వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్‌కూ నీట్
వైద్య కోర్సులకు నిర్వహిస్తున్న నీట్ పరీక్షలాగే ఇంజనీరింగ్ కోర్సులకూ నీట్ పరీక్ష నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చే అవకాశముందని కేంద్ర సాంకేతిక మండలి ఉపాధ్యక్షుడు భూనియా పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్ ఇక నీట్ పరీక్షల ఆధారంగా జరుగుతుందని చెప్పారు