Day-5 19.06.2024 విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమాల ప్రణాళిక

🔹Language & Literacy Development



కథ :

PLAY The Video Below for Full Details


ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడిపోయింది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది.

నీటి కదలికకు అటు ఇటు పోతున్నది. పక్కనే చెట్టుపైన ఒక పావురము ఉన్నది. చీమ కష్టాన్ని చాలా సేపటి నుండి చూస్తున్నది.

పావురానికి చీమను చూసి చాలా బాధ వేసింది. చీమను ఇలాగైనా రక్షించాలని అనుకున్నది.

వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది. మెల్ల మెల్లగా ఆకు పైకి ఎక్కింది చీమ.

నీటి కదలికకు ఆకు ఒడ్డుకు వచ్చింది. ఆకుతో చీమ కూడా వచ్చింది. బతుకు జీవుడా అనుకున్నది చీమ.

కొన్ని రోజుల తర్వాత ఆహారం కోసం తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టు పై ఉన్నా పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు.

అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి, అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడు గురి పెట్టిన బాణం దారి మరలింది.

అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. చీమ పావురం ఎగిరి పోవడం చూసి సంతోష పడినది.

ఈ కథలోని నీతి:


తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు అవసరం అయినప్పుడు కూడా సహాయం చేయాలి.

చీమ, పావురం బొమ్మలు, పప్పెట్, మాస్క్ వంటి వాటి ద్వారా విద్యార్థులను ఆకర్షించే విధంగా చేయవచ్చు. విద్యార్ధులచే కృత్యాలు చేయించవచ్చు.

🔹Cognitive Development

వాసన వచ్చే కొన్ని వస్తువులు సేకరించి పెట్టుకోవాలి.

ఉదా: మల్లె, గులాబీ, సంపెంగ, కరివేపాకు, ఉల్లి, కర్పూరం, అగరుబత్తి, యాలకులు మొదలైనవి.

ఒక్కొక్క విద్యార్థికి కళ్లకు గంతలు కట్టి వాసన గుర్తు పట్టే వస్తువులను చూపించాలి. వాటి వాసన ద్వారా విద్యార్థులు వాటిని గుర్తు పట్టి, దానిపేరు చెప్పాలి.

ఇలా విద్యార్థులకు అన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి చూపించాలి. వాటిలో విద్యార్థులు ఎన్ని గుర్తించి, పేర్లు చెప్పారో, ఉపాధ్యాయులు గమనించి, పొందుపరచాలి

🔹Physical Development

వివిధ జిగ్ జాగ్ లైన్ (~, ^^^, _ , 0) వంటి గీతలు గీసి, విద్యార్థులను ఆ గీత పై ముందుకు నడవమని చెప్పాలి.

ఆ తర్వాత వెనుకకు నడవమని చెప్పాలి. ఇదే విధంగా అన్ని రకాల గీతలపై నడవమని చెప్పాలి.

ఒక్కొక్క విద్యార్థి ఏ విధంగా నడుస్తున్నాడో ఉపాధ్యాయులు గమనించాలి. వారు సరిగా నడిచే వరకు ప్రోత్సాహం అందించాలి.