Type Here to Get Search Results !

Telugu Educational Employees News 17th Oct

టార్గెట్ లతో టార్చర్ 

సచివాలయ ఉద్యోగుల పై పని ఒత్తిడి 
ఉన్నతాధికారుల నుండి వేధింపులు 
టార్గెట్ పూర్తి చేయకపోతే సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు అంటూ హెచ్చరికలు 



హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల ఉద్యోగోన్నతులపై పెదవి విరుపు

మొదట విల్లింగ్.. తర్వాత నాట్ విల్లింగ్!
ఖాళీలు చూపకుండా ఉద్యోగోన్నతులు
నేటికీ ఉత్తర్వులు ఇవ్వని వైనం
ఆందోళన, అసహనంలో ఉపాధ్యాయవర్గాలు

అనంతపురం విద్య : మీకు ప్రమోషన్‌వచ్చిందా...? ఏ ప్లేస్‌ తీసుకున్నారు..? ఆర్డర్‌ కాపీ ఇచ్చారా.....? కొత్త ప్లేస్‌లో జాయిన్‌అవుతున్నారా? అని అడిగితే ఏ శాఖ ఉద్యోగి అయినా అవుననో, కాదనో సమాధానం చెబుతారు. కానీ ఇప్పుడు అవే ప్రశ్నలు పాఠశాల విద్యాశాఖలో ఇటీవల ప్రమోషన్లను ఎదుర్కొన్న టీచర్లను అడిగితే మాత్రం ఎలాంటి సమాఽధానం రాదు. ఎందు కంటే ఆ ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలే ఉండవు. ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించిన విద్యాశాఖ వారిని అడిగినా....ఊ అనలేరు..ఊహూ అనలేరు. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


'ప్రమోషన్‌ అనగానే ఓ స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఆనందపడ్డాడు. సీనియారిటీ జాబితాలో చోటు ఉండటంతో మరింత సంబరపడ్డాడు. అనుకున్నట్లుగా సర్ట్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వెళ్లాడు. ఎస్‌ఏ నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎం ప్రమోషన్‌కు విల్లింగ్‌ కూడా ఇచ్చాడు. అయితే ఎక్కడా ప్లేస్‌ ఇవ్వకపోవడం, ఆర్డర్‌ కాపీ ఇవ్వకపోవడంతో అయ్యో! పొరపాటున విల్లింగ్‌ ఇచ్చానంటూ మళ్లీ నాట్‌ విల్లింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆయాస పడ్డాడట'. ఇదీ జిల్లాలో ఇటీవల ప్రమోషన్లకు వెళ్లిన చాలామంది ఉపాధ్యాయుల పరిస్థితి.

ముందుకు ఒకటి... వెనక్కు రెండు అడుగులు...
ప్రమోషన్లకు టీచర్లు ఒక అడుగు ముందుకేస్తే..మరో రెండు అడుగులు వెనక్కు వేసే పరిస్థితి ఎదురైంది. ఇటీవల గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు 42తోపాటు స్కూల్‌ అసిస్టెంట్లు ఉర్దూ 21 పోస్టులు, హిందీ 45, ఇంగ్లిష్‌ 130, గణితం 47, గణితం (ఉర్దూ మీడియం) 6, ఫిజికల్‌ సైన్స్‌ (ఉర్దూ మీడియం) 6, ఫిజికల్‌ సైన్స్‌ (కన్నడమీడియం) 2, బయాలజీ (ఉర్దూ మీడియం)4,బయాలజీ (కన్నడ మీడియం) 2, సోషియల్‌ (జనరల్‌) 12, సోషియల్‌ (ఉర్దూ మీడియం) 4, స్కూల్‌ అసిస్టెంట్లు(పీడీ) 113 పోస్టులకు వెరిఫికేషన్‌నిర్వహించారు. చాలా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దొరకలేదు. ఎస్‌ఏ (పీడీ) పోస్టుల ప్రమోషన్లకు నలుగురు మినహా అర్హులైన అభ్యరులు లేరు. ఇక ఇతర పోస్టులకు అర్హులైన టీచర్లు ఉన్నా చాలా మంది ప్రమోషన్లు తీసుకోడానికి ముందుకు రాలేదు. దీంతో అతి కష్టం మీద సీనియారిటీ జాబితాలో వెతికి వెతికి మరీ జాబితా సిద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా చాలా మంది టీచర్లు ప్రమోషన్ల కోసం మొదట విల్లింగ్‌ ఇచ్చి తర్వాత నాన్‌ విల్లింగ్‌ ఇచ్చి జారుకున్నారు.

అంతా ఆర్భాటంగానే...
ఇటీవల ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌ అసిస్టెంట్లకు గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు కల్పించారు. ఈనెల 8వ తేదీ నుంచి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌నిర్వహించి, దశలవారీగా అభ్యర్థుల నుంచి ప్రమోషన్లకు విల్లింగ్‌, నాట్‌ విల్లింగ్‌ తీసుకున్నారు. అయితే ప్రమోషన్లపై స్పష్టత ఇవ్వకుండా అన్నీ నోటి మాటగానే నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్‌ పోస్టులు 42 ఉంటే తొలుత 54 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించా రు. మొదట్లో 18 మంది నాట్‌ విల్లింగ్‌ ఇచ్చారు. సీనియారిటీ జాబితాలో వారి తర్వాత ఉన్న వారిని వెరిఫికేషన్‌కు పిలిచేందుకు అధికారులు తలలు పట్టుకు న్నారు. ప్రమోషన్లకు రామంటూ చాలా మంది టీచర్లు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ వింత వైఖరి వచ్చిందం టూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు గగ్గోలు పెడుతున్నారు.

ఖాళీలు లేవు...కాగితాలూ లేవు
ప్రమోషన్లు పొందిన వారికి ఖాళీలు చూపలేదు. కనీ సం ప్రమోషన్‌ఇచ్చినట్టు చిన్న కాగితం కూడా ఇవ్వలేదు. స్కూల్‌ అసిస్టెంట్లకు కానీ, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు కానీ ప్రమోషన్లు పొందినట్లు ఏ ఒక్కరికీ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటికీ వారికి ఫలానా ప్లేస్‌ పోస్టింగ్‌ ఇస్తున్నట్లు కూడా ఇవ్వలేదు. త్వరలో నిర్వహించే ఉపాధ్యాయ బదిలీల తర్వాత వీరికి ప్లేస్‌లు కేటాయిస్తామంటున్నారు. బదిలీల తర్వాత దగ్గరి స్థానాలన్నీ భర్తీ అవుతాయని, ఇక మాకు ఎక్కడ ఖాళీలు దొరకుతాయంటూ చాలా మంది ఈ ప్రమోషన్లకు దూరం గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రమోషన్లకు విల్లింగ్‌ ఇచ్చిన టీచర్ల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపారు. నాట్‌ విల్లింగ్‌ ఇచ్చిన వారికి సర్వీస్‌ రిజిస్టర్‌(ఎ్‌సఆర్‌)లో ఎంట్రీలు వేశారు. అయితే ప్రమోషన్లు తీసుకోడానికి సరే అన్న వారికి మాత్రం నేటికీ ఉత్తర్వులు అందలేదు. ఈఏడాది టీచర్ల ప్రమోషన్ల ఇటు ఉపాధ్యాయులను, అటు విద్యాశాఖాధికారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వందల సంఖ్యలో ఉండే ప్రమోషన్లనే ప్రభుత్వం ఇలా నిర్వహిస్తే...వేలాది మంది టీచర్ల బదిలీలు ఇంక ఎలా నిర్వహిస్తుందోననే ఆందోళన, అసహనం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

విద్యా వేదన -విద్యార్థులకు విద్యాదీవెన వెతలు

ఫీజు రీయింబర్స్మెంట్పై అయోమయం
నూతన విధానంతో విద్యార్థులకు అగచాట్లు
పేరుకుపోతోన్న కళాశాల ఫీజుల బకాయిలు
బకాయిల కోసం యాజమాన్యాల నుంచి ఒత్తిడి
క్యాంపస్‌ సెలక్షన్లు, పరీక్షల నేపథ్యంలో హెచ్చరికలు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 వేల మందిపై ప్రభావం

విద్యా దీవెన.. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరికి ఇస్తారో తెలియదు. ఏ నిబంధన పెట్టి ఎగ్గొడతారో తెలియదు. సరే అర్హులకు అయినా సకాలంలో అందుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. మొత్తంమీద విద్యా దీవెనపై ఆధారపడి చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల వెతలు అన్నీఇన్నీ కావు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 వేల మంది విద్యార్థులు విద్యాదీవెన కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి దీవెన ఎప్పుడు అందుతుందో తెలియక ఒకవైపు.. ఫీజులు చెల్లించాల్సిందేననే కళాశాల యాజమాన్యాల హెచ్చరికలు మరోవైపుతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో కళాశాలలు తెరిచిననాడు ఫీజు కడితే తప్ప లోపలికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ఫీజుల బకాయిలు చెల్లిస్తే తప్ప వారు కాలేజీల నుంచి బయటపడటం.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఉండగా తీవ్ర మనోవేదనతో వారి తల్లిదండ్రులు ఉన్నారు.

జిల్లాలోని ఓ కాలేజీలో గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన ద్వారా అందే ఫీజు రీయింబర్స్‌మెంటే అతడి చదువుకు ఆధారం. కిందటేడాది విద్యాదీవెన పూర్తిగా రాలేదు. అతడు కళాశాలకు ఫీజు బకాయి పడ్డాడు. దీనికి ఫైనలియర్‌ రీయింబర్స్‌మెంటు కూడా తోడైంది. దీంతో ఫీజు బకాయి కోసం కళాశాల యాజమాన్యం అతడిపై ఒత్తిడి పెంచింది. విద్యాదీవెన రాగానే ఫీజు చెల్లిస్తామన్నా అంగీకరించలేదు. విద్యాదీవెనతో సంబంధం లేదు.. ఫీజు చెల్లించాల్సిందే అని పట్టుపట్టారు. ఫీజు లేకుంటే క్యాంపస్‌ ఇంటర్వూలకు పంపేది లేదని, పరీక్షలకు అనుమతించమని హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేది లేక అప్పు చేసి ఫీజు చెల్లించాల్సి వచ్చింది.

- ఇది ఈ ఒక్క విద్యార్థి పరిస్థితి కాదు. ఉమ్మడి జిల్లాలోని 96 వేల మంది విద్యార్థుల దీనస్థితి ఇది. త్వరలో క్యాంపస్‌ ఇంటర్వూలు జరగనున్నాయి. కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాల్లో అయితే ఇప్పటికే క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ప్రారంభించారు. అయితే ఈ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలంటే ఫీజులు బకాయిలు ఉండకూడదనే నిబంధనను ఆయా కళాశాలల నిర్వాహకులు విధిస్తున్నారు. విద్యా దీవెన వస్తుందన్నా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. కిందటేడాది బకాయితో పాటు, ఈ ఏడాది టర్మ్‌ ఫీజులు కూడా చెల్లించాలంటున్నారు. ఏమైనా చేసుకోండి ఫీజు మొత్తం చెల్లిస్తేనే ఇంటర్వ్యూలకు హాజరు అన్న నిబంధనతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. విద్యాసంవత్సరం మొదలవడంతోపాటే విద్యార్థులకు విద్యాదీవెన వెతలు మొదలయ్యాయి. జగనన్న విద్యా దీవెన సకాలంలో అందకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు ముసురుకున్నాయి. సాధారణ డిగ్రీ విద్యార్థుల ఇబ్బందులు ఒకెత్తయితే, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ వంటి టెక్నికల్‌ కోర్సులు చదివే విద్యార్థుల పరిస్థితి మరో ఎత్తు. వేలల్లో ఫీజులుండడంతో టెక్నికల్‌ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక చివరి విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థులపై ఒత్తిడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పేరుతో తీసుకొచ్చిన కొత్త రీయింబర్స్‌మెంట్‌ విధానమే దీనికంతటికీ కారణమని వారు వాపోతున్నారు.

పాత పథకానికే కొత్త హడావుడి
ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజులు చెల్లిస్తామని జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టేప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంది. అయినా ఆర్భాటంగా తన పేరుతో 'జగనన్న విద్యాదీవెన' అంటూ హడావుడి చేశారు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందన్న ఆశతో చాలామంది నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ వంటి టెక్నికల్‌ కోర్సుల్లో చేరారు. తీరా పథకం మొదలయ్యాక కోతలు, ఏరివేతలతో ప్రభుత్వం విద్యార్థులకు షాకుల మీద షాకులు ఇస్తూ వచ్చింది. రకరకాల నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 20 వేల మంది విద్యాదీవెనకు దూరం కావాల్సి వచ్చింది. విద్యార్థి కుటుంబానికి 10 ఎకరాలలోపు మాగాణి లేదా 25 ఎకరాలలోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాలలోపే ఉండాలని, పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండరాదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదని, ఆదాయపు పన్ను చెల్లింపుదారు కారాదని, పెన్షనర్లు ఉండకూడదని.. ఇలా సవాలక్ష నిబంధనలు పెట్టి విద్యార్థులను పఽథకానికి దూరం చేసింది. దీంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని చెప్పి మరో 10 వేల మందికి టోకరా ఇచ్చింది.
కొత్త విధానంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి
కిందటేడాది రావాల్సిన విద్యాదీవెన సగం మాత్రమే వచ్చింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి రెండు విడతల విద్యాదీవెన పెండింగులో ఉంది. గతంలో విద్యార్థుల ఫీజులను ఆయా కళాశాలలకే నేరుగా ప్రభుత్వం చెల్లించే పద్ధతి ఉండేది. ఈ విధానం కారణంగా యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజులు అడిగే అవకాశమే ఉండేది కాదు. దీంతో ఫీజుల విషయం పట్టించుకోకుండా విద్యార్థులు చదువులపై దృష్టి సారించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అపసవ్య విధానం కారణంగా నేరుగా విద్యార్థే ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తల్లుల ఖాతాలో విద్యా దీవెన పేరుతో ఫీజులు వేసే విధానం కారణంగా కళాశాల ఫీజుకు విద్యార్థి కుటుంబానిదే బాధ్యత అయ్యింది. అంటే ఫీజులు విద్యార్థి కుటుంబమే చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం విద్యాదీవెన బకాయిలు పెట్టినా దానితో సంబంధం లేకుండా తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి, అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇదే అదనుగా యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే కళాశాలలోకి రానిస్తామని, క్యాంపస్‌ సెలక్షన్స్‌కు, పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు

ముగిసిన ట్రిపుల్ ఐటీల ప్రవేశాల కౌన్సెలింగ్

ట్రిపుల్ ఐటీల్లో క్యాంపస్ మార్పునకు కౌన్సెలింగ్ నేటి నుంచి

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు క్యాంపస్లు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ గాంధీ వైజ్ఞా నిక, సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి కేసీ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని చాన్సలర్ ఆచార్య కేసీరెడ్డి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సోమవారం నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అవకాశం ఉన్న క్యాంపస్ ఎంచుకోవచ్చని సూచించారు. పదోతర గతి మార్కుల్లో మార్పులు ఉంటే వెబ్సైట్ లింకు ద్వారా మార్కులు నమోదు చేసి, ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. నాలుగు క్యాంపస్లో మిగిలిపోయిన సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ను త్వరలో ప్రక టిస్తామని వెల్లడించారు.

జీపీఎస్ అమలు చేస్తే ప్రతిఘటిస్తాం: యుటీఎఫ్

సిపిఎస్, జిపిఎస్ విధానాలు ఏమైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టమని, జిపిఎస్ ని అమలు చేస్తే ప్రతిఘటన తప్పదని, పాత పెన్షన్ సాధనకు ఉద్యమిస్తామని యుటిఎఫ్ రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ తెలిపారు. పాత పెన్షన్ విధానసాధన కోసం యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంబివికే విజ్ఞాన కేంద్రం విజయవాడలో సిపిఎస్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ 2019 లో అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ రెగ్యులర్ చేస్తామని, డిఏలు సకాలంలో ' చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ చెల్లిస్తామని చెప్పారు. వీటిలో ఒక్కటి కూడా అమలుపర్చలేదని విమర్శించారు. ఆ సిపిఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమం కాదని ఒప్పుకుంటూనే, జిపిఎస్ ను ప్రతిపాదిస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

30 వరకు దూరవిద్య ప్రవేశాల పొడిగింపు

మాచవరం ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యా లయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2022-23 విద్యా సంవత్సరం డిగ్రీ, పేజీ ప్రవేశాల గడువు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించామని సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం. అజంతకుమార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీతో ముగిసిన ప్రవేశాల గడువును పొడిగిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుం దన్నారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, పాలి టెక్నిక్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. పీజీలో ప్రవేశానికి మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పూర్తి వివరాలకు 0866-2434868, 73829 29642 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

నేడు టీచర్ల బదిలీ ఉత్తర్వులు?

ఎనిమిదేళ్ల సర్వీసుకు అంగీకారం
ఎట్టకేలకు షెడ్యూలు విడుదలకు నిర్ణయం

ఉపాధ్యా యులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సోమవారం బదిలీలకు సంబంధించిన ఉత్త ర్వులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు గరిష్ట సర్వీసును ఎనిమిదేళ్లకు పెంచింది. దీనికి సీఎంవో అంగీకారం తెల పగా ఈ ఫైలు పాఠశాల విద్య శాఖ కమి షనరేట్కు చేరింది. దీంతో బదిలీల షెడ్యూలు విడుదలకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. కాగా ఈ ఏడాది బదిలీలు రకరకాల మలుపులు తిరిగాయి. బదిలీలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సర్వీసును ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించింది. దీనిపై టీచర్లలో వ్యతిరేకత వ్యక్తమైనా దానిపై ముందుకెళ్ళింది. కానీ అదిగో ఇదిగో అంటూ షెడ్యూలు మాత్రం విడుదల చేయలేదు. ఇలా రెండు నెలలకు పైగా కాలం గడిపిన ప్రభుత్వం చివరికి ఐదేళ్ల నిర్ణయంపై వెనకడుగు వేసి ఎప్పటిలాగే ఎనిమిదేళ్ల సర్వీసు ప్రామాణికంగా తీసుకుంది.

ఉపాధ్యాయ పదోన్నతుల్లో ‘రివర్స్‌’

30 వేల నుంచి 4 వేలకు!.. ఫిబ్రవరిలో 30 వేల అంచనా
ఆగస్టుకు 10 వేలకు కుదింపు.. చివరికి ఇచ్చింది నాలుగు వేలే
దశాబ్దాల కల తీర్చామని ప్రచారం.. సర్కారు వ్యూహంతో టీచర్లు షాక్‌
పదోన్నతి వచ్చినా అక్కడే.. పీరియడ్లు పెంపు, మీడియంల కుదింపు

ఫిబ్రవరిలో 30 వేల మందికి పదోన్నతులు ఇస్తున్నట్టు అంచనా వేశారు. ఆగస్టు నాటికి ఈ అంచనా 10 వేలకు పడిపోయింది. చివరికి వాస్తవంగా ఇచ్చిన పదోన్నతులు నాలుగు వేలు. ఇదీ వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన పదోన్నతుల బహుమతి! ఇంకేముంది టీచర్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు కనీవినీ ఎరుగని రీతిలో 30 వేల మందికి రాబోతున్నాయంటూ ప్రచారం చేసుకున్న జగన్‌ ప్రభుత్వం చివరికి మొండిచేయి చూపింది. అప్పుడెప్పుడో అంచనా వేశాం కానీ వాస్తవంలో ఇంతేనంటూ 4 వేల నుంచి 5 వేల మధ్యలో పదోన్నతులు ఇస్తోంది. దీంతో పదోన్నతులు వస్తాయని భారీ సంఖ్యలో ఎదురుచూసిన టీచర్లకు నిరాశే ఎదురైంది. గత ఏడాది కాలం నుంచి ఇస్తామని ప్రచారం చేసుకున్న పదోన్నతుల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల ప్రకారం తీసుకుంటే ఒక్కో జిల్లాకు సుమారు 2 నుంచి 3 వేల మందికి పదోన్నతులు రావాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే వచ్చాయి. అందులోనూ కొన్నిచోట్ల భాషా పండితులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతతో పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటి వరకు చాలా మందికి పదోన్నతులు వస్తాయని పెట్టుకున్న టీచర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి.

పీరియడ్లు పెంపే కారణం!
పదోన్నతులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. వీటిలో ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 117 ద్వారా టీచర్లపై పనిభారం పెంచడం. అంటే గతంలో వారానికి 30 పీరియడ్లు బోధించే టీచర్లు ఇప్పుడు 36 పీరియడ్లు బోధించాలనే నిబంధన తెచ్చారు. అంటే సగటున ఒక టీచర్‌కు రోజులో కేవలం ఒక్క పీరియడ్‌ సమయం మాత్రమే ఖాళీ ఉంటుంది. అదే పాత విధానం అమల్లో ఉంటే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల అవసరం ఇంకా ఎక్కువ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండేది. అలాగే పాఠశాలల్లో తెలుగు మీడియం పూర్తిగా తీసేయడం వల్ల కూడా స్కూల్‌ అసిస్టెంట్ల అవసరం తగ్గిపోయింది. ఈ కారణాలతో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల అవసరం బాగా తగ్గిపోయింది. మరోవైపు ప్రభుత్వం వేసిన అంచ నా ప్రకారం పదివేల కంటే ఎక్కువ పాఠశాలల్లో తరగతులు విలీనం అవుతాయని భావించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత, ఇతర కారణాలతో అది 5,400కు పడిపోయింది. తరగతుల విలీనం తగ్గడంతో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల అవసరం తగ్గింది.
పదోన్నతి పొందినా అక్కడే
సాధారణంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో అక్కడికి వెంటనే బదిలీ చేస్తారు. కానీ, తాజా ప్రక్రియలో పదోన్నతి పొందిన వారికి ఎక్కడ ఖాళీలున్నాయో చూపించలేదు. దీంతో పదోన్నతి పొందిన వారు ప్రస్తుతానికి అక్కడే కొనసాగుతారు.

మరోవైపు రెండు సబ్జెక్టుల్లో అర్హత ఉండి ఒక సబ్జెక్టులోనే పదోన్నతి కోరుకున్న ఉపాధ్యాయులకు ఈసారి పదోన్నతి ఇవ్వలేదు. వారికి ఏడాది తర్వాత పదోన్నతులు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంతో నచ్చిన సబ్జెక్టులోనే పదోన్నతి కావాలనుకున్నవారు ఈ పదోన్నతులకు దూరమయ్యారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి: బొప్పరాజు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే హెల్త్‌ కార్డులు, ఏపీజీఎల్‌ఐ బాండ్లు జారీ చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. మొత్తం 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో బొప్పరాజు మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాలలో రెండో నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని, మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. కుటుంబంలో అర్హులైన వారి కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కోరారు.

పాత పింఛను ఇవ్వండి..: 1999 ఫిబ్రవరి నుంచి 2004 ఆగస్టు మధ్య కాలంలో నియమించబడ్డ విద్యుత్తు ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని విద్యుత్తు సౌధ జీపీఎఫ్‌ సాధన సమితి డిమాండ్‌ చేసింది. ఆదివారం అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ ఎ.సురేశ్‌బాబు, జి సత్యనారాయణ, వీవీఎస్‌ శ్రీకాంత్‌ తదితరుల నేతృత్వంలో గొల్లపూడిలో సమితి సమావేశం జరిగింది. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 5,311 మంది ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
Tags