Type Here to Get Search Results !

వనం - మనం ప్రతిజ్ఞ

*🌳 వనం - మనం 👫*

🤚 <> *ప్రతిజ్ఞ* <> 🤚

ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణాన్ని చేపడతానని...
పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి...
ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ..
ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని...
చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ...
వనాలను నరకనని, నరకనివ్వనని...
విరివిగా మొక్కలు నాటుతానని...
మన ఊరూరా, వాడవాడ, ఇంటా బయటా, అన్ని చోట్లా...
మొక్కలు నాటటంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి..
నవ్యాంధ్రప్రదేశ్ ను పచ్చని హారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని...
ప్రతిజ్ఞ చేస్తున్నాను...
~~~~~~~~~~~~~
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*అటవీ శాఖ*