Type Here to Get Search Results !

స్థానికత గుర్తింపునకు విద్యార్హత 10 బదులు 7వ తరగతిగా తగ్గింపు

స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు

• 10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం

• అదనంగా మరో రెండు జోన్ల ఏర్పాటు • రెండు మల్టీ జోన్లు కూడా....

• రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు




♻️ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్‌ కేడర్స్‌ అండ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రాప్ట్‌ ఆర్డర్‌ 2023కు ఆమోదం.
  • ▪️జోనల్‌ వ్యవస్థలో మార్పులకు కేబినెట్‌ నిర్ణయం.
  • ▪️డిస్ట్రిక్‌ కేడర్‌గా టీచర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ.
  • ▪️జోనల్‌ కేడర్‌గా జూనియర్‌ అసిస్టెంట్‌ పైన ఉన్నవారు.
  • ▪️మల్టీజోన్‌ పరిధిలో సెకండ్‌ లెవల్‌ గెజిటెడ్‌ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్‌ సమానస్థాయి వారు.
  • ▪️స్టేట్‌ లెవల్‌ కేడర్‌ అంతా మల్టీజోనల్‌ కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, స్టేట్‌ లెవల్‌ ఇనిస్టిట్యూషన్స్.
  • ▪️స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు -10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం

స్థానికత గుర్తింపునకు విద్యార్హత 10 బదులు 7వ తరగతిగా తగ్గింపు

విద్యార్థుల స్థానికత (లోకల్) గుర్తిం పునకు విద్యార్హత స్థాయిని పది నుంచి ఏడో తరగతికి తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్న దానిపై దీన్ని నిర్ధారిస్తున్నారు. ఆ ప్రకారమే ఉద్యోగ నియామ కాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తోంది. దీన్ని అధిగమిం చేందుకు పది నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. ఆ ప్రకారం వారికి ఉద్యోగ, ఉన్నత విద్య ప్రవేశాల్లో అవ కాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం జోన్-1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. జోన్-2లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్-4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. రెండు జోన్లను ఆద నంగా పెంచడం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తు న్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీనివల్ల ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానికతకు సంబంధించిన విద్యార్హతల తగ్గింపు, 'జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదిం చాల్సి ఉంది.

రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీఓను బట్టి చర్యలు తీసుకుంటున్నందున ప్రతిపాదిత కొత్త మార్పులకు అక్కడే ఆమోదం లభించాలి. ఇది లాంఛనప్రాయమే. తెలంగాణలోనూ ఇలాగే జరిగింది. అలాగే ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ సర్వీసులకు లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్-2023కూ ఆమో దించింది. డిస్ట్రిక్ట్ కేడర్ టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వారి సమానస్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్ కేడర్గా జూనియర్ అసిస్టెంట్లు, ఆపైన ఉన్నవారు.. మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్ స్థాయివారు, స్టేట్ లెవల్ కేడర్ ఉద్యోగులంతా మల్టీ జోనల్ పరిధిలోకి (ఏపీ సెక్ర టేరియట్, హెచ్డీలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేపిటల్ ఏరి యాలో పోలీసు కమిషనరేట్ను మినహాయించి) వస్తారు. దీని వల్ల 95% పోస్టులు స్థానికులకు లభిస్తాయి.

Never Miss any Update: Join Our Free Alerts:

Tags