఆహ్వానించకుండా అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.
ఆందోళన చేస్తే అరెస్టులా: పిడిఎఫ్
ఉపాధ్యాయ ముందస్తు అరెస్టులను పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు.
🍎ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రదర్శనకు వెళ్తున్న ఉపాధ్యాయుల్ని ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం సరికాదని పిడిఎఫ్ శాసనమండలి ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
🍎 కేంద్రప్రభుత్వంపై టిడిపి ఆందోళన పేరుతో దీక్షలు జరుపుతోందని, వారికిలేని ఆంక్షలు ఉపాధ్యాయులపై ఎందుకని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల వల్ల శాంతి భద్రలకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా అని ప్రశ్నించారు.
MDM మిడ్డేమీల్స్ ప్రయివేటుకు ఇవ్వొద్దని మానవహారం
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యాన మిడ్డేమీల్స్ నిర్వాహకులు విశాఖ జిల్లా అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్‌లో మంగళవారం రాస్తారోకో చేశారు. దీనికి ముందు సిఐటియు కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.స్వరూపరాణి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో భోజన పథకాన్ని నవ ప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 31 మండలాల్లో 9 క్లస్టర్ల ద్వారా సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ భోజనం సరఫరా చేయనుందని చెప్పారు. తెల్లవారు ఎప్పుడో వండిన భోజనాన్ని వ్యాన్ల ద్వారా ఆయా పాఠశాలలకు తరలించి మధ్యాహ్నం పంపిణీ చేస్తారని, ఇటువంటి ఆహారంలో పౌష్టికత ఉండదని, పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల జిల్లాలో 8వేల మంది ఎండిఎం కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి కె.ప్రసన్న, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో ఎండిఎం కార్మికులు పాల్గొన్నారుఫీజుల భారం!
♦వృత్తి విద్యా కోర్సుల రుసుముల సవరణ**♦వచ్చే ఏడాది నుంచి అమలుకు మొదలైన కసరత్తు*
*♦ఎక్కువ పెంచాలంటున్న యాజమాన్యాలు*
🌻వచ్చే విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులు చదివించాలనుకునే తల్లిదండ్రులపై బోధన రుసుముల భారం పడనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) బోధన రుసుములను సవరిస్తూ ఉంటుంది.
🌻గతంలో పెంచిన రుసుముల గడువు ఈ ఏడాదితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పెంచే రుసుములకు సంబంధించిన కసరత్తును ఏఎఫ్‌ఆర్సీ చేపట్టింది. ఇందుకు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్ రూపకల్పన పనులు కొనసాగుతున్నాయి. అక్టోబరులో నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. యూజీసీ వేతన స్కేళ్లు అమలు చేయాల్సి రావడం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈసారి కళాశాలల యాజమాన్యాలు రుసుముల ఎక్కువ పెంచాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్‌లో రూ.35వేలు నుంచి రూ.1.08లక్షలు, ఎంటెక్‌లో రూ.57వేలు, ఎంఫార్మసీ రూ.1.10లక్షలు, ఫార్మడీ(పోస్టు బ్యాచిలర్) రూ.68వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.27వేలు చొప్పున రెండేళ్ల క్రితం ఏఎఫ్‌ఆర్సీ బోధన రుసుములను నిర్ణయించింది.
🌻 కళాశాలలోని మౌలికవసతులు, ల్యాబ్ సదుపాయం, ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు, విద్యార్థులకు అందించే శిక్షణ, ప్రయాణ సదుపాయం, రాబోయే మూడేళ్లలో వ్యయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని నిర్ణయించాలి. ఇంతవరకు బాగానే ఉన్నా కళాశాలలు సమర్పిస్తున్న నివేదికల్లోని వాస్తవం ఎంతన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో సమాచారమం ఇస్తున్నా... మౌలికవసతులపై సరైన తనిఖీ వ్యవస్థ ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు యూజీసీ పేస్కేళ్లకు అనుగుణంగా చెల్లింపులు చేయడం లేదు.
🌻 కళాశాల వ్యయంపై ఆడిట్ నివేదికను తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు జరగడం లేదు. కేవలం కళాశాలలు సమర్పించే నివేదికలు, సమాచారం ఆధారంగానే రుసుములు నిర్ణయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇంజినీరింగ్ రుసుములు రూ.32వేలు నుంచి రూ.97,800వరకు ఉండేవి.
*♦పీజీ కళకళ..*
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు బోధన రుసుములు అధికంగా ఉండడంతో ఎక్కువ కళాశాలలు వీటిపై దృష్టిసారిస్తున్నాయి. కర్నూలులోని ఓ కళాశాలలో బీటెక్ సీట్లు 600వరకు ఉండగా.. ఎప్పుడూ 300 భర్తీ కావడమే కష్టం. కానీ, ఎంటెక్ సీట్లు 300 ఉంటే 300 భర్తీ అవుతున్నాయి. బీటెక్‌లో కన్వీనర్ కోటా కింద 10వేలు లోపు ర్యాంకు వస్తేనే బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎంటెక్‌లో ఇలా లేదు. పూర్తి స్థాయిలో (రూ.57వేలు) ప్రభుత్వమే రుసుములు చెల్లిస్తోంది. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని కళాశాలలు... అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా, కళాశాలకు రాకపోయినా పర్వాలేదని చెబుతూ చేర్చుకుంటున్నాయి. ఫీజు భారం లేకపోవడంతో ఇటీవల హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఏపీలో ఎంటెక్‌లో చేరారు. అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూనే ఇక్కడ ఎంటెక్ కొనసాగిస్తున్నారు. పీజీ కోర్సులు ఉంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు సహాయ ప్రొఫెసర్లు ఉండాలి. చాలా చోట్ల సహాయ ప్రొఫెసర్లతోనే నెట్టుకొస్తున్నారు.*♦మూలన పడ్డ నివేదిక..
ఇంజినీరింగ్ రుసుముల పెంపు నేపథ్యంలో కళాశాలల్లోని మౌలికవసతులు, సదుపాయాలను తనిఖీ చేసేందుకు 2016లో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ పి.నరసింహారావు అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 42 కళాశాలలను తనిఖీ చేసి అనేక లోపాలను గుర్తించింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ఇంతవరకు చర్యలు లేవు.
*♦బీటెక్‌కు కనీసం రూ.65వేలు ఉండాలి*
జీతాలు, ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్‌లో కనీస బోధన రుసుములు రూ.65వేలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న రూ.35వేలుతో కళాశాల నడపడం కష్టంగా మారింది. యూజీసీ పేస్కేళ్లు అమలు చేస్తే జీతాలు పెరుగుతాయి.
*- గద్దె రాజ్‌లింగ్, ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల* *యాజమాన్య అసోసియేషన్ కార్యదర్శి*
ఆన్‌లైన్ తరగతులు త్వరలో ఆరంభం*
🌻డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అధ్యాపకుల బోధన వీడియోలు, పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చేందుకు కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులే నేరుగా వీడియోలు వినడం, పాఠాలను చదువుకోవడం ద్వారా అదనంగా నేర్చుకునేందుకు మొదటిసారి ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు.🌻లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం పేరుతో ఈ వెబ్‌సైట్‌ను తీసుకురానున్నారు. ఇందులో అధ్యాపకుల అత్యుత్తమ బోధన పాఠాలు, ఇందుకు సంబంధించిన కంటెంట్ గ్రాఫిక్స్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే మన టీవీలో ప్రసారమైన బోధన వీడియోలను దీనికి అనుసంధానం చేస్తున్నారు.
🌻 డిగ్రీస్థాయి వరకు ఉండే పాఠ్యాంశాలతోపాటు వీటికి సంబంధించిన అదనపు సమాచారం కోసం అయా ఆన్‌లైన్ లింకులను అందుబాటులో ఉంచుతారు.
*♦అవగాహనకు ప్రశ్నలు!
ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థుల కోసం ఈ విభాగాన్ని రూపొందిస్తున్నారు. విద్యార్థులు మొదటిసారి ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో కళాశాల ప్రిన్సిపల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు ఎక్కడి నుంచైనా వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల్లోని కీలకమైన పాఠ్యాంశాలను మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ప్రతి విద్యార్థికి ఒక ఐడీ, పాస్‌వర్డ్ ఉంటుంది. ఏ విద్యార్థి ఎంత సమయం ఈ ఆన్‌లైన్ వినియోగించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
🌻 విద్యార్థులు ఎప్పుడైనా తరగతులకు హాజరుకాలేకపోయినా, ఒకవేళ అదనపు సమాచారం తెలుసుకోవాలన్నా విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఆన్‌లైన్ పాఠ్యాంశాలతోపాటు ఇందుకు సంబంధించిన ప్రశ్నలను అందుబాటులో ఉంచుతారు. అయా పాఠ్యాంశాలను చదివిన తర్వాత విద్యార్థులు తమకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకునేందుకు ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించడం ద్వారా పరీక్షలకు సిద్ధం కావొచ్చు.