Type Here to Get Search Results !

15/7/18 విద్యా విషయక వార్తా సమాహారం

సీఎం కార్యాలయానికి డీఎస్సీ ఫైల్‌!

♦నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్‌*
*♦ఆర్థికశాఖ కొర్రీలకు విద్యాశాఖ వివరణ*
🌻 నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి ఇక సీఎం చంద్రబాబు నిర్ణయమే మిగిలి ఉంది! టీచర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ఆర్థికశాఖ వేసిన కొర్రీలకు పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. మేనేజ్‌మెంట్‌ వారీగా ఎన్‌రోల్‌మెంట్‌, టీచర్లు-విద్యార్థుల నిష్పత్తికి సంబంధించిన సమాచారం కావాలని ఆర్థికశాఖ కోరగా వివరాలు పంపించారు.
🌻 అంతేకాదు డీఎస్సీతో సంబంధం ఉన్న రెసిడెన్షియల్‌, మోడల్‌, మున్సిపల్‌ విభాగాలతో కూడా ఆర్థికశాఖ సమావేశం నిర్వహించి పలు అంశాలపై వివరణలు తీసుకుంది.
🌻కొర్రీలన్నింటికీ సమాధానం రావడంతో డీఎస్సీలో ఎన్ని పోస్టులకు, ఏయే కేటగిరీల పోస్టులకు అనుమతి ఇవ్వాలన్న దానిపై ఆర్థికశాఖ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. పూర్తి సమాచారంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు తెలుస్తోంది. డీఎస్సీ-2018పై సీఎం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్‌ అవుతుందని, తదుపరి కేబినెట్‌లో పెట్టడం లాంఛనప్రాయమే అవుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
🌻 ఇదిలావుండగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్‌సీటీఈ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఎలా అమలు చేయాలన్న విషయమై ఇంత వరకూ నిర్ణయం తీసుకున్నట్లు లేదు. ఈ విషయాన్నీ పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది.

గొప్పలతో తిప్పలే..!_

* గత నాలుగేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనంలోకి జారుకుంటున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతో సాధించామంటూ తప్పుడు గణాంకాలతో సీఎం చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్కులు తీరని నష్టం కలిగించేలా పరిణమిస్తున్నాయి. ఒకపక్క విద్యారంగం పరిస్థితి దయనీయంగా ఉన్నా నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించుకోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు చేజారుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాఠశాల విద్యకు సంబంధించి విద్యార్థుల ప్రమాణాలపై నిర్వహించిన రెండు సర్వేల్లో పరస్పర విరుద్ధంగా ఫలితాలు రావటం గమనార్హం.

*♦విద్యారంగం నిధులకు భారీగా కోత
విద్యాశాఖకు సంబంధించి సర్వశిక్ష అభియాన్‌ ద్వారా గతంలో రూ. 2,600 కోట్ల నుంచి రూ.2,800 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు అందేవి. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయాయి. రూ.1,700 కోట్లయినా ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం రూ.1,200 కోట్లకు కుదించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ)కి విద్యా ఉపకరణాలు, విద్యా దర్శిని తదితరాల కోసం గతంలో ఏటా రూ.7 కోట్లు ఇస్తుండగా తాజాగా ఈ నిధులను కేంద్రం రూ.15 లక్షలకే పరిమితం చేసింది. జాతీయ వృద్ధి రేటు దాదాపు 7 % ఉండగా చంద్రబాబు ఏపీ గ్రోత్‌ రేటు ఏకంగా 11% వరకు ఉన్నట్లు చూపిస్తున్నారు. దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నందున ఏపీకి ఇక ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులతో పనేముంటుందని ఇటీవల నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించడానికి సర్కారు ప్రచార ఆర్భాటమే కారణమనే విమర్శిస్తున్నారు.

*♦వచ్చే ఏడాది ఫస్ట్‌ ర్యాంక్‌ మనదే: సీఎం
పాఠశాల విద్యలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉన్నట్లు ‘నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే’ (నేస్‌) – 2017 చెబుతున్న గణాంకాలు ఉత్త డొల్లేనని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్‌’ రూపొందించిన యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌) స్పష్టం చేస్తోంది. నేస్‌ గణాంకాల ప్రకారం విద్యలో దేశవ్యాప్తంగా మూడోస్థానంలో ఉన్నామని, వచ్చే ఏడాది ప్రథమ స్థానానికి చేరుకుంటామని సీఎం చెబుతుండటం గమనార్హం. అయితే నేస్‌ గత నివేదికల్లో వెనుకబడి ఉన్న రాష్ట్రం హఠాత్తుగా ముందజంలో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

నేస్‌’ పరీక్షల్లో వక్రమార్గం:
ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే (నేస్‌) గణాంకాలకు, స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ రూపొందించిన ‘అసర్‌’ నివేదికకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఏ స్కూల్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి? ఎవరెవరితో రాయించాలి? అనేది పాఠశాల విద్యాశాఖే చూస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ హిందీలో పంపే ప్రశ్నపత్రాన్ని తెలుగులో తర్జుమా చేయిస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని నేస్‌ పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొనేందుకు ప్రశ్నపత్రాలకు అనుగుణంగా విద్యార్థులను ముందే సిద్ధంచేశారనే విమర్శలున్నాయి.

*👉అసర్‌ ప్రకారం..*
*♦3వ తరగతి-
 8.1 శాతం మంది తెలుగు అక్షరాలనూ గుర్తించలేకపోతున్నారు.
- 16.8% మంది అక్షరాలు చదవగలుగుతున్నా పదాలు చెప్పలేరు.
- 22.8 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 2.8శాతం మంది 9 వరకు ఉన్న అంకెలను గుర్తించలేకపోతున్నారు.
- 41.5% మంది రెండంకెల తీసివేతలు చేయగలుగుతున్నా విభాగాలను చేయలేకపోతున్నారు.
- 6.6% మంది మాత్రమే విభాగించడం చేయగలుగుతున్నారు.

*♦5వ తరగతి*
- 4.5% మంది తెలుగు అక్షరాలను చదవలేరు.
- 7.3 శాతం మంది అక్షరాలు గుర్తిస్తున్నా పదాలు చదవలేకపోతున్నారు.
- 55.1 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తుకాన్ని చదవగలుగుతున్నారు.
- 21.6 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 2.7 శాతం మంది 9వరకు ఉన్న అంకెలను గుర్తించలేకపోతున్నారు.
- 37.2% మందే విభాగించడం చేస్తున్నారు.
- 31.7% మంది తీసివేతలు చేస్తున్న విభజించడం చేయలేకపోతున్నారు.

*♦8వ తరగతి*
- 1.6 శాతం మంది అక్షరాలు కూడా చదవలేకపోతున్నారు.
- 2.4 శాతం మంది అక్షరాలు చదువుతున్నా పదాలు చెప్పలేకపోతున్నారు.
- 4.3 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 77.8 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు.
- 1.0 శాతం మంది 9వరకు ఉన్న అంకెల్ని గుర్తించలేకపోతున్నారు.
- 31.3 శాతం మంది తీసివేతలు చేస్తున్నా విభజించడం రాదు.
- 50.4% మందే విభాగించడం చేయగలరు

*♦టెన్త్‌లోనూ నేస్‌ ఫలితాలూ అంతే..*
ఎన్‌సీఈఆర్‌టీ ఫిబ్రవరిలో టెన్త్‌ విద్యార్ధులకు నిర్వహించిన ‘నేస్‌’ పరీక్షా ఫలితాలను పూర్తిగా ప్రకటించలేదు. ప్రాథమిక వివరాల ప్రకారం ఏపీ విద్యార్థులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ఒక సమావేశంలో ప్రకటించారు. అయితే వాస్తవ ప్రమాణాలు, నేస్‌ గణాంకాలకు ఎంతో వ్యత్యాసం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నేస్‌లో ఏపీ సగటు స్కోర్‌ గతంలో 46% ఉండగా 2017లో ఏకంగా 65 శాతానికి పెరిగి దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది.

గురుకులాల్లో 17 వరకు ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులురాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. సకాలంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయామని, మళ్లీ అవకాశమివ్వాలని చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తిచేశారు.
🌻వారికి అవకాశం కల్పిస్తూ సొసైటీ సెక్రటరీ రాములు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు గడువిచ్చారు.

58% ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కొలువుల్లేవ్‌

*♦2017-18 క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో నిరాశే*
*♦42 శాతం మందికే ఉద్యోగాలు..*
*♦ఆరేళ్లలో ఇదే అత్యధికం..!*
🌻న్యూఢిల్లీ, జూలై 14: ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు దేశవ్యాప్తంగా ఈ సారి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పెరిగాయి. కానీ, ఇప్పటికీ 58 శాతం మందికి కొలువులు దొరకడం లేదు. దేశంలో గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా 2017-18లో 42 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సాధించారు. అదేసమయంలో 58 శాతం మందికి ఉద్యోగావకాశం రాకపోవడం గమనార్హం.
🌻 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సమాచారం ప్రకారం.. 2013-14లో 31.95 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించగా 2017-18లో ఇది 41.74 శాతానికి చేరింది.
🌻భారీ సంఖ్యలో ఇంజనీరింగ్‌ కళాశాలలను మూసివేస్తుండడం, ఉన్న కాలేజీల్లోనూ చేరేవారి సంఖ్య తగ్గిపోవడం కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పెరగడానికి కారణమయ్యాయి.
🌻ఏఐసీటీఈ పర్యవేక్షణలో 2014-15లో 3400 ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 3225కు తగ్గింది. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో.. సీట్ల పెంపుపై నిషేధం విధించాలని పలు రాష్ట్రాలు ఏఐసీటీఈని కోరాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో కొత్తగా సాంకేతిక విద్యాసంస్థలను ఏర్పాటు చేయొద్దంటూ ఏఐసీటీఈ కేంద్ర మానవ వనరుల శాఖకు తెలిపింది. డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అదేసమయంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ మాత్రం పెరిగాయి.

*♦ఇంటర్న్‌షిప్‌లే కారణం..!*
ప్రభుత్వం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడం వల్లే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పెరిగాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటర్న్‌షి్‌పను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు సులువుగా దొరికాయని అంటున్నారు. ''3.8 లక్షల మందికి పైగా విద్యార్థులు మూడో సంవత్సరంలో వేసవి ఇంటర్న్‌షి్‌పలు దక్కించుకున్నారు. ఇదో పెద్ద విజయమే. వీరి సంఖ్య ఈ ఏడాది మరింత పెరగనుంది. ఆ ప్రభావం ప్లేస్‌మెంట్లలో కనిపిస్తుంది. మరింత మంది కొలువులు దక్కించుకోనున్నారు'' అని ఏఐసీటీఈ అధికారి ఒకరు తెలిపారు.

సీపీఎస్ రద్దుకు ఇక దేశవ్యాప్త ఉద్యమం

🌻విజయవాడ, జూలై 14: భారతదేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఇఎఫ్) ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఏఐఎస్‌జిఇఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్ తెలిపారు.
🌻విజయవాడలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన శనివారం మధ్యాహ్నం గాంధీనగర్ ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2004లో 27 రాష్ట్రాల్లో వర్తింపజేసిన సీపీఎస్ రద్దు కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు

*♦సీపీఎస్ విధానం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ రెండు డిమాండ్లే అజెండాగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పై రెండు డిమాండ్ల సాధనకై నవంబర్ 15న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు.
🌻 రెండు రోజులపాటు జరుగుతున్న సమావేశంలో అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఒరిస్సా, రాజస్థాన్, తెలంగాణా, తమిళనాడు, త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల ప్రతినిధులు దాదాపు 80 మంది పాల్గొన్నట్లు తెలిపారు.
🌻సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు పీ అశోక్‌బాబు మాట్లాడుతూ 27 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో ఏఐఎస్‌జిఇఎఫ్ చైర్మన్ సుభాష్ లంబా, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఏఐఎస్‌జిఇఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags