కేంద్రం వరాల జల్లు.. వినియోగదారులకు పండగే!
టీవీ, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు సహా.. ప్రజలు సాధారణంగా వినియోగించే పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించారు. దీంతో పాటు శానిటరీ నాప్‌కిన్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ. 7 వేల కోట్ల భారం పడనుంది. ఇంతకు ముందు జనవరిలో జీఎస్టీ కౌన్సిల్ 29 రకాల వస్తువులపై పన్ను రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో అత్యధికంగా 200 వస్తువులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతం, 12 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు._
❄తాజాగా ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు మీకోసం..*
❄తాజాగా ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు మీకోసం..*
- వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీ, వీడియో గేమ్స్, వాక్యూమ్ క్లీనర్లు, ట్రైలర్స్, జ్యూసర్ మిక్సర్, గ్రైండర్లు, షేవర్స్, హెయిర్ డ్రయర్లు, వాటర్ కూలర్, వాటర్ హీటర్లు, లిథియం ఐరన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ ఐరన్, తదితర 17 రకాల వైట్ గూడ్స్‌పై 28 శాతం నుంచి 18 శాతం, 10 శాతం మేర పన్ను తగ్గించారు.
- 27 అంగుళాల సైజు వరకు టీవీలపై 18 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది.
- శానిటరీ నాప్‌కిన్లను మినహాయింపు కేటగిరీలోకి తీసుకురావడంతో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇంతకు ముందు నాప్‌కిన్లపై 12 శాతం పన్ను కేటగిరీలో ఉన్న సంగతి తెలిసిందే.
- పెయింట్స్, వాల్ పుట్టీ, వార్నిష్ తదితర వస్తువులు 28 శాతం నుంచి 18 శాతం పన్ను కేటగిరీలోకి వచ్చాయి.
- రూ.1000 కంటే ఎక్కువ ధర ఉన్న చెప్పులపై వసూలు చేస్తున్న పన్నును 5శాతానికి తగ్గించారు. ఆయిల్ కంపెనీలు వినియోగించే ఇథనాల్ ఆయిల్‌పై ఇంతకు ముందు 18 శాతం పన్ను విధించగా.. ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు.
- అన్ని రకాల లెదర్ వస్తువులపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.
- సెంట్, టాయిలెట్ స్పే తదితర వస్తువులు ఇప్పుడు 18 శాతం శ్లాబులోకి వచ్చాయి.
- ప్రత్యేక వాహనాలు, వర్క్ ట్రక్కులు, ట్రైలర్లపై జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించారు.
- మార్బుల్స్, స్టోన్, చెక్క బొమ్మలపై పన్ను మినహాయిస్తూ నిర్ణయించారు. రాఖీలు, బలవర్థకమైన పాలు కూడా పన్ను మినహాయింపు కేటగిరీలోకి వచ్చాయి.
- హ్యాండీక్రాఫ్ట్ వస్తువులపై 12 శాతం పన్ను అమలు కానుంది.హ్యాండ్ బ్యాగులు, జువెలరీ బాక్సులు, పెయింటింగ్స్ కోసం వాడే చెక్క పెట్టెలు, గ్లాస్ కళాకృతులు, స్టోన్ ఎండీవర్, అలంకరణతో కూడిన అద్దాలు, చేతితో చేసిన ల్యాంపులు తదితర వస్తువులన్నీ 12 శాతం పన్ను కేటగిరీలోకి వచ్చాయి.దిగుమతి చేసుకునే యూరియాపై జీఎస్టీ రేటును 5 శాతం వరకు తగ్గించారు.జీఎస్టీ కౌన్సిల్ ఈ సమావేశంలో మొత్తం 46 సవరణలు చేసింది. వీటిని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది.