Type Here to Get Search Results !

సి.పి.యస్. పై కమిటీ కాదు -రద్దు చేస్తూ ఉత్తర్వు జారీ చేయాలి : FAPTO

సి.పి.యస్. పై కమిటీ కాదు -రద్దు చేస్తూ ఉత్తర్వు జారీ చేయాలి : FAPTO

ఫ్యాప్టో సభ్య సంఘాల పోరాటాలకు స్పందిస్తున్న ప్రభుత్వం, సి.పి.యస్. రద్దు చేస్తూ - పాత పెన్షన్ ను పునరుద్దరిస్తూ ఉత్తర్వు జారీ చేయాలని ఫ్యాప్టో చైర్మన్ మరియు సెక్రటరీ జనరల్ పి.బాబురెడ్డి, జి. హృదయరాజు లు డిమాండ్ చేశారు. పదవీ విరమణ తరువాత సామాజిక భద్రత లేని సి.పి.యస్. వల్ల కుటుంబాలు జీవనాన్ని సాగించలేక తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్నాయని, అందుకే ఆ దుర్మార్గమైన విధానాన్ని రద్దు చేయాలని ఫ్యాప్టో అనేక పోరాట కార్యక్రమాలు చేసిందన్నారు. పోరాటాలకు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న ప్రభుత్వం సి.పి.యస్. రద్దు నిర్ణయం తప్ప మరే మభ్యపెట్టే ఆలోచన చేసినా, ఫ్యాప్టో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సిద్దంగా ఉన్నట్లు, ఫ్యాప్టో హెచ్చరిస్తుందని తెలిపారు.