పిల్లల చదువుకు రిలయన్స్ రూ.2 లక్షలు ఫ్రీగా ఇస్తుంది... ఈ అర్హతలు ఉండాలి
కోర్సులతో సంబంధం లేకుండా స్కాలర్ షిప్ ఇవ్వనుంది. 2023 అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెరిట్ ఆధారంగా స్కాలర్ షిప్ అందజేయబడుతుంది. ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు గ్రాంట్ ను అందిస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, మహిళా విద్యార్థులు మరియు వికలాంగుల నుండి దరఖాస్తులను చురుకుగా ప్రోత్సహించే కార్యక్రమం పట్ల తన నిబద్ధతను వెల్లడించారు.
స్కాలర్‌షిప్ కోసం ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులు ఆప్టిట్యూడ్ పరీక్షలో వారి ప్రతిభ, 12వ తరగతిలో వారి గ్రేడ్‌లు, కుటుంబ ఆదాయం వంటి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా విద్యను పూర్తి చేయడమే దీని ప్రధాన లక్ష్యం.
భారత్ లో ప్రపంచంలోనే అత్యధిక యువజనులు ఉన్నారు. యువకులకు దేశాన్ని కొత్త శిఖరాల వైపు నడిపించే సామర్థ్యం ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యకు అవకాశం, ఉపాధి అందించేందుకు పనిచేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ సీఈవో జగన్నాథ కుమార్ తెలిపారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధర్యంలో 2022-23 విద్యాసంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ కు దాదాపు లక్ష మంది నమదు చేసుకున్నారు. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులను ఈ స్కాలర్ షిప్ లను అందజేశారు.
Click Here to APPLY Online