పన్నుల శాఖకే పోటు! ఏపీలోని సబ్ ట్రెజరీల్లో భారీ కుంభకోణం
- 2 కోట్లకు రిటర్న్స్ వేసి రూ.25 కోట్లకు క్లెయిమ్
- ఒక్క సబ్ ట్రెజరీలోనే రూ.23 కోట్లు గల్లంతు
- టీడీఎస్ క్లెయిముల్లో కొందరు అధికారుల చేతివాటం
- విచారణ జరపాలంటూ ఆగస్టు 10నే ఐటీ లేఖ
- తప్పు ప్రైవేటు ఆడిటర్లదే అంటున్న ఎస్‌టీవోలు
- అందరూ కుమ్మక్కయ్యారంటున్న ప్రభుత్వ వర్గాలు
దేశమంతా పన్నులు వసూలు చేసి కేంద్రం ఖజానా నింపే ఆదాయపన్ను శాఖకే ఏపీలోని ట్రెజరీ అధికారులు భారీగా టోపీ పెట్టారు. ప్రైవేటు ఆడిటర్లను అడ్డం పెట్టుకుని ట్రెజరీ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్న వైనాన్ని ఉదాహరణలతో సహా ఐటీ శాఖ బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంపై తక్షణమే విచారణ జరపాలంటూ రాష్ర్టానికి ఆదాయ పన్ను శాఖ ఆగస్టు 10న లేఖ రాసింది. దీనిపై పలు ఎస్‌టీవో కార్యాలయాలు స్పందించాయి. తాము ప్రతి నెలా రిటర్న్ ఫైలు చేేస బాధ్యతను ప్రైవేటు ఆడిటర్లకు అప్పగిస్తున్నామని, రిటర్న్ దాఖలు చేయడానికి అవసరమైన వివరాలన్నింటినీ తాము ఆ ఆడిటర్లకు ఇస్తున్నామని వివరణ ఇచ్చారు.
అలాగే, ఆ వివరాలను వాడుకుని ప్రైవేటు ఆడిటర్లు తప్పుడు క్లెయిమ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ మొత్తం కుంభకోణంలో తమ పాత్రేమీ లేదని కేవలం ప్రైవేటు ఆడిటర్లే దీనికి బాధ్యులన్నట్టుగా ఎస్‌టీవోల వివరణ ఉంది. కానీ ఐటీ శాఖ కోరిన విధంగా విచారణ జరుపుతున్న ప్రభుత్వానికి ఈ కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ఆడిటర్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. వారిద్దరూ కుమ్మక్కయ్యే ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఈ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఐటీ శాఖ కేవలం కొన్ని ఎస్‌టీవోల్లో జరుగుతున్న ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. కానీ, రాష్ట్రంలో మిగిలిన ఎస్టీవోల్లో కూడా ఇదే తరహా కుంభకోణం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై కూడా విచారణ జరుగుతున్నట్టు చెప్పారు.
కుంభకోణం జరిగిన తీరిది...
సాధారణంగా డీటీఏ (డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్), పీఏవోలు (పే అండ్ అకౌంట్స్ ఆఫీస్), ఎస్‌టీవోలు (సబ్ ట్రెజరీ ఆఫీస్)... వేతనాల బిల్లులో గానీ, ఏదైనా బిల్లులోగానీ టీడీఎస్ కట్ చేస్తారు. టీడీఎస్ రూపంలో కట్ చేసిన పన్నును ఐటీ శాఖకు జమ చేస్తారు. దీనికి సంబంధించి ఎలాంటి చలానా ఉండదు. కాబట్టి ఫామ్ 24-జీలో ఏ నెలకు ఆ నెల కట్ చేసిన టీడీఎస్ వివరాలు పొందుపరిచి ఐటీ రిటర్నుల రూపంలో ఐటీ శాఖకు సమర్పిస్తారు. రిటర్నుల సమర్పణ పూర్తయ్యాక అందులో కొంత పన్నును తిరిగి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకు ఒక నెలలో ఒక ఉద్యోగికి వేతనంలో నుంచి ఎప్పట్లాగే రెండు శాతం టీడీఎ్‌సను డీడీవో కట్ చేశారనుకుందాం. కానీ, ఆ ఉద్యోగి టీడీఎస్ మొత్తాన్ని ఒకేసారి లేదా ఏడాది చివర్లో గాని మినహాయించుకోవాలని కోరితే, అంతకుముందు నెలలో కట్ చేసిన టీడీఎ్‌సను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా మరికొన్ని సందర్భాల్లో కట్ చేసిన టీడీఎ్‌సను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని రిటర్నులు దాఖలు చేసిన వెంటనే భారీగా క్లెయిమ్‌లకు పాల్పడుతున్నారు. రిటర్నుల రూపంలో చెల్లించిన పన్ను కంటే క్లెయిమ్ చేసుకుంటున్న పన్ను ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనార్హం. దీంతో ఐటీ అధికారులు అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా, ఏపీలో భారీ కుంభకోణం జరుగుతున్నట్టు బయటపడింది. ఐటీ శాఖ ప్రస్తావించిన ఉదంతాల్లో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెను ఉదాహరణగా చెప్పుకుందాం. ఇందులో ఒక నెలలో అక్కడి ఎస్‌టీవో కార్యాలయం పరిధిలో 2.10 కోట్లకు ఐటీ రిటర్న్ ఫైల్ చేశారు. దానికి సంబంధించి క్లెయిమ్ చేసింది రూ.25.83 కోట్లు. అంటే పన్ను రూపంలో ఐటీ శాఖకు రూ.2.10 కోట్లు జమ చేసి తిరిగి ఇవ్వమని అడిగింది రూ.25.83 కోట్లు. అంటే ఒక్క తంబళ్లపల్లెలోనే రూ.23 కోట్ల పైచిలుకు కుంభకోణం జరిగిందని ఐటీ శాఖ తేల్చింది. ఇదేవిధంగా మదనపల్లె, కాకినాడ, కొత్తపేట, పాలకొల్లు, రాజమహేంద్రవరం, చిత్తూరు, పీలేరు, వాయల్పాడు, పుంగనూరులోని ఎస్‌టీవో కార్యాలయాల్లో అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ తెలిపింది.
ఐటీ రిటర్నులు క్లెయిమ్ చేయాలంటే ఏఐఎన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నంబరుతోనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. ఎస్‌టీవోలో ఈ రిటర్నుల విధులు నిర్వహించే అధికారికి ఆ నంబరు ఉంటుంది. రిటర్నులతో పాటు తిరిగి పన్ను క్లెయిమ్ చేసుకోవాలన్నా అదే అధికారికి ఏఐఎన్ నంబరు వాడాలి. కాబట్టి దొంగ క్లెయిమ్‌ల్లో ఆ అధికారి ప్రమేయం ఉండే ఉంటుందని ఐటీ శాఖ అనుమానిస్తోంది. కానీ, ఎస్‌టీవో అధికారులు మాత్రం ఐటీ రిటర్నుల పనిని ప్రైవేటు ఆడిటర్లకు ఇస్తున్నామని, ఆ సమయంలో తమ ఏఐఎన్ వాడుకుని దొంగ క్లెయిమ్‌లకు పాల్పడుతున్నారని చెప్తున్నారు.
ఎస్‌టీవోలు-ప్రైవేట్ ఆడిటర్ల కుమ్మక్కు
కొన్ని ఎస్‌టీవోలు... ప్రైవేటు ఆడిటర్లు కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉన్నట్టు తెలిసిందని సమాచారం. విచారణ పూర్తయి ఐటీ శాఖకు నివేదిక సమర్పించాక కుంభకోణంలో పాలు పంచుకున్న ఎస్‌టీవోలపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఇతర ఎస్‌టీవోల్లో కూడా ఈతరహా కుంభకోణాలు జరుగుతున్నాయో లేదో విచారణ జరుగుతున్నట్టు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి
ప్రభుత్వ విద్యా సల హాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి నియ మితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరి పాలన శాఖ సోమవారం జీవో విడుదల చేసింది. కేబినెట్ ర్యాంకు హోదాతో సాంబ శివారెడ్డిని ప్రభుత్వ సలహాదారు (విద్య) గా నియమిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆయన ప్రస్తుతం పాఠశాల విద్య నియంత్ర ణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవోగా, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. సాంబశివా రెడ్డి స్పందిస్తూ.. తనపై నమ్మకం ఉంచి, మరింత బాధ్యత అప్పగించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.నేటి నుంచి ఆడిట్ శాఖ ఉద్యోగుల ఆందోళనలు
ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లు, శాఖాపరమైన సంస్కరణలపై కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నప్పటికీ విఫలం కావడంతో విజయవాడ ధర్నా చౌక్ ధర్నా చేపట్టనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవిశంకర్, అబ్రహం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలిరావాలని కోరారు. ప్రభుత్వ ఆదే శాలు లేనప్పటికీ ఇన్ఛార్జి స్టేట్ డైరెక్టర్ పదవిలో ఉన్న హరిప్రకాశ్ ఇష్టాను సారం శాఖ స్వరూపాన్ని మార్చేస్తున్నారని విమర్శించారు. తాము ఆందోళన లకు దిగుతామని ఈనెల 12న నోటీసు ఇవ్వగా చర్చలకు ఆహ్వానించారని, సోమవారం నాటి చర్చల్లో ఎలాంటి సానుకూల హామీ దక్కలేదని తెలిపారు. తమ సంఘం ఐక్యవేదిక సభ్యత్వం కలిగి ఉన్నందున ఆందోళనలకు మద్దతి వ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కోరారు.ఈఏపీసెట్ కౌన్సిలింగ్ 19నుంచి
ఇంజినీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు, ధ్రువపత్రాల పరిశీలన 19-21, కోర్సులు, కళాశాలల ఎంపి కకు ఐచ్ఛికాల నమోదు 19-22, ఐచ్ఛికాల మార్పు 23న, సీట్ల కేటాయింపు 26న ఉంటుంది. కళాశాలల్లో 26 నుంచి 31 వరకు రిపోర్టు చేయాలని సూచించారు.ఆర్మీ అభ్యర్థులకు గుంటూరులో రాత పరీక్ష
అగ్నివీర్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి నవంబరు 13న గుంటూ రులో రాత పరీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ కమిటీ డైరెక్టర్ షహజాద్ కోహ్లి తెలిపారు. రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, సత్యసాయి జిల్లాల అభ్యర్థులకు గుంటూ రులో రాత పరీక్ష జరుగుతుందన్నారు.ఏపీ పీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ఉన్న బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిం చిన ఏపీ పీసెట్-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సోమవారం ఖరార చేశామని ఆచార్య పిజాన్సన్ తెలిపారు. పీసెట్ ప్రవేశాలకు సంబంధించిన కమిటీ సమావేశం సోమవారం ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆన్లైన్లో ఈనెల 20 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్ సదు పాయం, ఈనెల 21 నుంచి 23 వరకు ఆన్లైన్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని హెల్సైన్ కేంద్రంలో ఈ నెల 22న ఎన్సిసి, క్యాప్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అలాగే ఈనెల 25 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్, ఈ నెల 27న వెబ్ ఆప్షన్స్ లో మార్పులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 29న సాయంత్రం ఆరు గంటల తర్వాత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశాలను కేటాయిస్తారు. ప్రవేశాలు < పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి నవంబర్ 4వ తేదీ లోపు వారికి కేటాయిం చిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో చైర్మన్ హేమచంద్రారెడ్డి తో పాటు పీసెట్ కన్వీనర్ ఆచార్య పి. జాన్సన్, ఉన్నత విద్యా మండలికార్యదర్శి ఆచార్య నజీర్ అహ్మద్, ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి, విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఆచార్య విజయమోహన్, ఎం శివ శంకర్ రెడ్డి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వెంకటరావు పాల్గొన్నారు.ఫోన్లతో చదువులా?
త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధన4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు
ఇప్పటికే స్మార్ట్ఫోన్ల వివరాల సేకరణ
ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు
విద్యా విధానంలో మార్పులతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు జాతీయ విద్యావిధానం పేరిట ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఆన్‌లైన్ బోధనకు సన్నద్ధమవుతోంది. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా బోధించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు విద్యార్థులు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్లు తెచ్చుకోవాలని విద్యాశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు కారణంగా తమపై ఆర్థిక భారం తప్పదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల చేతికి ఫోన్ ఇస్తే.. వారు చదువుతారా? లేదోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా వినియోగిస్తే పర్వాలేదు కానీ గాడి తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,16,047 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు వీరందరికీ త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధనకు ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. నవంబరు ఒకటో తేదీ నుంచి కొన్ని పరిమితులతో బోధన, స్టడీ అవర్స్ ఉంటాయని భావిస్తున్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యార్థి తల్లిదండ్రుల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను పాఠశాలకు తీసుకెళ్లాలి. తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థుల నుంచి స్మార్ట్ ఫోన్ ఉన్నదీ, లేనిదీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ వివరాలను యూ-డైస్ లాగిన్‌లో స్మార్ట్ ఫోన్ నంబర్‌తో సహా డేటాను క్యాప్చరింగ్ చేసి ఎంటర్ చేస్తారు. ఈ నెల 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. 20వ తేదీ నాటికి ముగిస్తారు. తర్వాత విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టలేషన్ చేయడానికి ఈ నెల 21 నుంచి రోజుకి ఒక తరగతి చొప్పున 28 వరకు షెడ్యూల్‌ను నిర్దేశించారు. ఈ మేరకు విద్యార్థుల స్మార్ట్‌ఫోన్‌లో బైజూస్ యాప్ డౌన్‌లోడ్‌తో పాటు పాఠ్యాంశాల కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సంబంధిత మండలాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లు(సీఆర్పీలు) ప్రధానోపాధ్యాయులకు సహకరించనున్నారు. కాగా 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నవంబరులో ట్యాబ్‌లను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 30,272 మంది 8వ తరగతి విద్యార్థులకు విడతలవారీగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తారని సమాచారం. ఇదే మాదిరి మిగతా తరగతుల విద్యార్థులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేస్తే.. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సర్వత్రా ఆందోళన
పుస్తకాలు పట్టుకునే చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్లు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నా వాటిని పిల్లలకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడక పొవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే బోధనకు సంబంధించిన బైజూస్ కంటెంట్‌తో పాటే ఇతర సైట్‌ల వైపు కూడా విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తరగతి గది బోధన వల్ల సత్ఫలితాలు ఉంటాయి తప్ప.. ఇటువంటి ధోరణులు విద్యార్థులను పెడదోవ పట్టించే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వమే ఇవ్వాలి
టీచర్ల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లతో ఆన్‌లైన్ పాఠ్యాంశాల బోధనను తెరపైకి తెచ్చింది. తరగతి గదిలో టీచర్లు ప్రత్యక్షంగా బోధిస్తేనే ఫలితాలు అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఇక విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే మరీ ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్‌లకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులందరికీ ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో అందింస్తే పాఠ్యాంశాల వరకే అవి పరిమితమవుతాయి. కనుక ఇబ్బంది ఉండదు. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ల వల్ల పాఠాలు చదవడం లేదని, పాడవుతున్నారని పలు సందర్భాల్లో రుజువైంది.
కిషోర్‌కుమార్,యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉద్యోగాల భర్తీకి భారీ కసరత్తు!
ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీల సమాచారం కోరిన కేంద్రంనిరుద్యోగులకు త్వరలోనే భారీ ఊరట లభించే అవకాశముంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్రం కసరత్తు ఆరంభించింది. ఖాళీల వివరా లను తెలియజేయాలంటూ అన్ని ప్రభు త్వరంగ సంస్థల నుంచి కేంద్రం సమా చారం కోరినట్టు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. దేశంలో నిరు ద్యోగం పెరుగుతోందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై గత జూన్ లో సమీక్షించి, యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. నియామకాలను దీంతో పర్యవేక్షించేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ ప్రత్యేకంగా కార్యదళాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే ఎన్ని కల నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీచేసే అవకాశముం దని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది డిసెంబరు వరకూ ఖాళీగా ఉన్న ప్రవేశస్థాయి ఉద్యోగాలను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నాటికి భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. 2020, మార్చి నాటికి వివిధ విభాగాల్లో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఇందులో ఒక్క రైల్వేలోనే 2.3 లక్షల
పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.
విలీన ఎయిడెడ్ సిబ్బందికి OlO పద్దు కింద జీతాలు
ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించిన ఎయి డెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన వారికి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 83 ఎయిడెడ్ పాఠశాలలను ప్రభు త్వానికి ఆస్తులతో సహా యాజమాన్యాలు అప్పగించాయి. 722 ఎయిడెడ్ పాఠ శాలల నుంచి 2,188 మంది సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమయ్యారు.అలర్ట్ కరోనా కొత్త అవతారం బీ ఎఫ్ .7
భారత్ లో గుర్తించిన గుజరాత్ ల్యాబ్
అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్