Type Here to Get Search Results !

అధ్వానం అభ్యసనా ఫలితాలు - జాతీయ సాధన సర్వే నివేదిక వెల్లడి

  • సామాన్యశాస్త్రంలో పరిస్థితి దారుణం
  • 76శాతం పైగా మార్కులు సాధించిన వారు 5.54% శాతం లోపే 
  • పది'లో రాష్ట్రంలో వెలుగు నీడలు..! • చిత్తూరు జిల్లా అన్నింటా వెనుకే.. 
  • జాతీయ సాధన సర్వే నివేదిక వెల్లడి
ఈనాడు - అమరావతి (రాష్ట్రంలో పదోతరగతి విద్యార్థుల అభ్యసన ఫలితాలు అధ్వానంగా ఉన్నాయి. సామాన్యశాస్త్రంలో మరీ వెనుకం జలో ఉన్నారు. 16% పైగా మార్కులు సాధించినవారు రాష్ట్రవ్యాప్తంగా 5. 54 శాతానికి మించి లేకపోవడం గమ నార్హం. 0-35మార్కులు సాధించిన వారు దాదాపు 40 శాతం మంది ఉండడం విశేషం. గణితం, సామాన్య శాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభ అంతంత మాత్రంగానే ఉంది. పదో తరగతి చదివే విద్యార్థుల ఆయా సబ్జెక్టుల్లో ప్రతిభను పరీక్షించి భవిష్యత్తులో తీసు కోవాల్సిన చర్యలను గుర్తించేందుకు జాతీయ విద్యా, పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) గత ఫిబ్రవరి 5న దేశ వ్యాప్తంగా 610 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. దేశం లోని రాష్ట్రంలోని 1,029 పాఠశాలల్లో 36,119 విద్యార్దు లకు గణితం, సామన్య, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, తెలు గులో పరీక్షలు నిర్వహించారు. నివేదికను జిల్లాల వారీగా విడుదల చేశారు. 0-35 మధ్య మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిభ పరంగా ప్రమాదంలో పడినట్లేనని, 36-50 మార్కులు వచ్చిన వారి ప్రతిభ మెరుగు పడాల్సి ఉందని సర్వే హెచ్చరించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అభ్యసన పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులతో పోల్చితే కొన్ని జిల్లాలు మినహా అన్నింటిలోనూ ఎయిడెడ్, ప్రైవేటు విద్యార్థులే ముందంజలో ఉన్నారు. బాలురు కంటే బాలికలే ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఎన్ సీఈఆర్టీ నిర్వహించిన జాతీయ సాధన సర్వే(న్యాస్) నివేదికలో బహిర్గతమైంది. అయిదు సబ్జెక్టుల్లో 180 ప్రశ్నలు ఇచ్చి పరీక్షించారు. 

అరకొరతోనే నెట్టుకొస్తున్నారు..

 ఒక్కో సబ్జెక్టులో 50శాతం మార్కులు దాటిన విద్యా రుల శాతం మరీ తక్కువగా ఉంది. ఎక్కువ శాతం మంది 50శాతంలోపు మార్కులనే సాధిస్తున్నారు. సామాన్యశాస్త్రంలో 51-75 మార్కులు వచ్చిన వారు చిత్తూరు జిల్లాలో కేవలం 12.30% మందే ఉన్నారు. గుంటూరులో 16.22%, కడపలో 17. 99%, కర్నూలులో 17.51%, విజయనగరంలో 15. 59%, ఉండడం చదువుల డొల్లతనాన్ని బయటతోంది. 76-100మార్కులు సాధించిన వారు చిత్తూరు జిల్లాలో 0.60%మంది మాత్రమే ఉన్నట్లు సర్వేలో వెల్ల డైంది. ఈ జిల్లా అన్నింటిలోనూ వెనుకబడే ఉంది. కర్నూలులో 1.04%, నెల్లూరులో 2. 20%, ప్రకాశం 2. 36%, కృష్ణా 1.64%, పశ్చిమగోదావరి 1.61%, విశాఖపట్నం 1.44% మంది మాత్రమే ఉన్నారు. . 

రాయలసీమలో అనంతపురం ఒక్కటే..

అన్ని సబ్జెక్టుల్లోనూ అనంతపురం జిల్లా రాష్ట్ర సరాస రితో సమానంగా ఉండగా.. చిత్తూరు కిందిస్థాయిలో నిలిచింది. చిత్తూరు జిల్లా సరాసరి గణితంలో 85. 18% ఉండగా.. రాష్ట్ర సరాసరి 40.94%గా ఉంది. సామాన్య శాస్త్రంలో 76-100మార్కులు వచ్చిన వారు కేవలం 0. 60% మందే ఉండగా..రాష్ట్ర సరాసరి 1. 97%గా ఉంది.
కర్నూలు జిల్లా సాంఘిక శాస్త్రం మినహా అన్నింటి లోనూ రాష్ట్ర సరాసరి కంటే దిగువనే ఉంది. కడప జిల్లా విద్యార్థులు ఆంగ్లం, భాష సబ్జెక్టులు మినహా అన్నింటి లోనూ రాష్ట్ర సరాసరి కంటే వెనుకే ఉన్నారు.

కృష్ణా రాజనీతిశాస్త్రంలో వెనుకంజ..

కృష్ణా జిల్లా విద్యార్థులు సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో రాష్ట్ర సరాసరితో సమానంగా ఉండగా.. మిగతా అన్నిం టిలోనూ మెరుగ్గానే ఉన్నారు. అయితే, సాంఘిక శాస్త్రం లోని రాజనీతిశాస్త్రంలో రాష్ట్ర సరాసరి కంటే వెనుకబడడం విశేషం. ఆంగ్లం మినహా అన్నింటిలోనూ గ్రామీణ విద్యా రులే అధిక్యం ప్రదర్శించారు. గుంటూరు జిల్లా విద్యార్థులు గణితం, సామాన్యశాస్త్రాల్లో వెనుకుండగా భాషా సబ్జెక్టులో మాత్రం ఉత్తమ ప్రతిభ చూపారు. ఆంగ్లంలో ఇచ్చిన దాన్ని చదివి సరైన సమాధానాలు రాసింది 39.26% మంది మాత్రమే. ప్రకాశం విద్యార్థులు ఆంగ్లంలో రాష్ట్ర సరాసరితో సమంగా నిలవగా.. మిగతా వాటిల్లో మంచి మార్కులు సాధించారు. నెల్లూరు జిల్లా విద్యార్థులు సామాన్య, తెలుగుమినహా అన్నింటిలోనూ వెనుకబడ్డారు.