ఆర్టీసీలో 19% ఐఆర్
తెలంగాణ కన్నా 3% అధికంఈ నెల నుంచే 54,500 మందికి లబ్ధి
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ వర్ల
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ(16శాతం) కన్నా మెరుగైన మధ్యంతర భృతి ప్రకటించింది. సంస్థలో పనిచేసే కార్మికులు, సిబ్బంది, అధికారులకు 19ు ఐఆర్ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల నుంచే 54వేల మందికి పైగా ఆర్టీసీలో లబ్ధి పొందనున్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని శ్రీకాకుళంలో రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడలో ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వేర్వేరుగా ప్రకటించారు. ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుంది. పే రివిజన్ 54ు చెల్లించాలని గుర్తింపు యూనియన్ ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌తోపాటు కార్మిక పరిషత్, ఎస్‌డబ్ల్యూఎఫ్ సంఘాలు యాజమాన్యాన్ని కోరాయి.
కేరళ స్కూళ్లకు డిజిటల్ రూపు
తిరువనంతపురం : విద్యాంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కేరళలోని విద్యా సంస్థలన్నీ డిజిటల్ రూపు సంతరించుకుంటున్నాయి. ఈ స్కూళ్లలోని దాదాపు 40 వేల తరగతి గదులకు లాప్‌టాప్‌లు, మల్టీమీడియా ప్రొజెక్టర్‌ల వంటి అత్యాధునిక పరికరాలతో ప్రభుత్వం హైటెక్ హంగులద్దుతోంది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హైటెక్ స్కూల్' ప్రాజెక్టులో భాగంగా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) సంస్థ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన దాదాపు 40,083 తరగతి గదులకు అత్యాధునిక పరికరాలతో హైటెక్ హంగులద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలలో ఐటి విద్యను ప్రోత్సహించేందుకు కేరళ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కైట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ హైటెక్ సౌకర్యాలను అందిపుచ్చుకున్న అత్యధిక (5,096) తరగతి గదులతో ఉత్తర మలాప్పురం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని, తరువాతి స్థానాలలో పొరుగునే వున్న కోజిక్కోడ్ (4,105), త్రిస్సూర్ (3,497) నిలిచాయని కైట్ సిఎండి కె అన్వర్ సాదత్ చెప్పారు. ఈ స్కూళ్లలో ఈ వారాంతానికి దాదాపు 40,083 లాప్‌టాప్‌లు, మల్టీమీడియా ప్రొజెక్టర్లు, మౌంటింగ్ కిట్‌లు, యుఎస్‌బి స్పీకర్ల వంటి వాటిని సమకూర్చామని, మరో 16,500 లాప్‌టాప్‌లను ఆయా స్కూళ్లలోని కంప్యూటర్ లాబ్‌లకు అందచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 4,752 ప్రభుత్వ, ఎయిడెడ్ హైస్కూళ్లు, హయ్యర్ సెకండరీ, వొకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఇప్పటి వరకూ 3,676 స్కూళ్లలో అన్ని తరగతి గదులనూ హైటెక్ హంగులతో తీర్చిదిద్దామన్నారు. 702 స్కూళ్లలో 70 శాతం క్లాస్ రూమ్‌లను హైటెక్‌గా మార్చామని, అయితే 315 స్కూళ్లలో మాత్రం కేవలం 50 శాతం కన్నా తక్కువ స్థాయిలోనే డిజిటల్‌గా మారాయని ఆయన వివరించారు. కాగా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఒక్క హైటెక్ క్లాస్ రూమ్ కూడా లేని దాదాపు 59 స్కూళ్లున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 13,786 స్కూళ్లలో ఇప్పటి వరకూ 9045 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ సౌకర్యాన్ని సమకూర్చామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని స్కూళ్లకు ఆర్నెల్ల వ్యవధిలోనే 60 వేలకు పైగా లాప్‌టాప్‌లు, 42 వేలకు పైగా మల్టీమీడియా ప్రోజెక్టర్లు ఏర్పాటు చేసి హైటెక్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించటం తాము సాధించిన ఘన విజయమని ఆయన అభివర్ణించారు. క్లాస్ సబ్జెక్ట్‌ల బోధనకు రూపొందించిన సమగ్ర రిసోర్స్ పోర్టల్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని కైట్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ ఈ పోర్టల్‌లో 1,22,915 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా నమోదయ్యారన్నారు.నీట్' గ్రేస్ మార్కులపై సుప్రీంలో అప్పీల్*_
'నీట్'లో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైకి చెందిన విద్యార్థి సత్యదేవన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో తమిళనాట 24 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. అయితే తమిళ ప్రశ్నపత్రం తర్జుమాలో తప్పులు దొర్లడంతో ఆ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు మార్కులు తగ్గాయి. వారికి 196 గ్రేస్ మార్కులను కలపాలని, కొత్త నీట్ ర్యాంకుల జాబితాను విడుదల చేయాలంటూ సీబీఎ్‌సఈని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది.🌻 ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సత్యదేవన్ సుప్రీంకోర్టులో గత శనివారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఉత్సాహంగా బడికి..
*♦హ్యాపీ పీరియడ్ రూపొందించిన దిల్లీ విద్యాశాఖ**♦ఒత్తిడి లేని చదువుకు మార్గం సుగమం*
*♦దిల్లీ బాట పడితే ఆనంద విద్య సాకారం*
🌻పుస్తకాల మోత నుంచి క్షణం తీరిక లేకుండా చేసే హోంవర్కు వరకు బుడతళ్లకు అన్నీ భారమే. మార్కులు, ర్యాంకులు తప్పించి వేరే ధ్యాస ఉండట్లేదు.
🌻రోజులో ఎనిమిది పీరియడ్లు ఉంటే అందులో ఒక్క నిమిషం కూడా ఆటపాటలకు చోటుండదు. వారంలో ఒకటి, రెండు పీరియడ్లను కూడా ఆటలకు కేటాయించరు. ఒకటో తరగతి నుంచి వివిధ రకాల సిలబస్‌లంటూ ఒకటే రుద్దుడు. దీంతో బాల్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. తమ రోజువారీ కార్యక్రమాల్లో అత్యంత ఆనందాన్నిచ్చేదిగా మారాల్సిన చదువు వారికి భారంగా మారుతుంది. శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. ఈ పరిస్థితి నుంచి పిల్లల్ని బయటపడేసేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యను ఆనందమయం చేసే చర్యలు మన నవ్యనగరిలోనూ ఉండాలి.
ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని నిర్మించుకుంటున్నాం.
🌻 రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఆనందానికి అగ్రస్థానం ఉంది. ఆనంద ఆదివారాల్ని ఇందుకే నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ ఆనంద నగరాల సదస్సుకు అమరావతి వేదికైంది. ఇటీవలే మంగళగిరిలో విజయవంతంగా నిర్వహించుకుని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ ఆనందానికి ఏం చేయాలనే మేధోమథ]నం జరిగింది. అయితే మన పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయనే ప్రశ్న ఉదయిస్తే ఎన్నో రకాల సమస్యలు కళ్ల ముందు కదలాడతాయి. కలలోనూ చిన్నారులకు పాఠాలు, మార్కులు.. ర్యాంకులు గుర్తొచ్చేలా బోధన ఉంటుంది.
🌻 దీనికి ప్రత్యామ్నాయంగా దిల్లీ ప్రభుత్వం విద్యను ఆనందమయం చేసే చర్యల్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఆచరణలోకి తెచ్చింది. అది అందరికీ ఆదర్శంగానూ నిలిచింది.
*♦రోజులో 45 నిమిషాలు*
రోజులో ఏడెనిమిది గంటలు విద్యార్థులు పాఠశాలల్లోనే ఉంటారు. కొన్ని బడుల్లో ఆటలకు ప్రాధాన్యం ఉంది. 80 శాతం పైబడి విద్యాలయాల్లో వాటికి చోటులేదు. దిల్లీ విద్యాశాఖ హ్యాపీ కరిక్యులమ్ పేరుతో ప్రత్యేక సిలబస్‌ను రుపొందించింది. రోజులో 45 నిమిషాలు తప్పనిసరిగా హ్యాపీ పీరియడ్ ఉండేలా చర్యలు తీసుకుంది. ఆ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్ని రోజూ దీన్ని ఆచరించాలి. 45 నిమిషాల్లో ఐదు నిమిషాలు యోగా సాధనకు కేటాయిస్తారు. మిగిలిన 40 నిమిషాలు ఆటలు.. పాటలు.. పుస్తక పఠనం.. ఆహ్లాదం.. వినోదపరమైన అంశాలు ఉంటాయి. హ్యాపీ పీరియడ్ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. బడి పనిచేసే అన్ని రోజులూ ఇది ఆచరణలో ఉంటుంది. దీంతో ఇది విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
🌻 హ్యాపీ పీరియడ్‌ను ఆచరించకుంటే మొదటి తప్పుగా హెచ్చరికలు చేస్తారు. రెండో తప్పుగా నోటీసులు జారీ చేస్తారు. జరిమానాలు విధిస్తారు. మూడోసారి కూడా ఆనంద విద్యను పట్టించుకోకుంటే ఆ బడిని మూసేస్తారు. ఇంతటి కఠినమైన చర్యలు ఉండటంతో పాఠశాల యాజమాన్యాల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు హ్యాపీ పీరియడ్‌తో మరింత ఉత్తేజకరమైన విద్యను అందించవచ్చని భావిస్తుంటే ప్రైవేట్, కార్పొరేట్ బడులు సైతం అదేబాటను అక్కడ పడుతున్నాయి. విద్యా విధానంలో సమూల మార్పులకు హ్యాపీ కరిక్యులమ్ కారణమైంది.
*♦ఒత్తిడి తగ్గించాలి..*
గుంటూరు, కృష్ణా జిల్లాలు విద్యాహబ్‌గా ఉన్నాయి. రెండు జిల్లాల్లో సుమారు 9 వేల పాఠశాలలు ఉండగా 13 లక్షల మంది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పాఠశాల విద్యా ప్రణాళికలో ఆటపాటలు అంతగా చోటు లేదు. వ్యాయామ విద్య పుస్తకాలు ఇప్పటివరకు అందలేదు. మైదానాలుండి ఆటలాడే పరిస్థితి లేని పాఠశాలలు చాలా ఉండగా అవి లేనందువల్ల క్రీడలకు దూరంగా ఉన్నామని సాకులు చెప్పేవి చాలా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్రీడలంటే ఏంటో తెలియని పరిస్థితి ఉంటుంది. హ్యాపీ కరిక్యులమ్‌ను రూపొందించి రోజులో కనీసం 45 నిమిషాలు ఆనంద విద్యకు కేటాయిస్తే చదువు పట్ల పిల్లల్లో ఆసక్తి పెంపొంది బడికి వారు ఉత్సాహంగా అడుగులు వేస్తారు. దీంతో బడి మానేసే పిల్లల సంఖ్య కూడా తగ్గే అవకాశముంది.
*♦వేరే రాష్ట్రాల విధానాలూ ఆదర్శమే....*
*🔹మధ్యప్రదేశ్*
మధ్యప్రదేశ్‌లో ఆనంద మంత్రిత్వ శాఖ ఒకటి ప్రత్యేకంగా ఉంది. అక్కడ పాఠశాల, కళాశాల స్థాయిలో హ్యాపీక్లబ్‌లు ఏర్పాటు చేసి ఆనందానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఉల్లాసం.. ఉత్సాహభరితమైన వాతావరణంలో పిల్లల చదువులు కొనసాగేలా చూస్తున్నారు. సిలబస్‌లోనూ మార్పులు తీసుకొస్తున్నారు. మూస పద్ధతిలో బోధనకు స్వస్తి పలికి ప్రత్యక్ష అనుభవాలు.. ఆటపాటలు.. తెరతో కూడిన పాఠాల్ని చెబుతున్నారు.
*🔹ఉత్తరప్రదేశ్*
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ప్రతి శనివారాన్ని ఆనందమయంగా మార్చింది. ఆరోజు విద్యార్థులు పుస్తకాలతో బడికి రారు. బడిసంచి అనేది పట్టరు. మోత బరువుకు చాలా దూరంగా ఉంటారు. పాఠశాలలోనే ఒకటి.. రెండు పుస్తకాల్ని ఉంచి వాటితో చదువు కొనసాగిస్తారు. క్రీడలు, వినోదాన్ని కలిగించే అంశాలు ఆ రోజంతా ఉంటాయి.
*🔹తమిళనాడు*
తమిళనాడులో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ప్లేస్కూళ్లు అందరినీ ఆకర్షించాయి. ఉదయం 8.30 నుంచి 12.30 వరకు అక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తరగతులు ఉంటాయి. నాలుగు గంటల చదువులోనూ సగం సమయం ఆటపాటలకే కేటాయిస్తారు. ప్రతి అంశంలోనూ అంతర్లీనంగా పాఠాలు ఉంటాయి. ఒత్తిడి లేని చదువులు ఉంటాయి.
🌻మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని రిషివ్యాలి పాఠశాల ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు అక్కడ ఉన్న నవ బోధనా విధానమే కారణంగా ఉంది. పుస్తకాల్లేకుండా రోజూ ఇంటి నుంచి పిల్లలు బడికి వచ్చి ఎలాంటి ఒత్తిడి లేకుండా బృందంగా అన్నీ నేర్చుకుంటారు. అన్నీ క్రియాశీలకంగా ఉంటాయి. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల ఆధారంగా బోధన ఉంటుంది. అందరికీ ఒకే బోధనా విధానం ఉండదు.
ఎస్సీ విద్యార్థులపై ఒత్తిడి వద్దు
🌻న్యూఢిల్లీ, జూలై 15: షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థుల్లో పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలకు అర్హులైన వారికి సొమ్మును చెల్లించేందుకు వీలుగా గడువును పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీంను ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యా సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోరింది.🌻ఈ ఆదేశాలను విద్యా సంస్థ లు పాటించాలని ఆదేశించింది. ఎస్సీ విద్యార్థులు ఫీజు చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారనే కారణంపై కొన్ని విద్యా సంస్థలు వారికి అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి.
🌻దీంతో ఈ ఏడాది మేలో ఈ అంశానికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.
🌻వివిధ విద్యా సంస్థ ల్లో పోస్టుమెట్రిక్ లేదా పదో తరగతి తర్వాత కోర్సుల్లో ఎస్సీ విద్యార్థులు చేరుతున్నారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కేం ద్రం పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాన్ని ప్రవేశపెట్టింది. కొత్తవిధానం కింద విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో ఉపకారవేతనాన్ని డిపాజిట్ చేస్తారు.