Type Here to Get Search Results !

పాఠశాల విద్యలో ‘అభ్యసన పునరుద్ధరణ - అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు రూ.500

పాఠశాల విద్యలో ‘అభ్యసన పునరుద్ధరణ
కోవిడ్‌ సమయంలో విద్యార్థులు నష్టపోయిన అభ్యసనాలపై కేంద్రం ప్రణాళిక
విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం
అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు రూ.500
2022–23 విద్యాసంవత్సరానికి అందజేత
టీచర్ల రిసోర్స్‌ ప్యాకేజీ కింద ట్యాబ్‌లకోసం రూ.10 వేలు

బీఆర్సీ, సీఆర్సీల అభివృద్ధికి నిధులు
❇️2022–23కి సంబంధించిన సమగ్ర శిక్ష ప్రణాళికల్లో ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను సమర్పించాలని కేంద్రం సూచించింది. 2022–23లో విద్యార్థుల అభ్యసన మెరుగుదల ప్రక్రియల కోసం ఆర్థిక ప్యాకేజీలను అందించనుంది. అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్థాయిలోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇవ్వనుంది. ప్రైమరీకి సంబంధించిన 1–5 తరగతులకు ఇప్పటికే నిపుణ్‌ భారత్‌ మిషన్‌ కింద కేంద్రం సహకారం అందించింది. 


25 లక్షల మంది టీచర్లకు..
❇️విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియలను మెరుగుపర్చడానికి కేంద్రం టీచర్‌ రిసోర్స్‌ ప్యాకేజీ ఇవ్వనుంది. బోధనాభ్యసన ప్రక్రియలు హైబ్రిడ్‌ లెర్నింగ్‌ మోడ్‌తో కొనసా గించడానికి వీలుగా టీచర్లకు ట్యాబ్‌లు అందించనున్నారు. ఉపాధ్యాయులు వివిధ డిజిటల్‌ పోర్టళ్లలోని వనరులు, కంటెంట్‌ను ఉపయోగించుకోవడానికి వీటిని అందిస్తారు. ప్రాథమిక స్థాయిలో 25 లక్షల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇదేకాకుండా విద్యార్థుల్లో ఓరల్‌ రీడింగ్‌ ఫ్లూయెన్సీ, గ్రహణశక్తి పెంచడానికి చేపట్టే కార్యక్రమాల కోసం ప్రతి రాష్ట్రానికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వనున్నారు.

✳️బ్లాక్‌ రిసోర్సు సెంటర్లలో ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రానికి ట్యాబ్‌లతోపాటు రూ.8.8 లక్షల చొప్పున సహాయం అందిస్తారు. అలాగే క్లస్టర్‌ రిసోర్సు సెంటర్లను మరింత బలోపేతం చేయడానికి ఒక్కో సెంటర్‌కు రూ.వెయ్యి కేటాయించనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2022–23 విద్యాసంవత్స రానికి సంబంధించి సమగ్ర శిక్ష ద్వారా తమ ప్రణాళికలను ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ)కి పంపిస్తే కేంద్రం ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.  
Tags