సిపిఎస్ రద్దు చేయకపోతే - 18వ తేదీన చలో అసెంబ్లీ - ఫ్యాప్టో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుపై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్ 18వ తేదీన ‘‘చల్లో అసెంబ్లీ’’ చేపట్టనున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రోజు (11.09.2018) ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి అధ్యక్షతన జరిగిన ఫ్యాప్టో సెక్రటేరియేట్ సమావేశంలో మాట్లాడుతూ సిపిఎస్ పట్ల ప్రభుత్వ నిర్ణయం 17వ తేదీ నాటికి రాకపోతే 18వ తేదీన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్‌కు ప్రత్యక్షచర్య నోటీసు అందజేసినట్లు వారు తెలిపారు.
వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దుకోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్రం సమస్య అని, ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో పరిశీలించాలని చెప్పడం సరైందికాదని ఫ్యాప్టో నాయకులు అన్నారు.
అన్ని అంశాల్లో దేశంలోనే ముందుండాలని చెప్పే ప్రభుత్వం ఉద్యోగుల జీవన భద్రతను హరించే సిపిఎస్ రద్దు చేయడంలో కూడా మన రాష్ట్రం ముందుండాలని వారు అన్నారు. సిపిఎస్ రద్దు చేసేవరకు ఫ్యాప్టో పోరాటాలు కొనసాగుతాయని వారు ప్రకటించారు.
ఈ సమావేశంలో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు, కో`చైర్మన్లు జి.నాగేశ్వరరావు, పి.పాండురంగ వరప్రసాద్, పి.కృష్ణయ్య, జి.వి.నారాయణరెడ్డి, డెప్యూటీ సెక్రటరీ జనరల్ సిహెచ్.శరత్‌చంద్ర, కార్యదర్శి కె.ప్రకాష్‌రావు, జెఏసి సెక్రటరీ జనరల్ సిహెచ్.జోసెఫ్ సుధీర్‌బాబు పాల్గొన్నారు.
(పి.బాబురెడ్డి) చైర్మన్
(జి.హృదయరాజు) సెక్రటరీ జనరల్