ఇంజనీరింగ్ సీట్లలో సగం ఖాళీ
బోధన ఫీజుల చెల్లింపునకు ‘చంద్రన్న కత్తెర’ ఎఫెక్ట్
ఫీజులు భారమై టెక్నాలజీ విద్యకు పేద విద్యార్థులు దూరం
కన్వీనర్ కోటాలో సీట్లు కూడా మిగిలిపోతున్న వైనం
మొత్తం సీట్లలో సగం కూడా నిండే పరిస్థితి లేదు
గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఊరట
ఇప్పుడు ఆ పథకానికి పలు నిబంధనలు, పరిమితులు
ఫీజులను కూడా భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఫీజులు కట్టలేక చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. ఒకప్పుడు నిరుపేద విద్యార్థులకు ఎంతో అండగా నిలిచి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇలా ఏ ఉన్నత చదువు పూర్తిచేయాలన్నా వారికి ఆ పథకం తోడుగా నిలిచింది. కానీ నేడు ఆ పథకాన్ని నీరుగార్చేశారు. పేదలకు ఉన్నత చదువుల్ని దూరం చేశారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక స్థోమత లేక పేదలు ఈ కోర్సులకు దూరమవుతున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులకన్నా టెక్నికల్ కోర్సులు చదివితే తొందరగా ఉద్యోగమో, ఉపాధో దొరుకుతుందని విద్యార్థులు చాలాకాలంగా ఇంజనీరింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం వారికి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఎవరు ఏ కోర్సు చేయాలనుకున్నా ఆయా కోర్సుల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు బారులు తీరేవారు. కాలక్రమేణా ఆ పథకాన్ని నీరుగార్చడంతో విద్యార్థులు లేక కాలేజీలే మూతపడుతున్నాయి.
ఫీజుల పెంపుతో విద్యార్థులపై భారం
ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఆయా కోర్సుల పూర్తిఫీజును రీయింబర్స్ చేసేలా ప్రభుత్వం నిబంధనలను మార్చింది. పదివేలు దాటి ర్యాంక్ వస్తే వారికి రూ. 35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంటు ఇస్తున్నారు. తక్కిన ఫీజు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంజనీరింగ్‌లో నాలుగేళ్లపాటు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేక తమ పిల్లలను కాలేజీల్లో చేర్చలేకపోతున్నారు. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేయడం కూడా విద్యార్థులను సాంకేతిక విద్యకు దూరం చేస్తోంది. గతంలో రూ. 75 వేల లోపు వరకు గరిష్ట ఫీజు ఉండగా ఇప్పుడు దానిని రూ. 1.10 లక్షలకు పెంచారు. అంటే ప్రభుత్వం రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్ ఇస్తే విద్యార్థి 75 వేలు చెల్లించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల సంఖ్య 406 వరకు ఉంది.
ఇందులో అత్యధిక కాలేజీల్లో రూ. 50 వేల నుంచి రూ. 60 వేల లోపు ఫీజు ఉండేది. గరిష్ట ఫీజు రూ.75 వేల వరకు ఉన్న కాలేజీల కొన్నే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫీజులు పెంచడంతో రూ. 75 వేల నుంచి రూ. 95 వేల మధ్య ఫీజులున్న కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో చేరే విద్యార్థులపై ఏటా రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు భారం పడుతోంది. ఇక రూ. లక్షకు పైగా ఉన్న కాలేజీల్లో చేరాలంటే ఫీజుల భారం తట్టుకోలేక ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతర కోర్సుల్లో చేర్పిస్తున్నారు. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలే ఇందుకు తార్కాణం
వేలాది సీట్లు ఖాళీ..
రాష్ట్రంలో 1.56 లక్షల ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు ఉంటే.. గత ఏడాదిలో 57 వేల సీట్లు మిగిలిపోయాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్‌కు 2,64,295 మంది హాజరుకాగా వారిలో 2,01,900 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంపీసీ 1,38,017 మంది, బైపీసీ 63,883 మంది ఉన్నారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు 95,455 ఉండగా 67,078 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలోనూ ఆప్షన్లు ఇచ్చింది 65,909 మంది కాగా సీట్లు పొందింది 60,943 మంది. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలోనూ 15 వేల మందికి పైగా కాలేజీల్లో చేరలేదు. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌కు 47,526 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా కౌన్సెలింగ్‌కు వచ్చిన వారి సంఖ్య కేవలం 3,165 మంది మాత్రమే. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి ఇంకా ఎంపీసీ స్ట్రీమ్‌లో 33 వేల సీట్లు మిగిలి ఉన్నాయి. బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అందులోనూ భారీగానే సీట్లు మిగిలిపోతాయని భావిస్తున్నారు. అందులో ఫార్మా కోర్సుకు సంబంధించినవి కావడం, ఫీజులు ఎక్కువగా ఉండడంతో పాటు పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఫీజులు చెల్లించి చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.
ముఖ్య బ్రాంచిల్లోనూ మిగిలిపోతున్న సీట్లు
ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన బ్రాంచిలుగా భావించే వాటిలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. గతేడాది ఈసీఈలో 5,280, కంప్యూటర్ సైన్సులో 4,289, కెమికల్ ఇంజనీరింగ్‌లో 6,985, ఈఈఈలో 5,561, సివిల్‌లో 5,366 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మసీలో 3,587 సీట్లుంటే అందులో కేవలం 298 మాత్రమే భర్తీ అయి 3,289 సీట్లు మిగిలిపోయాయి. ఇక గత ఏడాదిలో ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు 5 ఉన్నాయి. కేటాయించిన విద్యార్థుల సంఖ్య ప్రకారం 1–5 మంది విద్యార్థులు ఉన్నవి 14, 6–10 మంది ఉన్నవి 9, 11–15 వరకు ఉన్నవి 9, 16–20 వరకు ఉన్నవి 3, 21 నుంచి 25 వరకు ఉన్నవి 8 మాత్రమే. ఈ ఏడాది కూడా 1–5 మంది ఉన్నవి 5, 6–10 మంది ఉన్నవి 6, 11–15 మంది ఉన్నవి 4, 16–20 మంది ఉన్నవి 8, 21– 25 మంది ఉన్నవి 10 కాలేజీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని కాలేజీలు విద్యార్థులు చేరని కోర్సులను రద్దుచేసుకుంటుండగా మరికొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా మూతకు దరఖాస్తు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కాలేజీలు 46 కోర్సులను రద్దుచేసుకున్నాయి. 9 కాలేజీలు మూతపడ్డాయి.

10న రాష్ట్రవ్యాప్త తెలంగాణ యూనివర్సిటీల బంద్
హైదరాబాద్: కేంద్రం యూజీసీని రద్దు చేసి హెచ్‌ఈసీఐ (భారత ఉన్నత విద్యా కమిషన్) బిల్లు ప్రవేశపెట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 10న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త యూనివర్సిటీల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి కోట రమేశ్ పిలుపునిచ్చారు. బడుగు వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కేంద్రం యూజీసీని రద్దు చేసి హెచ్‌ఈసీఐ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ కేవలం వారం రోజుల్లో చర్చలు పూర్తిచేసి యుజీసీ రద్దుకు సిఫారసు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఆందోళన కార్యక్రమాలు...
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ఉద్యమంలో భాగంగా జూలై 14న కర్నూలులో సీపీఎస్‌పై దండయాత్ర, 22న శ్రీకాకుళంలో పాలకొండ పొలికేక, ఆగస్టు 4న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో సత్యాగ్రహ దీక్ష, సెప్టెంబరు 1న సీపీఎస్ అంతిమ యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పరిశీలనలో సీపీఎస్
సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సానుకూలంగా ఉన్నట్లు వివరించారు. సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి కె.పార్థసారఽథి మాట్లాడుతూ సీపీఎస్ రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు నష్టమని కాగ్ స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. ఏపీజేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కనపర్తి సంగీతరావు సీపీఎస్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ బాజీ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేస్తే అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు ఒక నెల జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గుర్రం మురళీమోహన్, జి.కోటేశ్వరరావు, గోపీ, పిచ్చయ్య తదితరులు మాట్లాడారు.
12 నుంచి ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 13న ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. 13-15వరకు కాలేజీల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 17 నుంచి 19 వరకు ట్యూషన్ ఫీజును చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 20లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలిసీపీఎస్ ఉద్యమానికి ఉద్యోగ సంఘాల మద్దతు
గుంటూరు: జాతీయ స్థాయిలో సీపీఎస్ రద్దు కోసం జరుగుతున్న ఉద్యమాలకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ ఈఏ) ఏర్పడిందన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్‌ఈఏ పిలుపు మేరకు గుంటూరు స్టాల్ గరల్స్ హైస్కూల్‌లో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. గుంటూరు గర్జన- సీపీఎస్ నిమజ్జనం పేరుతో ఈ కార్య క్రమాన్ని చేపట్టారు. జేఏసీ చైర్మన్ బొప్పరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో సీపీఎస్ రద్దు చేస్తూ ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆందోళన కార్యక్రమాలు...