Type Here to Get Search Results !

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్‌ కారణంగా ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్‌బీఐ తెలిపింది.

ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. గత నెల నవంబర్ 27న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది