‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ: మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వ ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) పొందడానికి మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ 2018-19 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌లు పొందడానికి దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మైనారిటీ విద్యార్థులైన ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పారశీకులు, జైనులు వీటిని పొందవచ్చని వివరించారు.
దరఖాస్తు చేసుకోవడానికి (http://scholarship.gov.in) వెబ్‌సైట్‌లో వ్యక్తిగత పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో కళాశాల, పాఠశాలల్లో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యనిర్వాహక సంచాలకుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, విజయవాడ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.