Type Here to Get Search Results !

Day-30 Class 3-5 We Love Reading Summer Activities 29th May 2025

Day-30 Class 3-5 We Love Reading Summer Activities 29th May 2025 The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for 30th Day, 29th  May 2025are as follows:
 
Never Miss any Update: Join Our Free Alerts:

Day-30 Class 3-5 We Love Reading Summer Activities 29th May 2025

Day-30 Class 3-5 We Love Reading Summer Activities 2025. 29th May 2025. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 30th Day i.e., 29th May 2025. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-30 Class 3-5 We Love Reading: తెలుగు కథ : ఎనుగు తో స్నేహం
  • Day-30 Class 3-5 We Love Reading: English : Hare and Tortoise Pic and Word Story
  • Day-30 Class 3-5 We Love Reading: Maths: Ascending - Descending
  • Day-30 Class-3-5 We Love Reading: Draw Pictures with Numbers

Day-30 Class 3-5 We Love Reading: తెలుగు కథ : ఎనుగు తో స్నేహం



ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది.

చెట్టు మీద కోతిని అడిగింది, “కోతి, కోతి, నాతొ స్నేహం చేయవా?”

“నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడ లేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను?” అంటూ కోతి వెళ్లి పోయింది.

ఏనుగు చెట్టు మొదల్లో వున్న కుందేలుని అడిగింది, “కుందేలు, కుందేలు, నా తో స్నేహం చేస్తావ?”

కుందేలేమో, “నువ్వు నా లాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను?” అంది.

ఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. “కప్పా, కప్పా, నా తో స్నేహం చేయవ?” అని అడిగింది.

“నువ్వు నా లాగా గెంత లేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను?” అని కప్ప కూడా స్నేహం చేయలేదు.

ఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ, అన్నిటిని స్నేహం చేయమని అడిగింది. కాని అన్నీ ఏనుగు ని కాదని వెళ్లి పోయాయి. 

ఏనుగు పెద్దగా, నిదానం గా వుంటుంది కదా, వేరే జంతువుల లాగ ఎగర లేదు, గెంత లేదు, పరిగెత్త లేదు. అందుకని ఏ జంతువూ ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడ లేదు.

ఏనుగు పాపం వంటరి గానే వుండి పోయింది.

ఒక రోజు అడవిలో జంతువులన్నీ గబ గబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయం కనుక్కుంది.

“అడవిలోకి ఒక పులి వచ్చింది, ఆ పులి అన్ని జనువులని తినేస్తోంది, అందుకనే పారిపోతున్నాము” అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది.

ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే “పులి గారు, ఈ జంతువులను తినకండి, ప్లీజ్” అని అడిగింది.

పులి వికటంగా నవ్వి, “నీ పని చూసుకో పో!” అంది.

ఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగా బడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది.

ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులూ ఏనుగు మిత్రులై పోయాయి. అందరు కలిసి ఆడుకున్నారు.

మనలా లేని వాళ్ళను మనము ఎప్పుడు చిన్న చూపు చూడ కూడదు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ వుంటుంది.

Day-30 Class 3-5 We Love Reading: English : Hare and Tortoise Pic and Word Story


Day-30 Class 3-5 We Love Reading: Maths: Ascending - Descending

Day-30 Class-3-5 We Love Reading: Draw Pictures with Numbers



Tags