Type Here to Get Search Results !

Telugu Educational News 5th Oct 2022

ఉద్యోగులకు ఈ-స్కూటర్లు

వాయిదా పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి సర్కారు అవకాశం
60 వాయిదాల్లో ధరను చెల్లించేలా ప్లాన
ఒక్కో వాహనంపై కిలోవాటు రూ.10 వేల వరకూ రాయితీ
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల చార్జింగ్ స్టేషన్లు

వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఆడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు. కూడా వస్తాయని అందులో పేర్కొంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. వారు కోరితే ఈ-వాహనాల కొనుగో అవకాశ కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది.

అందరికీ అవకాశం
వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి 24-60 నెలల్లో వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. కనీసం నెలకు రూ. 2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించను. న్నారు. అదే విధంగా ఈ పథకం కింద ప్రభుత్వో ద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో నెడ్ కాప్ ఒప్పం కుదుర్చుకుంది. వడ్డీరేటు 9 శాతం. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు ఆ సంస్థ సీఈఓగానీ లేదా మేనేజర్ కిగాని అధీకృత లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆసక్తిగల ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.


అందుబాటులోకి చార్జింగ్ స్టేషన్లు
ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్ క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి చోట్ల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాలను గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని నెడ్ కాప్ సంక ల్పించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కి.మీ.కు ఒకటి ఏర్పాటుచేయనుంది

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ ఢమాల్‌ 

  • దారుణంగా పడిపోయిన కొత్త విద్యార్థుల సంఖ్య 
  • ఒక్క ఏడాదిలో ఏకంగా 4.4 లక్షల మంది దూరం 
  • గతేడాది ప్రభుత్వ బడుల్లో 45.71 లక్షల మంది
  •  ఈసారి 41.24 లక్షల దగ్గరే ఆగిన విద్యాకానుక 
  • ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 5 లక్షల మంది
  •  ప్రవేశాలపై సర్కారు అంచనాలు తలకిందులు 
  • తరగతుల విలీనంతో విద్యార్థుల ప్రైవేటు బాట 
  • కొవిడ్‌ సమయంలో వచ్చినవారు తిరిగి వెనక్కి
  •  పిల్లల సంఖ్యపై కిమ్మనని పాఠశాల విద్యాశాఖ 
  • ‘నాడు-నేడు’, విద్యాకానుకతో ఫలితం తాత్కాలికం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో లక్షలాదిగా విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడంతో ‘నాడు- నేడు’, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాలతో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగిన ఆనందం తాత్కాలికమేనని తేలిపోయింది. ఓవైపు ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతుంటే, ప్రభుత్వ బడుల్లో కొత్తగా ఎవరూ చేరకపోగా, ఉన్నవారు కూడా వెళ్లిపోవడం సర్కారు ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది. 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) వివిధ పథకాలతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చినట్లు వైసీపీ సర్కారు ఘనంగా ప్రకటించుకుంటున్నా... అవి ఎందుకూ ఉపయోగపడటం లేదని స్పష్టమవుతోంది. కొవిడ్‌ సమయంలో తరగతులు లేవనే కారణంతో ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులను చూపించి... ఇది తమ ఘనతేనని ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులు లక్షల్లో వెళ్లిపోవడంతో తెల్లమొఖం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాజా లెక్కలను పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్యను పెంచడం మాట అటుంచి... ఉన్నవారిని కాపాడుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45.71 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య ఈ ఏడాది 47 లక్షలు దాటుతుందనే అంచనాతో పాఠశాల విద్యాశాఖ ఆ స్థాయిలో జగనన్న విద్యాకానుకలు సిద్ధం చేసింది. కానీ చివరికి కేవలం 41.24 లక్షల మందితోనే కానుకల పంపిణీ ఆగిపోయింది. అంటే కొత్త విద్యార్థులు రాకపోగా, ఉన్నవారిలో 4.47 లక్షల మంది ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటి లెక్కల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే ఆ సంఖ్య ఇప్పుడు 29.1 లక్షలకు చేరింది. అంటే 5.1 లక్షల మంది అదనంగా చేరారు. దీన్నిబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన సాధారణ వృద్ధి కూడా ప్రైవేటులో కలిసిపోయిందని తెలుస్తోంది. సాధారణంగా సొంతంగా పెరిగే సంఖ్యకు తోడు ప్రభుత్వం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా కలిసి ప్రైవేటు బడులు కళకళలాడుతుంటే... ఉన్నవారు కూడా వెళ్లిపోవడంతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. 

దెబ్బతీసిన సంస్కరణలు
 విద్యారంగంలో గొప్ప సంస్కరణలంటూ తీసుకొచ్చిన తరగతుల విలీనం విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటరు లోపు ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో వారంత ప్రైవేటు బాట పట్టారు. బడిలో టీసీలు తీసుకుని, మరో ప్రభుత్వ బడిలో చేర్పించాల్సి ఉండగా, నేరుగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. దీంతో 4, 5, 6 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 5,400 పాఠశాలల్లో తరగతులు విలీనం కావడం అక్కడ విద్యార్థుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు మారిన విద్యార్థులు కూడా కొవిడ్‌ పూర్తిగా తగ్గిపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. అలాగే ఈ ఏడాది సరిగ్గా పాఠశాలలు తెరిచే సమయంలో అమ్మఒడి నగదును ఖాతాల్లో వేయడం పిల్లల్ని ప్రైవేటు బడిలో చేర్పించి ఫీజు కట్టడానికి తల్లిదండ్రులకు ఉపయోగపడింది. 

రెండేళ్లకే సీన్‌ రివర్స్‌ 
కొవిడ్‌తో విద్యార్థులు ప్రభుత్వ బడులకు రావడం చూపించి దీన్ని ప్రభుత్వ పథకాల ఘనతగా అప్పట్లో వైసీపీ సర్కారు ప్రకటించుకుంది. నాడు-నేడు చూసే విద్యార్థులు క్యూ కడుతున్నారని, ఇక వారు శాశ్వతంగా ప్రభుత్వ బడుల్లోనే ఉంటారని చెప్పుకొంది. అయితే సరి గ్గా రెండేళ్లలో సీన్‌ రివర్స్‌ అయింది. ప్రభుత్వ బడుల్లో ఎంత వేగంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందో, ఈ ఏడాది అంతే వేగంతో టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఓ దశ లో కొన్ని పాఠశాలల్లో టీసీలు రాసే పుస్తకాలకు కొరత రావడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నిజంగానే నాడు-నేడు వల్ల పాఠశాలలల్లో విద్యార్థులు పెరిగి ఉంటే, రెండోదశ పనులు మొద లై మరిన్ని బడులను అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎందుకు వెళ్లిపోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. 

విద్యాంజలి పథకం-2.0 కింద  పాఠశాలలకు సేవలు అందించండి

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో విద్యాంజలి పథకం-2.0 కింద పాఠశాలల్లో సేవలు అందించడానికి స్వచ్ఛందంగా వాలంటీర్లు ముందుకు రావాలని ఎస్ఎస్ ఏఎంవో సుధాకర్ తెలిపారు. స్వచ్ఛందంగా సేవలుఅందించడానికి ముందుకు వచ్చే వారు ఆన్లైన్లో తమపేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తదితర కార్యక్రమాల్లోవారు సేవలు అందించవచ్చునని పేర్కొన్నారు.

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల కోసం ఆండ్రాయిడ్‌ యాప్‌ సిద్ధం

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో, కచ్చితమైన సమాచారం తెలియజేసేందుకు ఆ సంస్థ ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యూపీఎస్సీ అఫిషియల్‌’ పేరుతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో దీన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా సమాచారాన్ని వేగంగా అందించేందుకు దీన్ని సిద్ధం చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. అయితే ఇందులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు. సమాచారం తెలిపేందుకు మాత్రమే దీన్ని తయారుచేశారు. అభ్యర్థులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా నేరుగా ప్రతి చిన్న అప్‌డేట్‌నీ సులువుగా తెలుసుకోవచ్చు.

ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నూతన కరికులం

ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలు 
పది నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్షిప్
నాణ్యత పెంచేందుకు పొడొకాస్ట్స్
ఉన్నతవిద్యలో ఉన్నత ప్రమా ణాలు నిలిపే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
ముందుగా కరికులమ్లో భారీ మార్పులు చేసింది. పాఠ్యాంశాల్లో స్కిల్ డెవలప్మెంట్కు ఆస్కారం ఉండేలా, స్కిల్ ఎన్యాన్స్  మెంట్ జరిగేలా, లైఫ్ స్కిల్క్ కోర్సులు ఉండేలా మార్పులు  చేసింది. ప్రొఫెషన్ కోర్సులతోపాటు సంప్రదాయక కోర్సులైన బికాం, బిఎ, బిఎస్సీలలో కూడా పది నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ను అమలు చేస్తోంది. 
అంతేకాక రెండు నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఆన్ జాబ్ ట్రైనింగ్ అందిస్తుంది. 25 రకాల మార్కెట్ ఓరియేంటెడ్  డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. 67 రకాల బ్యాచ్లర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్న ప్రవేశపెట్టింది. వీటితోపాటు  2021-22 విద్యా సంవత్సరం నుండి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పిజి ప్రోగ్రాము  అందిస్తోంది. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులోనూ ఇదే మార్పులను ప్రవేశపెట్టింది. వీటికితోడు బిటెక్ విత్ హానర్, బిటెక్ విత్ మైనర్ కోర్సులను ప్రవేశపెట్టింది.

ఆన్లైన్ విద్యకు అధిక ప్రాధాన్యత

ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను అమలు  చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు నాణ్యత గల ఇ-కంటెంట్ను అందిస్తున్నారు. అంతేకాక  పొడ్కాస్ట్లను కూడా ఇస్తున్నారు. 411 పొగ్రామ్లపై పొడుకాస్ట్లను మొదటి సెమిస్టర్ కోసం రూపొందించారు. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్లకు కూడా పొడ్కాస్ట్లను రూపొందిస్తున్నారు.  140 ద్విభాషా పాడ్కాస్ట్లను కూడా ఎల్ఎంఎస్ కార్యక్రమం కూడా రూపొందించారు. 
విద్యార్థులు క్లాసులో పాఠాల కోసం పొడా కాస్ట్లను వినడం ద్వారా మరింత బాగా పాఠాలను అర్ధం చేసుకుంటారు. ఉన్నత విద్యా మండలి నాస్కామ్ ప్యూచర్ స్కిల్స్ ఎంవోయు కుదుర్చుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్ సిస్కో, సేల్స్ఫర్స్ వంటి సంస్థలతో కలిసి లక్ష విర్చూవల్ ఇంటర్న్షిప్ లు చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్ప్రెస్తో ఎంవోయు కుదుర్చుకోవడం ద్వారా 50 వేల
విర్చూవల్ ఇంటర్న్షిప్లను ఐసిసిఐ, విప్రో, ఐబిఎం, హీరో, హోండా లాంటి కంపెనీలతో కలిసి చేయనున్నారు.

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

సైన్స్‌లో అద్భుతమైన ప్రయోగాలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2022 సంవత్సరానికి గానూ భౌతిక శాస్త్రంలో అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతి లభించింది. క్వాంటమ్‌ మెకానిక్స్‌లో వారు చేసిన విశేష కృషికి గానూ అలియాన్‌ యాస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌, ఆంటన్‌ జెలింగర్‌లను ఈ పురస్కారం వరించిందని రాయల్‌ స్వీడిష్‌ సైన్స్‌ అకాడమీ మంగళవారం ప్రకటించింది. ఫోటాన్ల చిక్కుముడులతో ప్రయోగాలు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతల ఉల్లంఘనను ధ్రువీకరించడం, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రయోగాత్మక సాధనాలను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచడంతో క్వాంటమ్‌ సాంకేతికతో కొత్త శకం ఆరంభానికి పునాది పడిందని రాయల్‌ అకాడమీ ప్రకటించింది. గతేడాది కూడా ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలు నోబెల్‌ అవార్డును పంచుకున్నారు. బుధవారం రసాయన రంగంలో, గురువారం సాహిత్య రంగాల్లో అవార్డు విజేతలను ప్రకటించనుండగా, శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఎవరో తెలుస్తుంది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు డిసెంబరు 10న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. విజేతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనార్లు అందజేస్తారు.


ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలి

గుంటూరు(విద్య):జిల్లాలో మైనార్టీ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు విద్యార్థులు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖాధికారి షేక్ మహ్మద్ ని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సయ్యద్, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ప్రీ మెట్రిక్, బేగమ్ హజరత్ మహల్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు తెలిపారు.   అర్హత ఉన్న వారు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 93909497323లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు 

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ ములో 2022 కు ఆన్లైన్ కోర్సు లలో చేరుటకు గడువు అక్టోబర్ 10 వరకు పెంపు 

జాతీయ రిజిస్ట్రేషన్ విధానంలో ఏ పి

దేశమంతా ఒకే రిజిస్ట్రేషన్ విధానం కోసం కేంద్రం ప్రయత్నాలు 
ఇప్పటికే 12 రాష్ట్రాలలో ఎన్ జి డి ఆర్ ఎస్ ను ప్రవేశపెట్టిన కేంద్రం   

పనితీరు పై పంచాయిటీలకు ర్యాంకులు 

9 కేటగిరీలలో వివరాలు సేకరణ 
ప్రతీ కేటగిరీ వారీగా 20-23 అంశాలతో ప్రశ్నావళి 
ధరఖాస్తు చేయకపోతే కేంద్ర ఆర్ధిక సంఘ నిధులు నిలిపివేత 

సెంట్రల్ వర్శిటీ లలో నియామకాలకు ఉమ్మడి వేదిక 

అభ్యర్ధుల వివరాలను విశ్వ విద్యాలయాలకు పంపుతాం 
యుజిసి ఛైర్మన్ ఏం. జగదీశకుమార్ వెల్లడి 
కేంద్ర విశ్వ విద్యాలయాలలో నియామకాలకు ఉమ్మడి నియామక వెబ్ పోర్టల్ ఏర్పాటు 

గ్రూప్ -1 ప్రిలిమినరీ డిసెంబర్ 18 న 

గ్రూప్ -1 పరీక్ష తేదీలను ప్రకటించిన ఏ పి పి ఎస్సీ 


Tags