Type Here to Get Search Results !

నేడు ప్రయివేటు ఆస్పత్రులు బంద్‌

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ( ఎంసిఐ ) స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎమ్‌సి )ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం ప్రయివేటు ఆస్పత్రుల బంద్‌కు ఐఎమ్‌ఎ పిలుపునిచ్చింది. గత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రతిపాదించినప్పటికీ దానిని ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కౌన్సిల్‌లో సభ్యుల నియామకం, కొత్తగా ఏర్పాటు చేసే ప్రయివేటు వైద్య కళాశాలలకు సరళతర నిబంధనలు, అందులో ఫీజులపై నియంత్రణలేమి తదితర అంశాలు ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయివేటు ఆస్పత్రులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు సేవలు నిలిపివేస్తూ నిరసన తెలియజేస్తాయని ఐఎమ్‌ఎ రాష్ట్ర కార్యదర్శి జయశేఖర్‌ ప్రజాశక్తికి తెలిపారు
Tags