వర్సిటీలకు యూజీసీ లేఖ
బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు గురువారం యూజీసీ లేఖ రాసింది. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేసు తేలే వరకూ కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టరాదని, ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియను వాయిదా వేయాలని కోరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం 2017 ఏప్రిల్ 7న అలహాబాద్ వర్సిటీ కేసులో విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా కాకుండా డిపార్ట్‌మెంట్‌ను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్‌మెంట్ వారీగా రోస్టర్‌ను అమలు చేయాలని యూజీసీ లేఖలు పంపించింది.
దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తత్ఫలితంగా కేంద్రం, యూజీసీలు తీర్పును పునఃసమీక్షించాలంటూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేశాయి. ఈ వ్యవహారం ఈ నెల 2న విచారణకు వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... 50శాతం రిజర్వేషన్లకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది. దీంతో, రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడటం అనివార్యంగా మారింది.