Type Here to Get Search Results !

గ్రూప్‌-1 ప్రక్షాళన! ప్రిలిమ్స్‌లోనే 2 పేపర్లు

గ్రూప్‌-1 ప్రక్షాళన! ప్రిలిమ్స్‌లోనే 2 పేపర్లు

*♦ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో ముసాయిదా సిలబస్‌*
రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రధానమైన గ్రూప్‌-1 సర్వీసె్‌సకి సంబంధించి సమూల ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ అడుగులు వేసింది. గ్రూప్‌-1ను మరింత ప్రతిస్టాత్మకంగా నిర్వహించాలని, అభ్యర్థుల ఎంపికను మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షల స్థాయిలను పూర్తిగా మార్చారు. ప్రాథమిక వడపోత పరీక్ష అయిన ప్రిలిమ్స్‌లోనే నెగెటివ్‌ మార్కులు ప్రవేశ పెట్టారు. ఇక, ప్రధాన పరీక్ష(మెయిన్స్‌)కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన సిలబ్‌సను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో ఉంచింది.

🌻వీటిపై ఆగస్టు 3 లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. ఈ సలహాలు, సూచనలను మరో నిపుణుల కమిటీకి నివేదిస్తారు. అనంతరం తుది సిలబ్‌సను ఖరారు చేయనున్నారు. సిలబ్‌సలో మార్పులతో పాటు పరీక్షల విధానంలోనూ పలు మార్పులు, చేర్పులను చేపట్టే దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.

*👉వివరాలు..*
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రస్తుతం ఒకే పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తుండగా.. ఇకపై రెండు పేపర్లను 120 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. ఇందులో ఒకటి జనరల్‌ స్టడీస్‌, రెండోది జనరల్‌ ఆప్టిట్యూడ్‌. కొత్తగా నిర్వహించ తలపెట్టిన జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో.. మెంటల్‌ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఎబిలిటీ, సైకలాజికల్‌ ఎబిలిటీ, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, రాజనీతి శాస్త్రం, జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అమలు, జాగ్రఫీపై ప్రశ్నలు ఇస్తారు.

🌻 ప్రిలిమ్స్‌ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ తరహాలో ఆయా పరీక్షలను నిర్వహించనున్నారు. తొలిసారిగా ప్రిలిమ్స్‌లో నెగిటివ్‌ మార్కుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి 3 తప్పు సమాధానాలకు ఒక మార్కును కట్‌ చేస్తారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లిషు పేపర్‌(తప్పనిసరి) మరో ఐదు డిస్ర్కిప్టివ్‌ టైపు పరీక్షలను నిర్వహిస్తుండగా.. ఇకపై వీటికి అదనంగా తెలుగు పేపర్‌(తప్పనిసరి) పరీక్ష కూడా నిర్వహిస్తారు.

🌻అంటే మొత్తం 7 పేపర్లు ఉంటాయి. కొత్తగా నిర్వహించే తెలుగు పేపర్‌లో తెలుగును ఇంగ్లిషులోకి అనువదించడం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, లెటర్‌ రైటింగ్‌, వ్యాసాలు, తెలుగు వ్యాకరణం వంటివి ఉంటాయి. ఇంగ్లిషు, తెలుగు.. ఈ రెండు క్వాలిఫైయింగ్‌ పరీక్షల్లో పాస్‌ కాని అభ్యర్థుల ఫర్ఫార్మెన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు.
Tags