మా పొట్ట కొట్టొద్దు- మంత్రి ఇంటి వద్ద MDM కార్మికుల బైఠాయింపు
- - ప్రైవేటుకివ్వొద్దని మంత్రి ఇంటి వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల బైఠాయింపు
- - స్వరూపరాణి, వరలక్ష్మీ సహా 150 మంది అరెస్టు
- - రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించి తమ పొట్ట కొట్టొద్దంటూ కార్మికులు విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద బైఠాయించారు. పోలీసుల తోపులాటలో మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ (సిఐటియు) రాష్ట్ర నేతలు కె స్వరూపరాణి, గూనూరు వరలక్ష్మి సహా పలువురికి గాయాలయ్యాయి. యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ సోమవారం ఉదయం మంత్రి ఇంటిని ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడిస్తారని ముందే తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇసుక తోట కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు ఒక్కసారిగా మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో కార్మికులు రోడ్డుపై బైఠా యించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ముట్టడి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు హాజరయ్యారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయ త్నించినా వారు అక్కడ నుంచి కదలక పోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్డుపై ఈడ్చికెళ్లి వ్యానుల్లోకి పడేశారు. చాలా మంది మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులు మహిళా కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. రాష్ట్ర
నేతలు కె స్వరూపరాణి, గూనూరు వరలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, కోటేశ్వరరావు సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిని ఎంవిపి కాలనీ, మూడో నగర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అంతకుముందు వరలక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారనీ, ఈ ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రయివేటుపరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. మిషన్ల ద్వారా వండితే ఇప్పటికే పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న, జి. మంగశ్రీ, ఎస్.అరుణ, తదితరులు పాల్గొన్నారు.