Type Here to Get Search Results !

డీఎస్సీ ఫీజు గడువు 17కు పెంపు -టెన్స్ పరీక్ష ఫీజు గడువు 30 వరకు

DSC

డీఎస్సీ ఫీజు గడువు 17కు పెంపు 

18 వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం -పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి 
డీఎస్సీ-2018 దరఖాస్తు రుసుము చెల్లించేందుకు ఈ నెల 17 వరకు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్య కమిషనర్ కె.సం ధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో చేసిన తప్పులను సరిచేసుకునేందుకు గడువు ఇవ్వటంతో పాటు, బీఈ, బీటెక్, బీబీఏ తదితర కోర్సులు చదివిన అభ్యర్థులకూ డీఎ స్సీకి అవకాశం ఇచ్చినట్లు కమిషనర్ వివరించారు. ఈనెల 18లోగా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

పదో తరగతి పరీక్ష ఫీజు గడువు 30 వరకు పొడిగింపు 

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 30 వరకు పొడిగిం చినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా 30 వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 15 వరకు, రూ.200తో డిసెంబర్ 24 వరకు, రూ.500తో 2019 జనవరి 3 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Tags