Type Here to Get Search Results !

8/7/18 విద్యా విషయక ముఖ్య వార్తా విశేషాలు

ఇంజనీరింగ్‌ సిలబ్‌సలో మార్పు!

ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ డీ సహ్రసబద్ధే
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా
బోధన నైపుణ్యం కోసం అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం
‘‘ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం.. బోధనా నైపుణ్యం కోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ప్రత్యేక అవగాహనా ఒప్పందం చేసుకుంటున్నాం. సాంకేతిక విద్యలో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ ఇంటర్న్‌షి్‌పను పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చైర్మన్‌ అనిల్‌ డీ సహస్రబుద్ధే పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సిలబ్‌సలో భారీమార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాలు విస్తృతం చేశామని చెప్పారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశ పెట్టిన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌తో అనేక స్టార్టప్‌ పరిశ్రమలకు ఊతం ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో 65 % జనాభా 35 ఏళ్లలోపు వారేనని, ఫలితంగా ఔత్సాహికులైన ఎంతోమంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని చెప్పారు. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో నైపుణ్యం సాధించేలా ఇంటర్న్‌షిప్‌ ఉపయోగ పడుతుందన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రం విభజన కష్టాల్లో ఉన్నప్పటికీ విద్యారంగానికి సీఎం చంద్రబాబు 13 % నిధులను కేటాయించారని చెప్పారు.

ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌..

62,600 మందికి సీట్లు.. భర్తీకానివి 32,855
ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ శనివారం ముగిసింది. మొత్తం 95,455 సీట్లు అందుబాటులో ఉండగా 62,600 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే, 32,855 సీట్లు భర్తీ కాలేదు. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈ నెల 12లోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఎంసెట్‌-2018 అడ్మిషన్ల కన్వీనర్‌ పాండాదాస్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన రెండో దశ కౌన్సెలింగ్‌ వివరాలతో ప్రకటన విడుదల చేశారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు జూన్‌ 6న నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఈ నెల 5 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
మొత్తం 1,33,228 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించగా, 1,17,627 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 287 కాలేజీల్లో 91,595 సీట్లు ఉండగా వీటిలో 62,263 సీట్లు కేటాయించారు. ఫార్మసీ విభాగంలో 114 కాలేజీల్లో 3274 సీట్లు ఉంటే 294 సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మా.డీ విభాగంలో 59 కాలేజీల్లో 586 సీట్లు అందుబాటులో ఉండగా 43 భర్తీ అయ్యాయి. మొత్తంగా 460 కాలేజీల్లో 95,455 సీట్లు అందుబాటులో ఉంటే 62,600 భర్తీ అయ్యాయి. 32,855 మిగిలిపోయాయి.

మెడికల్ కౌన్సెలింగ్‌ రద్దు!

‘జీవో 550’పై తేలేవరకు రెండో విడత నిలిపివేత
రాష్ట్ర సర్కారు ఆదేశాలు
స్టే ఎత్తివేతకు అఫిడవిట్‌
9 లేక 10న కోర్టులో వాదన
రీ-కౌన్సెలింగ్‌పై మథనం
హైకోర్టు తీర్పు తర్వాతనే నిర్ణయం తీసుకొనే వీలు
రాష్ట్రంలో ఇప్పటి దాకా జరిగిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం రద్దు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవో నంబరు 550ని పక్కన పెట్టి కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల రిజర్వేషన్‌ కేటగిరీ ఇబ్బందుల్లో పడింది. దీని వల్ల సుమారు 300 సీట్లవరకు ఈ కేటగిరీ అభ్యర్థులు ఇప్పటికే కోల్పోయారు. ఇంకా కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తే వారికి మరింత అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని వర్సిటీ అధికారులు అంగీకరిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రధాన సంచికలో ప్రచురించిన ‘‘కోటాకు తూట్లు’’ కథనం కూడా ఇదే విషయాన్ని గుర్తుచేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యల్లో వేగం పెరిగింది. ప్రస్తుతానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం నిలిపివేయాలని వర్సిటీ అధికారులను ఆదేశించింది. ఆ వెంటనే ప్రభుత్వ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీంతోపాటు అడ్మిషన్‌ ప్రక్రియను కూడా వర్సిటీ అధికారులు నిలిపివేశారు. షెడ్యూల్‌ ప్రకారం మొదటి కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరాలి. వీరు కాలేజీల్లో చేరిన తర్వాత కౌన్సెలింగ్‌ రద్దు చేయాల్సివస్తే ఇబ్బందులు వస్తాయని వర్సిటీ అధికారులు ఆలోచించారు. దానికోసమని అడ్మిషన్లు నిలిపివేశారు. జీవో నం. 550తో సంబంధం లేకుండా కౌన్సెలింగ్‌ జరపడం వల్ల నష్టపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం తన దృష్టి నిలిపింది.
కౌన్సెలింగ్‌ రద్దు చేయడం ద్వారా తప్ప మరోరకంగా వారికి జరిగిన అన్యాయాన్ని తొలగించలేమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనిపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతానికి జీవో 550పై ఉన్న స్టేను ఎత్తివేయించే మార్గం చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం పొద్దుపోయాక ఉన్నత విద్యాశాఖ, న్యాయ శాఖ అధికారులతో దీనిపై సీఎం సమీక్షించారు. ఆయన సూచనల మేరకు అధికారులు జీవో నంబరు 550పై స్టే ఎత్తివేతను కోరుతూ, హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం లేక మంగళవారాల్లో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో హైకోర్టు చేసే సూచనల మేరకు కౌన్సెలింగ్‌ విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

చేయమంటే.. ఎలా!
ఉమ్మడి హైకోర్టు జీవో 550 ప్రకారమే కౌన్సెలింగ్‌ జరపాలని ఆదేశిస్తే... కౌన్సెలింగ్‌ మొత్తం రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ జీవోపై ఉన్న స్టేను తొలగించడానికే హైకోర్టు ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే రీ కౌన్సెలింగ్‌ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మరోవైపు ఎంసీఐ నిబంధనల ప్రకారం ఆగస్టు 31వ తేదీ వరకూ కౌన్సెలింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ఏటూ సమయం ఉంది. కాబట్టి రిజర్వేషన్‌ అభ్యర్థులకు న్యాయం చేసే దిశగానే అడుగులు వేయాలనే ఆలోచనలో వర్సిటీ, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లు మొత్తం భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో రెండు రీజియన్లతో పాటు స్టేట్‌ వైడ్‌ కాలేజీ అయినా సిద్ధార్థ మెడికల్‌ కాలేజీతో కలిపి మొత్తం 1,919 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వర్సిటీ అధికారులు మొదటి కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేశారు. కన్వీనర్‌ కోటాలో ఉన్న స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, దివ్యాంగులు, ఆర్మీ కోటా సీట్లు తప్ప.. మిగతా మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ఎన్ని సీట్లు పక్కదారి (స్లైడింగ్‌) పట్టాయనేది వర్సిటీ వద్ద సమాచారం లేదు. కన్వీనర్‌ కోటాలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయనేది స్పష్టతని ఇవ్వలేకపోతున్నారు.

న్యాయవాదులతో వీసీ భేటీ
రిజర్వేషన్‌ కోటాకు అన్యాయం జరుగుతున్న విషయం ప్రభుత్వానికి తెలియగానే, సీఎంవో అధికారులు స్పందించారు. వెంటనే కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ సీవీరావుకు సమాచారం అందించారు. దీనిపై ఆయన వర్సిటీ ఉన్నతాధికారులు, తమ సంస్థ న్యాయవాదులతో సమావేశమయ్యారు. హైకోర్టుకు వివరించడానికి ఎలాంటి సమాధానాలను తయారుచేసుకోవాలనేది చర్చించారు. అనంతరం వర్సిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిపివేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ అప్పారావుకు ఫోన్‌ చేసి ప్రస్తుతానికి కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని సూచించారు.

ఇంజనీరింగ్‌ సిలబస్‌లో మార్పు

ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ డీ సహ్రసబుదే*
🌻గుంటూరు(విద్య), జూలై 7: ‘‘ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం.. బోధనా నైపుణ్యం కోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ప్రత్యేక అవగాహనా ఒప్పందం చేసుకుంటున్నాం. సాంకేతిక విద్యలో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ ఇంటర్న్‌షి్‌పను పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ డీ సహస్రబుదే పేర్కొన్నారు.
🌻 గుంటూరులోని ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సిలబ్‌సలో భారీమార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాలు విస్తృతం చేశామని చెప్పారు.
🌻 ఇంజనీరింగ్‌లో ప్రవేశ పెట్టిన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌తో అనేక స్టార్టప్‌ పరిశ్రమలకు ఊతం ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో 65ు జనాభా 35 ఏళ్లలోపు వారేనని, ఫలితంగా ఔత్సాహికులైన ఎంతోమంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని చెప్పారు. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో నైపుణ్యం సాధించేలా ఇంటర్న్‌షిప్‌ ఉపయోగ పడుతుందన్నారు.

బెస్ట్‌ పాఠశాలల్లో సీట్లకు పేద పిల్లల పాట్లు

🌻విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నా బెస్ట్‌ అవేలబుల్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు వారు ఎంపిక చేసుకున్న పాఠశాలలో చేరేందుకు జాప్యమవుతోంది. ఇందుకు ఆన్‌లైన్‌లోనే కొన్ని సమస్యలున్నాయని, వాటిని సవరించడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
🌻 ఈ పాఠశాలల ఎంపికకు లాటరీ పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. ప్రభుత్వం గతేడాది నుంచి ఈ ప్రవేశాలను ఆన్‌లైన్‌కు మార్చింది. ఈ పద్ధతిలో విద్యార్థి కోరుకున్న పాఠశాల ఎంపికకు ఆన్‌లైన్‌లో మూడు ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో ఈ అభ్యర్థులకు కేటాయించిన సీట్ల లభ్యతను బట్టి ఆ మూడింటిలో ప్రాధాన్య క్రమంలో ఒక పాఠశాలలో సీటు ఇస్తారు
🌻విద్యార్థికి సమీప పాఠశాలలు, అదే జిల్లాలో వేరే చోట పాఠశాలలు, ఇతర జిల్లాల్లోని పాఠశాలలుగా మూడు ఆప్షన్లు ఇచ్చుకునే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే విద్యార్థులకు ఈ సాఫ్ట్‌వేర్‌లో తాము మొదటి పాధాన్యమిచ్చిన పాఠశాల రాకుండా, రెండు, లేదా మూడో ఆప్షన్‌లోని పాఠశాలోనే సీట్లు వస్తున్నట్లు భావిస్తున్నారు. ఒకటి నుంచి 5వ తరగతిలోపు బాలబాలికలను తమకు సమీపంలోని పాఠశాలల్లోనే చేర్పించేందుకే తల్లిదండ్రులు ఇష్టపడటం సహజం. తమ పిల్లలను దగ్గరిగా ఉన్న పాఠశాలల్లోనే చేర్పించుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు అధికారుల చుట్టు తిరుగుతున్నారు.
🌻ఇలాంటి వారు రోజుకు కనీసం 40 మంది వస్తుంటారని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో అడ్మిషన్లు చేపట్టిన మాన్యువల్‌ విధానంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని నివారించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టగా, ఇక్కడా సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ కేటగిరీ కింద మొత్తం 6,650 సీట్లకు గాను 17665 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 6498 మందికి అడ్మిషన్లు కల్పించారు. మరో 152 సీట్లు ఖాళీగా ఉన్నాయి
🌻మొత్తం 6,650 సీట్లల్లో 2,600 సీట్లు ఒకటో తరగతివి కాగా, 4,050 సీట్లు ఐదో తరగతి కోసం కేటాయించినవి. ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం 8,243 మంది, అయిదో తరగతి కోసం 9,422 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సీట్లు తక్కువ దరఖాస్తులు ఎక్కువుగా వచ్చిన నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచాలనే అంశాన్ని ఇదివరకే మంత్రి నక్కా ఆనంద్‌బాబు దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీలకు కౌన్సెలింగ్‌ నిలిపివేత

*♦మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే*
🌻కాన్పూర్‌, జూలై 7: షెడ్యూలు ప్రకారం విద్యార్థులకు శనివారం నిర్వహించాల్సిన మూడో విడత ధ్రువపత్రాల తనిఖీ, కౌన్సెలింగ్‌ను ఐఐటీ కాన్పూర్‌ నిలిపివేసింది. దీంతో 23 ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2018లో అర్హత సాధించి, ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు దక్కించుకున్న లక్ష్మిశ్రీ అనే విద్యార్థిని పరీక్షా విధానంపై స్పష్టత ఇవ్వాలంటూ మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
🌻తాను పరీక్షల్లో ఇచ్చిన నిబంధనలను కచ్చితంగా పాటించానని, ఉదాహరణకు జవాబు 7 అయితే నిబంధనల ప్రకారం 7.00గా జవాబు పత్రంలో రౌండ్‌ చుట్టానని.. అలా చేయని వారికీ మార్కులిస్తే ర్యాంకుల్లో తేడా వస్తుందని కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేసినట్లు ఐఐటీ కాన్పూర్‌ అధికారులు తెలిపారు.

సుమారు 32 వేల సీట్లు ఖాళీ..!

*♦- రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి*
🌻ఎంసెట్‌ -2018 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు 40 వేల సీట్లు మిగిలిపోగా, ఈ ఏడాది 32,855 సీట్లు మిగిలిపోయాయని లెక్క తేలింది. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులకు రాష్ట్ర వ్యాప్తంగా 460 కళాశాలలకుగాను కన్వీనర్‌ కోటాలో 95,455 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
🌻 వీటిలో 62,600 సీట్లు మాత్రమే భర్తీకాగా, 32,855 సీట్లు మిగిలిపోయాయి. ప్రధానమైన ఇంజనీరింగ్‌లో మరీ భారీగా సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్‌కు ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 287 కళాశాలలుంటే వాటిలో కన్వీనర్‌ కోటాగా 86,845 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
🌻వీటిలో రెండు విడతల్లోనూ 57,513 సీట్లు భర్తీకాగా, 29,332 సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా, ప్రైవేటు కళాశాలల్లోనే సీట్లు భారీగా మిగిలిపోయాయి. 22 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 4,750 సీట్లుండగా అవన్నీ భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఫార్మసీ కోర్సులో కన్వీనర్‌ కోటా క్రింద 3,274 సీట్లు ఉంటే...కేవలం 294 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
🌻రాష్ట్రంలో 7 ప్రభుత్వ, 102 ప్రైవేటు ఫార్మసీ కాలేజీలుండగా, ప్రభుత్వ కళాశాలల్లోని 187 సీట్లకుగాను 95 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక 107 ప్రైవేటు కళాశాలల్లో 3,087 సీట్లు కన్వీనర్‌ కోటాగాఉంటే వాటిలో కేవలం 199 సీట్లే భర్తీ అయ్యాయి. 2,888 సీట్లు మిగిలిపోయాయి. దీంతో ఫార్మసీలో 3,274 సీట్లుకుగాను మొత్తంగా 2,980 సీట్లు మిగిలిపోయాయి.
🌻ఫార్మా-డి వైపు విద్యార్థులు కన్నెత్తికూడా చూడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వ, 58 ప్రైవేటు ఫార్మా-డి కళాశాలలుండగా కేవలం 43 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. మొత్తం 59 కళాశాలల్లో 586 సీట్లకుగాను 543 సీట్లు మిగిలిపోయాయి.

టెండర్ల రద్దు .. బడి రూపునకు అడ్డు.

*♦పాఠశాలల్లో వసతుల*
*కల్పనకు రూ.378 కోట్లు*
*♦జాప్యం కానున్న పనులు - విద్యార్థులకు తప్పని ఇక్కట్లు*
🌻పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులను ఆకర్షించేలా పాఠశాల విద్యాశాఖ వసతులను కల్పించనుంది. కొద్దిరోజుల్లో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభమవుతాయనుకుంటే, గుత్తేదార్లు ఎక్కువ ధరకు టెండర్లు వేశారన్న కారణంతో ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కొద్ది రోజుల్లో జరుతాయనుకున్న పనుల్లో జాప్యం జరిగే అకాశాలు కన్పిస్తున్నాయి.
🌻జిల్లాలోని 4,105 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.378 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. నాలుగేళ్లలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించని ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులను సంతృప్తిపర్చేలా వసతులను కల్పించడానికి సిద్ధపడుతోంది. జిల్లాలో 3,224 ప్రాథమిక పాఠశాలలు, 366 ప్రాథమికోన్నత పాఠశాలలు, 515 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. హైబ్రిడ్‌ యాన్యూటీ పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలలను చూడముచ్చటగా తయారు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మూడు జిల్లాలను ఒక ప్యాకేజీ కింద టెండర్లు పిలిచింది. కొద్ది రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయని గుత్తేదారు భావిస్తుండగా, టెండర్లు రద్దుతో మళ్లీ మొదటికొచ్చింది.
🌻 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గుత్తేదారులకు బిల్లులు చెల్లింపుపై విధివిధానాలు కూడా ప్రభుత్వం తయారు చేయాల్సివుంది. జిల్లాలో పాఠశాలల వారీగా కల్పించాల్సిన మౌలిక వసతులకు సంబంధించి విద్యాశాఖాధికారులు తయారు చేసిన నివేదికపై సర్వశిక్ష అభియాన్‌ ఇంజినీర్లు అంచనాలు తయారు చేశారు. పూర్తిస్థాయిలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.378 కోట్లు ఖర్చవుతుందని పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
🌻 పాఠశాలలో విద్యుత్‌, రన్నింగ్‌ వాటర్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, బయోఫెన్సింగ్‌ సౌకర్యం కల్పించనుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి అదనపు తరగతిగదులు నిర్మించనున్నారు. ప్రధానంగా ఉన్నత పాఠశాలల్లో లేబొరేటరీ, గ్రంథాలయం, కంప్యూటర్‌ రూం, విద్యార్థులు కూర్చొనేందుకు ఫర్నీచర్‌, ప్రధానోపాధ్యాయునికి ప్రత్యేకగది, ఉపాధ్యాయులకు ఫర్నీచర్‌తో కూడిన గది ఏర్పాటు చేయనున్నారు.
🌻రాష్ట్రంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయల కోసం మంజూరైన నిధుల్లో అత్యధికంగా జిల్లాలో రూ.378 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్రంలో నాలుగువేల కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో విమర్శలపాలవుతోంది.
Tags