న్యాయమైన వేతన సవరణ కోసం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కదంతొక్కారు. పిఆర్‌సి సాధన సమితి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న ఈ ఆందోళనల్లో ప్రతీ జిల్లాలోనూ ఉపాధ్యాయ, ఉద్యోగుల నిరసన గళాలు హోరెత్తాయి. ప్రభుత్వం మోసం చేసిందని.. తమకు నష్టం కలిగించే పిఆర్‌సి జిఒ లను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పిఆర్‌సి జిఒ లకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం సోమవారం సమ్మె నోటీసునిచ్చింది. మంగళవారం నుంచి ఉధృత ఉద్యమాలను ప్రారంభించింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి