Type Here to Get Search Results !

పండిత, పిఇటి పోస్టులు అప్గ్రేడేషన్ - అర్హతగలిగిన వారికి ప్రమోషన్స్ కల్పించాలి

శ్రీయుత ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి గారికి విద్యాశాఖ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆర్యా!
  • విషయం: పాఠశాల విద్య - పండిత, పిఇటి పోస్టులు అప్గ్రేడేషన్ - అర్హతగలిగిన వారికి ప్రమోషన్స్ కల్పించాలని విజ్ఞప్తి
  • సూచిక : జిఓ ఎంఎస్ నం.74; తేది. 2009, 2017

పండిత, పిఇటి పోస్టులు అప్గ్రేడేషన్ - అర్హతగలిగిన వారికి ప్రమోషన్స్ కల్పించాలి

  • పాఠశాల విద్యాశాఖలో 10244 పండిత, 2603 పిఇటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
  • సదరు అప్ గ్రేడెడ్ పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని, పై సూచికలోని ఉత్తర్వులలో పేర్కొన్నట్లుగా అర్హత కలిగిన వారందరికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
  • ఏదైనా పోస్టులు భర్తీ చేయునప్పుడు రిక్రూమెంట్ కు , ప్రమోషన్స్ కు  ఒకే అర్హతలు ఉండాలి. అలా లేని సందర్భంలో సర్వీసుపరంగా అనేక సమస్యలు ఏర్పడతాయి.
  • విద్యాశాఖలో ఉన్న 72,73,74 జిఓలు ప్రభుత్వం నియమించిన సర్వీస్ రూల్స్ కమిటీ ఆమోదించడం ద్వారా వచ్చినవి.
  • 2017 ఆగస్టు 28వ తేదీన విజయవాడలో సర్వీస్ రూల్స్ కమిటీ కన్వీనర్ ఎం.వీ.సత్యనారాయణ (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్) అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో విద్యాశాఖమంత్రి, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు అందురు పాల్గొన్నారు.
  • విద్యాశాఖలో ఉన్న ఆం.ప్ర.సబార్డినేట్ సర్వీస్ రూల్స్ జిఓ నం.74 కోర్టులో ఉన్నందున అన్ని కేడర్ల ప్రమోషన్స్ ఆగిపోయి ఉన్నవి. అప్గ్రేడేషన్ ద్వారా పండిత, పిఇటిలకు ప్రమోషన్ ఇవ్వడం జరిగితే మిగిలిన ఎస్ఏ కేడర్లు అందురు తర్వాత ప్రమోషన్స్లో సీనియార్టీలో వెనకబడిపోతారు.
  • జిఓ ఎంఎస్ నం.74లో ప్రమోషన్ పొందాలంటే కనీస సర్వీస్ 3 సం||లు ఉండాలి. కనీస సర్వీసు లేని వారికి కూడ ప్రమోషన్స్ ఇవ్వడం జిఓకు విరుద్ధం.
  • కావున ప్రస్తుత సర్వీస్ రూల్స్ ను పరిశీలించి జిఓ ఎంఎస్ నం.74, తేది. 20.09.2017ను అమలు చేయాలి. సదరు జిఓలపై కోర్టులో కేసు నడుస్తున్నందున వెంటనే ప్రమోషన్లు ఇవ్వదలిస్తే సర్వీస్ రూల్స్ కమిటీ ఆమోదించిన జిఓలు 72,73,74ల ఆధారంగా అడ్హాక్ సర్వీస్ రూల్స్ రూపొందించిన తర్వాత అన్ని కేడర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇట్లు భవదీయులు
United Teachers Federation

Tags